ఎస్సీ వర్గీకరణపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో తాడోపేడో తేల్చేకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో శుక్రవారం జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ముందు వర్గీకరణకు అనుకూలమన్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే వెనుకంజ వేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు మార్చి 3న కరీంనగర్ రానున్నారని, ఆయన ఇక్కడి నుంచి వెళ్లేంత వరకు వణుకు పుట్టించేందుకు మాదిగలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Saturday, February 28, 2015
బెజవాడ నుంచే బాబు కాన్వాయ్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలకు కాన్వాయ్‌ను ఇకపై విజయవాడ నుంచే పంపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చే కాన్వాయ్ వాహనాలతో పాటు భద్రత సిబ్బందికి వసతి ఏర్పాట్లు పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో సిద్ధం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి పాలన సాగించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు పర్యటనల నిమిత్తం వెళతారు. అయితే సీఎం కాన్వాయ్ కోసం ఇప్పటి వరకు ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు రవాణా శాఖ ప్రైవేటు వాహనాలను సమకూర్చుతోంది. అయితే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
మార్చి 3న చంద్రబాబుకు పోటీ సభ
ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెం బ్లీలో ఆమోదించి పెద్ద మాదిగను అవుతానని ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు అలా చేయకుండా మాది గ ద్రోహిగా మిగిలారని ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. హన్మకొండ నయూంనగర్‌లో మాదిగ లాయర్ల ఫెడరేషన్(ఎంఎల్‌ఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 3వ తేదీన కరీంనగర్‌లో నిర్వహించే సభకు రావడానికి ముందే చంద్రబాబునాయుడు వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో ఆయన సభకు పోటీగా తాము సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇక గతంలో మూడు సార్లు ప్రధాన మంత్రిని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్ సైతం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు.
Wednesday, February 25, 2015
నేనున్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు
ఎన్నికలకు ముందు ఒక మాట.. ఆతర్వాత మరోమాట చెప్పి రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. బాబులా పచ్చి అబద్ధాలు ఆడే సీఎం.. దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. బాబు చేసిన మోసాలతో కష్టాలు వచ్చిన మాట నిజమే. అయితే నాదో విన్నపం. ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు నేనున్నా.. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తెస్తాం. ధైర్యంగా ఉండండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.
బాబు సర్కారుకు వ్యతిరేకంగా జాతీయస్థాయి ఉద్యమం
ఏపీలో అన్యాయంగా భూములు లాక్కుంటున్న చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. రాజ ధాని పేరిట పంటలు సాగవుతున్న భూముల్ని లాక్కునే కార్యక్రమానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను కలవనున్నామన్నారు. భూ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద అన్నాహజారే చేపట్టిన ధర్నాకు వైఎస్సార్‌సీపీ, ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతుకూలీల పరిరక్షణ వేదిక మద్దతు తెలి పింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
Tuesday, February 24, 2015
హామీలు గాలికొదిలిన చంద్రబాబు
రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు..విదేశీ మోజుతో విమానాలను బాడుగలకు తీసుకుని తిరుగుతున్న దగాకోరుకు రైతుల కష్టాలేం కనబడతాయని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకర్‌నారాయణ విమర్శించారు. మండల కేంద్రంలో సోమవారం జరిగిన డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో శంకర్‌నారాయణ మాట్లాడారు. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ ఇంటర్నెట్‌లో కాగితాలకే పరిమితమైందన్నారు. ఇప్పటి వరకు కొత్తరుణాలు కానీ, రుణమాఫీ చేసిన దాఖలాలు లేవన్నారు.
మాటలేకానీ... చేతలేవి బాబూ
చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 8 నెలలు గడిచిపోయింది. అధికారం చేపట్టిన తరువాత ఆయన జిల్లాకు రావడం ఇది ఆరోసారి. ఎన్నికల ప్రచారంలో, ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు చంద్రబాబు వందల కొద్దీ హామీలిచ్చారు. అందులో జిల్లాకు సంబంధించినవి 25కు పైగా ఉన్నాయి. కానీ జిల్లాకు సంబంధించి ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. జిల్లాలో అడుగుపెట్టిన ప్రతిసారీ పుట్టిన ఊరికి అన్నీ చేసేస్తానంటూ బాబు మాటలతో జనాన్ని మభ్యపెడుతున్నారు.
బాబు ప్రజలకు ఏమైనా చేశారా?
సీం చంద్రబాబునాయు డు తన తొమ్మిది నెలల పాలనలో వై ఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పు డు కేసులు పెట్టించడం తప్ప ప్రజలకు ఏమైనా చేశారా? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే నారాయణస్వా మి ప్రశ్నించారు. చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సోమవారం పెనుమూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఎలాగైనా అధికారంలో కి రావాలని ఎన్నో హామీలు, వాగ్దానా లు ప్రజలకు ఇచ్చారని చెప్పారు. వాటి లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయక చేతులు ఎత్తేశారని విమర్శించారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మా ఫీ పథకాల వల్ల ప్రజలు ఏ మేరకు లబ్ధిపొందారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి బాబూ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉద్యమాలు చేస్తుంటే వారిని భయపెట్టడానికి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని సీఎంగా చంద్రబాబు చ రిత్ర సృష్టిస్తారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నీరు- చె ట్టు కార్యక్రమం టీడీపీ కార్యకర్తలు ఆర్థికంగా సంపాదించుకోవడానికి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నా రు.
Friday, February 20, 2015
బాబూ.. విదేశీ మైండ్‌సెట్ వద్దు
‘ఏపీలో మరో జపాన్‌ను సృష్టిస్తానని, రాష్ట్రాన్ని సింగపూర్‌లా తయారు చేస్తానని చెబుతున్న సీఎం చంద్రబాబు.. విదేశీ మైండ్‌సెట్(ఆలోచన) నుంచి తెలుగు ప్రజల మైండ్‌సెట్‌లోకి రావాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. తెలుగు రాష్ట్రంలో మరో జపాన్‌ను సృష్టించేందుకు అక్కడి కంపెనీలన్నీ సిద్ధమయ్యాయని చంద్రబాబు భజన పత్రికల్లో వచ్చిన వార్తలను అంబటి ఉటంకించారు.
సీమ, ప్రకాశంకు నీరందిస్తా: బాబు
కరువుతో ఇబ్బందులు పడుతున్న రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీఇచ్చారు. పట్టిసీమ వద్ద ఈ నెల 23న ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని, తద్వారా మిగిలే శ్రీశైలం నీటిని రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ఇస్తామని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం గ్రామం పెద్దచెరువులో గురువారం సీఎం నీరు-చెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ నిర్మించిన నీరు-చెట్టు పైలాన్‌ను ప్రారంభించి, చెరువులో పూడికతీత మట్టిని జే సీబీతో ట్రాక్టర్‌లో పోశారు
రైతులను మరచిన బాబు: పెద్దిరెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల సమస్యలను పక్కనపెట్టి రాజధాని పేరుతో దేశాలు పట్టుకు తిరుగుతున్నారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కావలి ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే డిమాండ్‌తో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్‌రెడ్డి కావలిలో మూడురోజుల నిరాహారదీక్ష చేపట్టారు.
Wednesday, February 18, 2015
చంద్రబాబు ద్రోహానికి పాల్పడుతున్నారు...
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటూ తీవ్ర ద్రోహానికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. భూపాలపల్లి పట్టణంలోని దేవి ఫంక్షన్ హాల్‌లో శనివారం జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ నమోదు తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఉండేందుకు చివరి క్షణం వరకు పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో ఉండి బాబు చక్రం తిప్పేందుకు యత్నించారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలంగా నిర్ణయం తీసుకోడని భావించే తాను ఆ పార్టీని వీడి కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు వచ్చానన్నారు. స్థానిక టీడీపీ నాయకులు ప్యాకేజీల కోసమే చంద్రబాబు వెంట ఉంటున్నారని ఆరోపించారు.
Thursday, February 5, 2015
కలవరపడుతున్న చంద్రబాబు'
రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే బీజేపీకి ఆగ్రహం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు కలవరపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య బుధవారం హైదరాబాద్ లో ఆరోపించారు. అందుకోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీ సర్కార్ పై బాబు ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. అలాగే కేంద్రంలోని బీజేపీ వల్ల తమ ప్రభుత్వానికి ముప్పు ఉందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారన్నారు.
రాష్ట్రంలోని తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని చంద్రబాబును దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడాలనేది ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అజెండా అని సి.రామచంద్రయ్య ఈ సందర్బంగా గుర్తు చేశారు.
చంద్రబాబుపై ఫిర్యాదు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాఖ్యలు చేయడంతో పాటు తెలంగాణను విదేశంతో పోల్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీడిమెట్లకు చెందిన న్యాయవాది రాజశేఖర్‌రెడ్డి బుధవారం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు.
చంద్రబాబుతో నారాయణ, గంటా భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం ఉదయం మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దానిలో భాగంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర ఆర్థిక శాఖ నిన్న వెల్లడించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దానిలో భాగంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర ఆర్థిక శాఖ నిన్న వెల్లడించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.
Wednesday, February 4, 2015
బాబుకు నారాయణ లిమిట్ లెస్ ఏటీఎం
తాత్కాలిక రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజాధనాన్ని వృధా చేస్తోందని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారమిక్కడ మండిపడ్డారు. జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవన్న చంద్రబాబుకు తాత్కాలిక రాజధాని నిర్మాణం కోసం డబ్బులు ఎలా వచ్చాయన్నారు. విజయవాడ, గుంటూరులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోనే తాత్కాలిక రాజధానిని సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళగిరి సమీపంలో ఉన్న హరిహంత్ ప్రాజెక్ట్ కి ప్రత్యామ్నాయ భూములు ఇచ్చిన విధంగానే రాజధాని ప్రాంత రైతులకు కూడా ఇవ్వాలని ఆర్కే అన్నారు.
చంద్రబాబు కాదు.. దుబారా బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు చెబుతూనే మరోవైపు ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు పెట్టడం చూస్తే ఆయన చంద్రబాబు కాదు, దుబారా బాబు అనిపిస్తోందని విమర్శించారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయామని, రాజధాని ఏర్పాటుకు, రాష్ట్ర పునర్నిర్మాణానికి డబ్బులు లేవని చంద్రబాబు ముఖ్యమంత్రి గద్దెనెక్కిన నాటినుంచీ చెబుతూనే ఉన్నారన్నారు.
Monday, February 2, 2015
మొదటి సంతకం విలువను పాడుచేసిన బాబు
ఎన్నికల వాగ్దానాల అమలులో మొదటి సంతకానికి ఉన్న విలువను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుంగలో తొక్కి తన మోసకారి తనాన్ని బయటపెట్టారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సాయంత్రం తణుకు మండల పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సమావేశానికి నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంక రవీంద్రనాథ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి రాష్ట్రంలోని రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను నిలువునా ముంచారన్నారు.
మోసం బాబు నైజం!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమా ఫీ పేరిట రైతులు, డ్వాక్రా మహిళలను నమ్మించి, మో సం చేశారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మోసం చేయడం చంద్రబాబు నైజమని ధ్వజ మెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతుదీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివా రం ఆమె ఇక్కడి విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల్లో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనంతరం విస్మరిం చిన చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నార న్నారు. కురుపాం నియోజకవర్గంలో ఒక రైతుకు రూ. 150 మాత్రమే రుణమాఫీ అయ్యిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఇదే నెలకొందన్నారు. ఎన్నికల మే నిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నీటిలో మూ టలగానే మిగిలాయన్నారు. బాబు ఏడు నెలల పాలన పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు తమ పార్టీ ఎప్పుడూ అం డగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Sunday, February 1, 2015
బాబూ.. నీకు నీతి ఉందా?
‘రుణమాఫీ అన్నావు.. వడ్డీలు కట్టవద్దన్నావు.. నీ మాటలు నమ్మాం.. ఓట్లు వేశాం. అందలం ఎక్కాక ఇప్పుడు కొందరికే మాఫీ అంటావా.. ఎవరూ అడక్కుండానే హామీలిచ్చి ఇప్పుడు మమ్మల్ని నట్టేట ముంచుతావా.. నీకు నీతి ఉందా చంద్రబాబూ’ అంటూ రైతులు, డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు సొమ్మును వడ్డీల రూపంలో దోచుకున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుదీక్షలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, మహిళలు, నాయకులు
ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన అశోక్ బాబు
చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీఎన్జీఓ నేత అశోక్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన హెల్త్ కార్డులను ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆదివారం నెల్లూరు జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుదల వ్యవహారంలో కూడా పీఆర్సీపై ప్రభుత్వ స్పందన తీరు సరిగా లేదన్నారు.
రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని అశోక్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా విజయవాడకు తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని ఈ సందర్బంగా అశోక్ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బాబుతో సహా కేబినెట్ మోసపూరితంగా వ్యవహారిస్తోంది'
రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయకుండా ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రి వర్గం సహచరులు మోసపూరితంగా వ్యవహారిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం. ప్రసాదరాజు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తణుకులో చేపట్టిన రైతు దీక్ష స్థలి ఆదివారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్బంగా ఎం. ప్రసాదరాజు మాట్లాడారు.
ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి పాదయాత్ర ద్వార ప్రజల కష్టాలు తెలుసుకుని... రుణాలు మాఫీ, పావలా వడ్డీకే రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని ప్రసాదరాజు ఈ సందర్బంగా గుర్తు చేశారు.
Subscribe to:
Comments (Atom)