ఆడ పిల్లలకు... మగ పిల్లలకు జన్మనిచ్చేది అమ్మే.... అత్తులూరి విజయలక్ష్మి- మహిళలపై అత్యాచారాలు, వరకట్న వేధింపులు అరికట్టాలి;
- ఆధ్య అనే స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు శరత్ బాబు...,
- మహిళల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభం...
- ఆధ్య అనే స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు శరత్ బాబు...
ఆధ్య అనే స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు శరత్ బాబు, హ్యూమన్ రైట్స్ ఛైర్మెన్ మహ్మద్ అసిఫుద్దిన్, అత్తులూరి విజయలక్ష్మి స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు నిరసిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు....
వెబ్ న్యూస్, హైదరాబాద్:
స్త్రీ లేనిదే సృష్టి లేదు... ఆడ పిల్లలకు....మగ పిల్లలకు జన్మనిచ్చేది స్త్రీనే అన్న విషయాన్ని గుర్తించాలని శ్రీనగర్ కాలనీ కార్పొరేటర్ అత్తులూరి విజయలక్ష్మి అన్నారు. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అమీర్ పేటలోని ఆధ్య అనే స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు శరత్ బాబు ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను హ్యూమన్ రైట్స్ ఛైర్మెన్ మహ్మద్ అసిఫుద్దిన్ ముఖ్య అతిథులుగా హాజరై గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లైంగికదాడులు, అత్యాచారం, యాసిడ్ దాడులను అరికట్టాలన్నారు. మన దేశంలో పావుగంటకోటి బాల్య వివహాలు, వరకట్న వేధింపులతో మహిళలు సతమతమవుతున్నారన్నారు. ఈ పరిస్థితి మారాలంటే రావాల్సింది మరింత కఠినమైన చట్టాలు కాదు ముందుగా సమాజంలో మార్పు రావాలన్నారు. ప్రతి స్త్రీని ఒక అమ్మగా.... అక్కగా చూస్తే మనిషికి సంస్కారం ఉంటుందన్నారు. మహిళలను కాపాడాలి.... బాల్య వివాహాలు వద్దు... బాలికా విద్యను ప్రోత్సహించాలనే నినాధాలతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొని సందడి చేశారు.