photo gallery

 

Wednesday, April 29, 2015

ఒప్పందాలతో ఏపీకి రూ. 35,745 కోట్లు

రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఇండస్ట్రీయల్ మిషన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ....దాదాపు 46 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి రూ.35,745 కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు.

Monday, April 27, 2015

హాస్టళ్ల స్థానే రెసిడెన్షియల్ స్కూళ్లు

 ఎస్టీ,ఎస్టీ విద్యార్థులకు కార్పోరేట్ స్ధాయి ఉన్నత చదువు కోసం ప్రస్తుతం ఉన్న హాస్టళ్లస్థానే రెసిడెన్సియల్ స్కూళ్లను ఏర్పాటుచేసేందుకు పరిశీలిస్తున్నామని రాష్ట్ర గిరిజన,సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఆదివారం రాత్రి చోడవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్టీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులకు ఖర్చుచేస్తామన్నారు. ఏ గ్రామంలోనైనా 40శాతానికి మించి ఎస్టీ,ఎస్టీలు ఉంటే సబ్‌ప్లాన్ నిధులతో అంతర్గతరోడ్లనిర్మాణం,ఇతర అభివృద్ధి పనులకు వందశాతం నిధులు మంజూరుచేస్తామన్నారు. 

విదేశాల్లో చదువుకోసం ఆసక్తి చూపే పేద విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి పథకం ఏర్పాటుచేస్తున్నామని, ఐఏఎస్, ఐపీఎస్ చదువుకోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో ఆర్థికసాయం అందజేస్తామన్నారు. నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 

నేటినుంచి ‘వేసవి బడులు’

 ఒకటి నుంచి ఐదో తగరతి వరకు విద్యనభ్యసిస్తున్న వారిలో వెనకబడిన విద్యార్థులను గుర్తించడం, బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించి విద్యను బోధించే వేసవి ప్రత్యేక తరగతులు సోమవారంతో ప్రారంభంకానున్నాయి.

గత సంవత్సరం నిర్వహించినట్లుగానేమండలంలోని నాలుగు క్లస్టర్లలో నాలుగు కేంద్రాల  ద్వారా ఈ యేడు కూడ వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండలంలోని సీఆర్పీలకు వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి శిక్షణను ఇచ్చారు. సోమవారం నుంచి మే 30 వరకు వేసవి బడులను నిర్వహించనున్నారు. గతేడాది నిర్వహించిన ప్రత్యేక తరగతులకు 50 శాతంలోపు విద్యార్థులు మాత్రమే హాజరుకావడంతో సత్ఫలితాలను పొందలేకపోయారు. 

Sunday, April 26, 2015

చంద్రబాబు దృష్టికి కీలక నేత నిర్వాకం !

జిల్లాలోని టీడీపీ కీలక నేత బాధితులంతా అధినేత చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పదవులిప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ నేరుగా అధినేత దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కీలక నేత బాధితులందర్నీ ఓ మాజీ ఎమ్మెల్యే  ఒకే గొడుగు కిందకి తీసుకొస్తున్నారు. తమకు నామినేటెడ్ పదవులిచ్చినా, ఇవ్వకపోయినా ఆ కీలక నేతకు మాత్రం ఎటువంటి పదవి ఇవ్వొద్దని చంద్రబాబును కోరేందుకు కంకణం కట్టుకుంటున్నారు.

బాబూ.. మాయమాటలు ఇంకెన్నాళ్లు

 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయమాటలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ప్రశ్నించారు. సింగ్‌పూర్ పర్యటనకు వెళ్లి రాష్ట్రాన్ని సింగపూర్‌గా మారుస్తానని, చైనా పర్యటనకు వెళ్లి చైనాలా అభివృద్ధి చేస్తానంటూ చెబుతూ ప్రజలను ముఖ్యమంత్రి మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం బాలరాజు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలన అంతా పర్యటనలకే సరిపోతుందని, కోట్ల రూపాయలు విదేశాల పర్యటనలకే ఖర్చు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అట్టడుగుస్థాయికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
  ఇంటికో ఉద్యోగం అంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతి అంటూ నిలువెల్లా మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కొత్త కొలువుల సంగతి అటుంచి ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నారని బాలరాజు ఆరోపించారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చమని అంగన్‌వాడీలు ధర్నాలు చేస్తుంటే వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. ఆహార భద్రత పథకం అంటూ ఇప్పుడు కొత్తగా బాబు ఆర్భాటం చేస్తున్నారని, కానీ ఇది గత కేంద్రం ప్రభుత్వం హయాంలోనే వచ్చిన పథకమని తెలిపారు.

Saturday, April 25, 2015

బాబు డ్రామాలు ఆడుతున్నారు

విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎంలు శనివారం విశాఖపట్టణంలో ధర్నాలు నిర్వహించాయి. కలెక్టరేట్ వద్ద సీపీఎం... జగదాంబ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలకు దిగాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించాయి. వైఎస్సార్‌సీపీ విశాఖ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ... చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ప్రకటించనందున కేంద్ర సర్కారు నుంచి చంద్రబాబు బయటకు రావాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీ పదేపదే చెప్పాయని వై.విశ్వేశ్వరరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రంలో భాగస్వామ్య పక్షం అయినా.. రాష్ట్రానికి న్యాయం చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే తప్ప... రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు పని చేయటం లేదని వ్యాఖ్యానించారు.

Thursday, April 9, 2015

sekhar bargela's invitation is awaiting your response

 
 
sekhar bargela would like to connect on LinkedIn. How would you like to respond?
sekhar bargela
sekhar bargela
Founder@CEO at Medha Shri IT Innovations
Confirm you know sekhar
You received an invitation to connect. LinkedIn will use your email address to make suggestions to our members in features like People You May Know. Unsubscribe
If you need assistance or have questions, please contact LinkedIn Customer Service.
© 2015, LinkedIn Corporation. 2029 Stierlin Ct. Mountain View, CA 94043, USA

Tuesday, April 7, 2015

ఎన్ కౌంటర్ పై మంత్రులతో చంద్రబాబు భేటీ

చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనపై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పల్లె అచ్చెన్నాయుడు, దేవీనేని ఉమ, నారాయణ హాజరయ్యారు.  అంతకుముందు చంద్రబాబుతో డీజీపీ రాముడు భేటీ అయ్యి ఎన్ కౌంటర్ వివరాలు తెలిపారు. జిల్లాలోని చంద్రగిరి మండలంలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకొని మొత్తం 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయిన విషయం తెలిసిందే. తెల్లవారు జామున ఐదుగంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మీ బాధ్యత నాది.. ప్రజల బాధ్యత మీది

విధి నిర్వహణలో ఒత్తిడి లేని వాతావరణాన్ని తీసుకొస్తానని చంద్రబాబు చెప్పారు. ‘‘మీకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత తీసుకుంటా. అయితే ప్రజలకు సేవలందించే బాధ్యత మీరు తీసుకోండి’’ అని ఉద్యగులను కోరారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అరియర్స్‌లో 15 రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంగీకార పత్రం అందజేశారు.

Sunday, April 5, 2015

I'd like to add you to my professional network on LinkedIn

 
sekhar bargela
sekhar bargela
Founder@CEO at Medha Shri IT Innovations
Hyderabad Area, India
I'd like to add you to my professional network on LinkedIn.
- sekhar
Confirm that you know sekhar
You received an invitation to connect. LinkedIn will use your email address to make suggestions to our members in features like People You May Know. Unsubscribe
Learn why we included this.
If you need assistance or have questions, please contact LinkedIn Customer Service.
© 2015, LinkedIn Corporation. 2029 Stierlin Ct. Mountain View, CA 94043, USA

Saturday, April 4, 2015

బాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని తలనీలాలు సమర్పించాం'

:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ బీసీ సంఘం మండిపడింది. ఆయన ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆ సంఘ అధ్యక్షుడు బి. ఉదయ్ కిరణ్, కార్యదర్శి పుల్లయ్యలు విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వారు.. గత ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని  దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా శ్రీకాళహస్తిలో ఒకరోజు దీక్ష చేశామన్నారు.

ఆయనకు మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుంటూ తిరుమలలో తలనీలాలు కూడా సమర్పించినట్లు స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బీసీలకు సంబంధించి తొమ్మిది ఫెడరేషన్ లకు నిధులు కేటాయించిన సంగతిని వారు గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలను పట్టించుకోవడం లేదన్నారు