photo gallery

 

Wednesday, December 31, 2014

రేపు సీఎం బాబు రాక

ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గురువారం జిల్లాకు రానున్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం 2015 తొలిరోజు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపేందుకే బాబు జిల్లా పర్యటనకు వస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి

చంద్రబాబు ద్రోహి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎస్సీ,ఎస్టీలకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. రాజ్యాంగబద్దంగా దళితులకు రావలసిన వాటా ఎందుకు ఖర్చు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుని ఖచ్చితంగా బోనులో నిలబెట్టాలని అన్నారు.

రైతుకు అప్పు పుట్టలేదు...

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణ మాఫీ మెలికల కారణంగా బ్యాంకు రుణాలకు రైతులు దూరమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు సర్కారు ఇప్పటికి కూడా రైతుల రుణాల మాఫీ చేయకపోవడంతో.. బ్యాంకులు రైతులకు రుణాలను మంజూరు చేయడం లేదు. ఖరీఫ్ ముగిసిపోయి రబీ వచ్చినప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. బ్యాంకులు గతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసేవి. అలాంటిది ఇప్పుడు నిర్దేశించుకున్న వ్యవసాయ రుణ లక్ష్యంలో నాలుగో వంతైనా ఇవ్వలేకపోయారు.

చంద్రబాబే ఈ సంఘటన వెనుక ఉన్నారా?'

 ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో అరాచకంపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ నేతలు పార్థసారధి, మేరుగ నాగార్జున సోమవారమిక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  తుళ్లూరు మండలంలో పలు గ్రామాల్లో దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.  వైఎస్ఆర్ సీపీ నేతలు ఈరోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని ప్రజలు అనుమానిస్తున్నారని విమర్శించారు

మహా నగరి

 నవ్యాంధ్ర రాజధాని నగరం పరిధి 122 కిలోమీటర్లు! ఈ మహా నగరిని నిర్మించే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (క్రీడ) విస్తీర్ణం 7068 చదరపు కిలోమీటర్లు! ఇది.. దేశంలోనే మూడో అతి పెద్ద పట్టణాభివృద్ధి సంస్థ! ఊహించిన దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే నవ్యాంధ్ర రాజధానిని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. 

Tuesday, December 30, 2014

వైద్య పరీక్షలు చేయించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఆస్పత్రిలో జనరల్‌ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. బీపీ, షుగర్‌కు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు సుదీర్ఘకాలంగా నిర్విరామంగా పనిచేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

బ్యాంకర్లతో ఏపీ సీఎం చంద్రబాబు

బ్యాంకర్లతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం సచివాలయంలో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌, బ్యాంకు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Friday, December 26, 2014

మోసగించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై తీర్మానం చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగలను మోసగించారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. టీడీపీ మోసపూరిత విధానాలకు నిరసనగా మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాదిగలను మోసం చేసిన టీడీపీ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

కంటోన్మెంట్ పై బాబు కన్ను

 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ కసరత్తు చేస్తోంది. అందులోభాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం టీటీడీపీ నేతలతో హైదరాబాద్ లో భేటీ కానున్నారు. 

అద్దె ఇంటికి చంద్రబాబు!

  • జూబ్లీహిల్స్ రోడ్ నం. 24లో ఇల్లు ఖరారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇప్పుడు అద్దె ఇంటి వేటలో పడ్డారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిని కూల్చి దాని స్థానంలో భారీ భవంతిని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అది పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. అంతవరకు కుటుంబ సమేతంగా నివసించడానికి ఓ అద్దె ఇంటి కోసం బాబు అన్వేషిస్తున్నారు.

రాజధాని, రుణమాఫీపై చంద్రబాబుకు అభినందనలు

రాజధాని, రుణమాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతున్నానని, ఈ విషయంలో కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు

చంద్రబాబుతో ఎయిర్‌లైన్స్‌ చైర్మన్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ చైర్మన్‌ రాహుల్‌ భాటియా గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఏపీలో ఇండిగో సర్వీసుల పెంపుపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Thursday, December 25, 2014

చంద్రబాబుతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఛైర్మన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఛైర్మన్ రాహుల్ భాటియా గురువారం భేటీ అయ్యారు. ఏపీ నుంచి ఇండిగో సర్వీసుల పెంపుపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కాగా  దేశ ఏవియేషన్ రంగంలో ఏకైక లాభదాయక సంస్థగా ఉన్న ఇండిగో విశాఖను తన హబ్ గా చేసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో క్రిస్మస్‌ వేడుకలు

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో క్రిస్మస్‌ పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ క్రైస్తవ సంఘాలు సేవాభావంతో పనిచేస్తున్నాయని కొనియాడారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమన్నారు. ఏపీలో క్రైస్తవ భవనానికి 2 ఎకరాలు, రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. జెరూసలెం యాత్రకు ఆర్థికసాయం అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

నీతి, నిజాయితీకి మారుపేరు వాజ్‌పేయి

మాజీ ప్రధాని వాజ్‌పేయి 90వ జన్మదినం సందర్భంగా ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

పీవీకి కూడా "భారతరత్న ఇవ్వాలని కోరాం : చంద్రబాబు

 టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌, మాజీ ప్రధాని పీవీ నరసింహారావులకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ చొరవవల్లే కాంగ్రెసేతర ప్రభుత్వాలు వచ్చాయన్నారు. పేదవారికి న్యాయం చేసేందుకు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు రూపశిల్పి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. రాజకీయాల్లో వినూత్నమైన సరళిలో ఎన్టీఆర్‌ ముందుకెళ్లరని బాబు అన్నారు. 

Wednesday, December 24, 2014

బొత్సపై చంద్రబాబుకు నివేదిక

  మాజీ మంత్రి బొత్సను టార్గెట్ చేస్తూ తయారు చేసిన నివేదికను జిల్లా టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి  సీఎం చంద్రబాబునాయుడికి అందజేశారు.

నేను మాట్లాడదామంటే బాబు వారించారు..

శాసనసభలో మంత్రులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంలేదంటూ సీఎం చంద్రబాబు వ్యవ హారశైలిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మరోసారి తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకరిద్దరు మాట్లాడేందుకు అవకాశం వచ్చినా మధ్యలో సీఎం జోక్యం చేసుకోవడంతో అది ప్రతిపక్షానికి లాభించేదిగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ లాబీల్లోని తన చాంబర్‌లో కేఈ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు

చంద్రబాబుకు దిష్టిబొమ్మకు శవయాత్ర

 ఎస్సీ వర్గీకరణకు ఏిపీ అసెంబ్లీలో తీర్మానించాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో భద్రాచలంలో మంగళవారం సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. గతంలో ఎస్సీవర్గీకరణ ఉద్యమానికి టీడీపీ సహకరించిదని ఆ విశ్వాసంతో తెలంగాణలో చంద్రబాబు చేపట్టిన యాత్రలో మాదిగలు పాల్గొన్నారని తెలిపారు. ఆ విశ్వాసం కూడా లేకుండా బాబు మాదిగ జాతిని మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Tuesday, December 23, 2014

వెంకటస్వామికి ఏపీ సీఎం చంద్రబాబు

 అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటస్వామికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ జీవితాంతం బడుగు బలహీనవర్గాల కోసం వెంకటస్వామి పోరాడారని అన్నారు. ఈ రోజు సాయంత్రం పంజాగుట్ట స్మశాన వాటికలో వెంకటస్వామి అంత్యక్రియలు జరుగనున్నాయి.

'చంద్రబాబు తమ ఏజెంట్లను నియమించుకున్నారు'

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో చంద్రబాబు సర్కార్ తప్పుడు విధానాలు అవలంభిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రభుత్వ కమిటీలలో అనధికార వ్యక్తులకు, టీడీపీ కార్యకర్తలకు స్థానం కల్పించడం సరికాదని వారు అన్నారు. సామాజిక కార్యకర్తల ముసుగులో రౌడీషీటర్లకు స్థానం కల్పిస్తూ స్థానిక సంస్థల స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.  

Monday, December 22, 2014

గుర్రాలతో తొక్కించిన బాబు...మళ్లీ అదే దమననీతి

హైదరాబాద్ : కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐకేపీ యానిమేటర్ల అరెస్ట్కు నిరసనగా వైఎస్ఆర్ సీపీ సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
అనంతరం ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్  వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఐకేపీ యానిమేటర్లు వంద రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్ కు వస్తున్న యానిమేటర్లను ఎక్కడికక్కడే అరెస్ట్ లు చేస్తూ ఎమర్జెన్సీని తలపించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

బాబు అబద్దపు హామీలను ఎండగడదాం

- ప్రజలకు అండగా నిలబడదాం
- నేడు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ మహాధర్నా
- తరలిరానున్న పార్టీశ్రేణులు,రైతులు, మహిళలు

సాక్షి, చిత్తూరు: పింఛన్లు.. రేషన్ కార్డులు తొలగించారు... రైతు, డ్వాక్రా రుణమాఫీలు లేవు... బాబు వస్తే.. జాబు అనే నినాదం గంగలో కలిసింది... నిరుద్యోగ భృతిలేదు..  ఆరు నెలల కాలంలో అన్ని వర్గాలవారిని వంచించిన చంద్రబాబు అబద్దపు హామీలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించడానికి సన్నద్ధమయింది. అధికారం కోసం ఎన్నికల సమయంలో అనేక రకాల హామీలు గుప్పించిన బాబు ఆ తరువాత వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించక, ప్రజలను వంచించారు.

చంద్రబాబుతోనే రుణాలు కట్టించుకోండి

‘ఎన్నికల ముందు బ్యాంకుల్లో ఎంత మొత్తం అప్పులున్నా, ఏ ఒక్క మహిళా రుణాలను చెల్లించవద్దని, అధికారంలోకి వస్తే అన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.. ఆ మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపించాం.. అందుకే ఆయన వద్దే రుణాలు కట్టించుకోండి.. మేము మాత్రం పైసా కూడా చెల్లించం..’ అంటూ అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లికి చెందిన డ్వాక్రా మహిళలు బ్యాంకర్లకు తేల్చిచెప్పారు.

Sunday, December 21, 2014

బాలయ్య మౌనం వెనుక బావ..!

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్  శాసనసభ లాబీల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట కలపకుండా మౌనంగా ఉంటున్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో తనదైన శైలిలో మాట్లాడుతున్న బాలయ్య.. మీడియా ప్రతినిధులు మాట కలిపేందుకు ప్రయత్నిస్తే మాత్రం వినిపించుకోనట్లు ఉంటున్నారు. దీని వెనుక ఆయన బావ, వియ్యంకుడు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు ఆదేశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆదివారం కూడా పని చేశాం: చంద్రబాబు

హైదరాబాద్: హుద్ హుద్ తుపాను సమయంలో టీవీ దగ్గర కూర్చొని అందరం మానిటరింగ్ చేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆదివారం అయినా అందరం పనిచేశామన్నారు. హుద్ హుద్ తుపాను అంశంపై ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడారు.

సంక్షిప్తంగా చంద్రబాబు ప్రసంగం:
తుపానుపై ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేశాం. బలవంతంగా బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాం. ఏర్పాట్లన్నిటినీ నిరంతరం పర్యవేక్షించాం. 

రాజధానిలో సర్వాధికారాలూ దానివే

 అంతర్జాతీయ స్థాయిలో నవ్యాంధ్ర రాజధాని నగర నిర్మాణానికి తొలి అడుగు పడింది. రాజధాని నిర్మాణానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించనున్న రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ-క్రీడా) బిల్లును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం శాసనసభలో ప్రవేశపెట్టింది. దీనిని శాసనసభ ఆమోదించిన తర్వాత ఇది ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చట్టం -2014’గా మారుతుంది. అనంతరం భూ సమీకరణ నుంచి రాజధాని నిర్మాణం వరకూ కార్యాచరణ వేగవంతం అవుతుంది. 

Saturday, December 20, 2014

పాలమూరును తీర్చిదిద్దుతాం

కొత్తూరు : వలసల జిల్లాగా మారిన పాలమూరు జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు తెలిపారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం వారు బుధవారం తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కొత్తూరు మండలం తిమ్మాపూర్ చెక్‌పోస్టు వద్ద షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వీర్లపల్లి శంకర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు వారికి ఘనంగా స్వాగతం పలికారు.

ఎమ్మెల్యేలే రూ.150 కోట్లు

విశాఖపట్నం: హుద్ హుద్ తుపాను సాయంలో అధికార టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. దీనిపై జనవరి మొదటివారంలో తమ పార్టీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశామని గుర్తు చేశారు.

ప్రజా వ్యతిరేకులు మోదీ, బాబు

ప్రజలను మాయ చేయాలని చూసే వాడే అందంగా మాట్లాడతాడని, ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి అన్నారు. పట్టణంలోని అంజనీ కల్యాణ మండపంలో బుధవారం సీపీఎం డివి జన్ స్థాయి మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన ఏ మాటా నమ్మడానికి లేదన్నారు. పైకి చెప్పేదొకటి, చేస్తున్నదొకటిగా ఉంటుందన్నారు

నర్సరీలను చంటి పిల్లల్లా కాపాడాలి

 హరితహారం కోసం మొక్కలు పెంచే నర్సరీలను ఉపాధిహామీ ఏపీఓలు, వనకాపరులు చంటి పిల్లల్లా కాపాడాలని డ్వామా పీడీ ఎన్.సునందరాణి సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున మొక్కల పెంపకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయంలో శుక్రవారం ఆమె ఉపాధి సిబ్బం దితో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దృష్టి

 పాలమూరు జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక దృష్టి ఉందని పరి శ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యు త్ శాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి, పార్లమెంటరీ కా ర్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వారు మాట్లాడారు.

సంతానం కలిగిస్తామని..మోసం చేశారు

 కరీంనగర్‌లోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రం వివాదాల్లోకెక్కింది. సంతానం కలిగిస్తామంటూ తమవద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన డాక్టర్ పద్మజ ఫలితం చూపకపోగా, ఇదేమిటని ప్రశ్నించినందుకు తుపాకీ ఉందని బెదిరించారని వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన బలిజ శశికళ దంపతులు ఆరోపించారు.

photo gallery

http://www.photosnack.com/9ADBC586AED/6273-958849277461997-2779012834401836620-n.html

Friday, December 19, 2014

సీఎంను కలిసిన గాంధీ నాయక్

 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అరగుండు, అర మీసంతో వినూత్న తరహాలో ఉద్యమానికి అంకితమైన మండలంలోని  మొండ్రాయి శివారు గిర్నితండాకు చెందిన దారవత్ మోహన్‌గాంధీ నాయక్ గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిశారు

సంతాపంలోనూ రగడే! ఏపీ అసెంబ్లీ ప్రారంభం

వెంకట్రమణ మృతికి సంతాపంలో వాగ్బాణాలు
విపక్షాన్ని కించపరుస్తున్నారు
జగన్‌ మండిపాటు
ఆ ఉద్దేశం లేదు: స్పీకర్‌
23 వరకూ సమావేశాలు
నేడో రేపో ‘క్రీడ’ బిల్లు
ఐదు శతాబ్దాల ముందుచూపుతో రాజధాని
ప్రకటించనున్న చంద్రబాబు

హైదరాబాద్‌,  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు మొదటి రోజే వేడెక్కాయి. తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ మృతికి సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానం సభలో కొంతసేపు రగడకు దారితీసింది. ముఖ్యమంత్రి మాట్లాడిన తరవాత ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి అవకాశం ఇవ్వకపోవడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

జూన్‌కల్లా చలో

తాత్కాలికంగా షెడ్లు వేసైనా రాజధాని నుంచే పాలన
అప్పటికి కొన్ని విభాగాల తరలింపు
రాజకీయ రాజధానిగా హైదరాబాద్‌
టీడీఎల్పీ భేటీలో చంద్రబాబు వెల్లడి
పింఛన్లను ఐదు రెట్లు పెంచాం
మాఫీపై రైతుల్లో సంతృప్తి
బదిలీల్లో కాస్త జాగ్రత్త
వసూళ్లు టీడీపీ సంస్కృతి కాదు
ఎమ్మెల్యేలకు హితబోధ


హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి జూన్‌ నాటికి కొన్ని పాలనా విభాగాలను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Thursday, December 18, 2014

బాబు..వెంకటరమణను సింగపూర్ తీసుకెళ్లి ఉంటే..

హైదరాబాద్ :  తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. గురువారం సభ ప్రారంభమైన వెంటనే వెంకటరమణ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతూ  సింగపూర్‌ పర్యటనకు కార్పొరేట్‌ సంస్థలను తీసుకెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు...వైద్య చికిత్స కోసం వెంకటరమణను సింగపూర్‌ తీసుకెళ్లి ఉంటే... ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని  అన్నారు. విధి అనేది ఎవరూ ఆపలేకపోయారని.. ఆయన మరణం నిజంగా బాధాకరమన్నారు.

హేళన చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు బీఏసీ సమావేశంలో ప్రతిపక్షాన్ని హేళన చేసే విధంగా వ్యవహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం ప్రారంభమవుతున్నా అసెంబ్లీ సమావేశాల్లో తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి, పెషావర్ కాల్పుల్లో మృతులపై సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Wednesday, December 17, 2014

తెలంగాణపై మళ్లీ వెంకయ్య కుట్ర: పొంగులేటి

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలంగాణపై మరోసారి కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్‌ శాసన మండలి పక్ష ఉప నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేసుకున్నారని విమర్శించారు. వెంకయ్యనాయుడు తాజాగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో లొసుగులున్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, దీని వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. రాజ్యసభలో విభజన చట్టం ఆమోదం పొందే సందర్భంలో తాను కూలంకషంగా పరిశీలించి, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేలా చూశానంటూ అప్పట్లో వెంకయ్య చెప్పుకున్నారని గుర్తు చేశారు.

మోసం చేయడం చంద్రబాబు ప్రవృత్తి

రైతుల నుంచి మహిళల వరకు అందరినీ సీఎం మోసం చేశారు
విద్యుత్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం
జింఖానా మైదానంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సభలో వైఎస్ జగన్
 

అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు అన్ని  వర్గాలను మోసం చేస్తోంది. కడుపుమండిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు  ఇస్తున్నాం...’ అని వైఎస్సార్ సీపీ అధినే త వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గాంధీ  నగర్‌లోని జింఖానా మైదానంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు.

చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలి: జ్యోతుల నెహ్రూ

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్నీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేర్చలేదని నెహ్రూ చెప్పారు.

రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన ఆయన.. ఇప్పుడు రుణాలు కట్టేసేయండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని అన్నారు. రైతులు రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారన్న విషయం చంద్రబాబుకు తెలియదా అని నెహ్రూ ప్రశ్నించారు.

Tuesday, December 16, 2014

జనవరి నుంచి కొత్త ‘రేషన్‌’

 కిలో ఒక రూపాయికే కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందబోతున్నాయి. కొత్త ఏడాది జనవరి నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం సరఫరాకు కావాల్సిన ఆహార భద్రతా కార్డులను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా చేయాలి

తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికైన తలసాని శ్రీనివాస యాదవ్‌ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మంత్రివర్గంలో చేరితే తమకు అభ్యంతరం లేదని, కానీ, మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని టీ టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు డిమాండ్‌ చేశారు. 

చంద్రబాబును నా కొడుకు వీడటం బాధగా ఉంది

 చంద్రబాబు నాయుడు తనకు పెద్దకొడుకు లాంటి వాడని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబును తన కొడుకు వీడటం బాధగా ఉన్నా కేసీఆర్‌ మంత్రి వర్గంలో తలసానికి మంత్రి పదవిరావడం సంతోషం కలిగిస్తోందని ఆమె అన్నారు.

Monday, December 15, 2014

పింఛను రగడ

అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదంటూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెద్దఎత్తున ఆందో ళన చేశారు. ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. వరంగల్‌ జిల్లా చేర్యాల, బచ్చన్నపేట, దేవరుప్పుల మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చెన్నారావుపేట, ఖానాపూరం, వెంకటాపూర్‌ ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ఆందోళనలు జరిపారు

చంద్రబాబుకు సలహాలిచ్చేంత అనుభవం జగన్‌కులేదు : కేఈ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సలహాలిచ్చేంత అనుభవం జగన్‌కు లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌ మరమనిషి అని వైసీపీ నేతలే అంటున్నారన్నారు. తన ఆస్తుల వివరాలు జగన్‌ బయటపెట్టగలరా అని కేఈ కృష్ణమూర్తి ప్రశ్నించారు.

చక్రి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం

సినీ సంగీత దర్శకుడు చక్రి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చక్రి మృతి పట్ల సంతాపం తెలిపిన బాబు ఆయన కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

కేసు పెడితే అంతు చూస్తాం...

 తప్పతాగి డ్రైవింగ్
* పోలీసులపై నైజీరియన్ల దౌర్జన్యం
బంజారాహిల్స్: తప్పతాగి బైక్‌లు నడుపుకుంటూ వస్తున్న ఆరుగురు నైజీరియన్లను పోలీసులు పట్టుకోగా... కేసు నమోదు చేస్తే అంతు చూస్తామని వారు పోలీసులను హెచ్చరించడంతో పాటు దుర్భాషలాడారు. 

సీఎం చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సోమవారం గన్నవరం రానున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన సోమవారం  ఉదయం 10 గంటలకు  ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ నుంచి ఆయన 10.45 గంటలకు హెలికాప్టర్‌లో ప్రకాశం జిల్లా కొండపి గ్రామానికి వెళతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం విమానా శ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళతారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం షాక్!

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, కేంద్రం  ఊహించని విధంగా షాక్‌ ఇచ్చింది. హుదూద్ నష్టం చంద్రబాబు సర్కార్‌ చెప్పినంతగా లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నష్టం సుమారు రూ.680 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని  పేర్కొంది.  తాము ఈ విషయంలో ఇంతకన్నా ఎలాంటి సాయం చేయలేమని స్పష్టం చేసింది. ఈ విషయమై మాట్లాడేందుకు  ఈ నెల 15న ఢిల్లీ రావాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కబురు పంపింది.

చక్రి మృతి పట్ల కేసీఆర్ దిగ్ర్భాంతి

హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  ఎన్నో విజయాలు సాధించిన తెలంగాణ బిడ్డ చిన్న వయసులో మరణించడం బాధాకరమని అన్నారు.  చక్రి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 

'నా భవిష్యత్ కేసీఆరే నిర్ణయిస్తారు'

హైదరాబాద్ : మాల సామాజిక వర్గంలో ఆవేదన ఉన్నమాట వాస్తవమేనని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన సోమవారం ఉదయం కేసీఆర్ తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. తన భవిష్యత్ ను కేసీఆరే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. సాయంత్రంలోగా ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వస్తుందని కొప్పుల తెలిపారు.

రోజుకో మాట..పూటకో అబద్ధం

ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో మాట.. పూటకో అబద్ధం చెబుతూ ప్రజలను మభ్యపెడుతూ నిలువునా మోసం చేస్తున్నారని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. బాబు మాటలు నమ్మి ఓటేసిన రైతులను, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచారని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు నైజంగా మారిందన్నారు.

Saturday, December 13, 2014

విజయవాడలో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ యంత్రాంగానికి, నగరపాలక సంస్థ అధికారులకు, పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉదయం ఆరున్నర గంటలకే ప్రభుత్వ అతిథి గృహం నుంచి తనిఖీలకు బయలుదేరారు. సిటీ మ్యాప్‌ను దగ్గర పెట్టుకుని ముందుకు సాగారు. ముందు చెపితే బందోబస్తు ఏర్పాటు చేస్తామన్న పోలీసులకు బాబు ఘాటుగా జవాబు ఇచ్చారు. నా వెంట రండి అంటూ ముందుకు కదిలారు.

కొత్త జీతానికి కొత్త కొర్రీ!

అంతా సిద్ధమైందనుకున్న తర్వాత పదో పీఆర్సీ అమలుకు ఆర్థికశాఖ అధికారులు కొర్రీ వేశారు. దీంతో పదో పీఆర్సీకి ఇప్పట్లో మోక్షం కలిగే పరిస్థితి కన్పించడం లేదు. వాస్తవానికి నూతన సంవత్సర కానుకగా ఉద్యోగులకు కొత్త జీతాలు ఇవ్వాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావు భావించారు. ఇదే క్రమంలో మంత్రివర్గ ఉపసంఘాలు, అధికారుల కమిటీలు, చర్చల పేరుతో కాలాయాపన చేయకుండా, ఉద్యోగ సంఘాలతో నేరుగా తానే చర్చించడం ద్వారా పీఆర్సీని ఖరారు చేయాలని ఆయన ఓ దశలో నిర్ణయించారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాషా్ట్రలకు ఉద్యోగుల తుది కేటాయింపులు పూర్తి కానందున, ఇప్పటికిప్పుడు వేతన సవరణ చేసిన పక్షంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయంటూ ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సీఎంకి నివేదించినట్లు సమాచారం. ఉద్యోగుల కేటాయింపులు తాత్కాలికంగా మాత్రమే జరగడం, ఈ క్రమంలో తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌కు,

రైతు ఆత్మహత్యలపై కేంద్రానికి టీ-సర్కారు నివేదిక

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలు ఎన్ని? 300లకుపైగానే అని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. 400లకుపైమాటే అని విపక్షాలు అంటున్నాయి. కానీ, రాష్ట్రంలో 69 మంది రైతులు బలవన్మరణం పాలైనట్లు టీ-సర్కారు కేంద్రానికి తెలిపింది.
 తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆరునెలల్లో 69 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు టీఆర్‌ఎస్‌ సర్కారు అంగీకరించింది. దీనిపై స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి మోహన్‌ భాయ్‌ కుందారియా శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్‌ సభ్యుడు వి.హనుమంతరావు అడిగిన ప్రశ్నకు శుక్రవారం కుందారియా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం...గత ఆరు నెలల్లో తమ రాష్ట్రంలో 69 మంది రైతులు చనిపోయారని తెలంగాణ సర్కారు వెల్లడించింది. కరువు, వరదలు, వర్షాభావం తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల తలెత్తిన పంట నష్టం, సామాజిక అవమానం, మానసిక క్షోభ... ఆత్మహత్యలకు కారణమని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రాజధాని ప్రాంత రైతులకు ఎలాంటి అన్యాయం జరగబోదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. శనివారం ఉదయం చంద్రబాబును కలిసిన తుళ్లూరు ప్రాంత రైతులు సీఎంను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధానికి భూములు ఇచ్చిన రైతులను అభినందిస్తున్నామన్నారు. రైతులందరికీ న్యాయం చేస్తాం... ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వనంత ప్యాకేజీని రైతులకు ప్రకటించామని చెప్పారు.

వాజపేయికి భారతరత్న?

 తొలిసారి బీజేపీని అధికారంలోకి తీసు కువచ్చిన మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీవాజపేయికి ఆయన పుట్టిన రోజు సందర్భంగా అమూల్యమైన కానుకను అందించనున్నారు. కవి,అసాధారణ వక్త, అమితమైన ప్రజాదరణ గల వాజపేయి డిసెంబర్‌ 25న జన్మించిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందించాలని నిర్ణయిస్తూ కేంద్రం ప్రకటన చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతూ ఎవర్నీ గుర్తించలేని స్థితిలో ఉన్న వాజపేయిని ప్రతి ఏడాది ఆయన పుట్టిన రోజున పార్టీ అగ్రనేతలు సందర్శించడం, ఆ పుట్టిన రోజును ఘనంగా జరుపుకోవడం బీజేపీ కొనసాగిస్తూ వస్తోంది

విజ్ఞానంతోనే బంగారు తెలంగాణ

విజ్ఞాన తెలంగాణ రాకుండా.. బంగారు తెలంగాణ సాధ్యం కాదని ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యా ప్రమాణాలను తక్షణమే మెరుగుపరచాలని ఆయన డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) జిల్లా ప్రథమ విద్యా మహా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహిళా కార్యకర్త బిడ్డకు టీడీపీ సాయం

పేద కార్యకర్తలకు చేయూతను అందించడంలో భాగంగా.. కరీంనగర్‌లో టీడీపీ కార్యకర్త దూలం రాధిక కుమార్తె శామిలి వివాహ ఖర్చులకు టీడీపీ సాయం చేసింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ కార్యదర్శి జనార్దన్‌ స్వయంగా వివాహానికి హాజరయి.. రాధిక కుటుంబానికి రూ. మూడు లక్షలు అందజేశారు. ‘‘కార్యకర్తల కష్ట సుఖాల్లో తెలుగుదేశం పార్టీ పాలు పంచుకుంటుంది.

మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం

 మహబూబ్‌ నగర్‌, నల్లగొండ జిల్లాల్లో శుక్రవారం అత్యాచార యత్నం ఘటనలు చోటుచేసుకున్నాయి. మహబూబ్‌నగర్‌ మండలం రాంచంద్రాపురంలో మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఓ యువకుడు ఆమె ప్రతిఘటించడంతో దాడి చేసి పరారయ్యాడు. దీనిపై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు మహబూబ్‌ నగర్‌ రూరల్‌ పోలీసులు నిందితుడు సంపత్‌పై అత్యాచారయత్నంతో పాటు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. 

వదులుండ్రి.

అన్నం నీళ్లు మాని రోజంతా రోదన
మెదక్‌లో అవ్వకు ‘ఆసరా’ కష్టం!
పింఛను లైన్‌లో..మూర్ఛపోయిన వృద్ధుడు
పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే సోలిపేట నిలదీత

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌) అవ్వ పేరు రాజబోయిన ఎల్లమ్మ. ఎల్లమ్మ వయస్సు 76 ఏళ్లు. రంగాయపల్లికి చెందిన ఎల్లమ్మ భర్త పదేళ్ల క్రితమే చనిపోయాడు. వృద్ధాప్య, వితంతు పింఛన్లకు అర్హురాలే. కానీ, ఏ పింఛనూ దొరకలేదు. జాబితాలో పేరు లేకపోవడంతో లబోదిబోమంది. గురువారమంతా అన్నమూ నీళ్లూ లేకుండా దిగులుగా పడుతుంది. శుక్రవారం ఉదయాన్నే తూప్రాన్‌ మండల పరిషత్‌ ఎదుట.. బోరుమంటూ కనిపించింది. కనిపించిన వారికల్లా గోడు చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయింది. మధ్యమధ్య గొంతు బొంగురుపోతోంటే.

చంద్రబాబును కలిసిన రాజధాని ప్రాంత రైతులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజధాని ప్రాంత రైతులు శనివారం ఉదయం ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును రైతులు గజమాలతో సత్కరించారు. అనంతరం రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

Friday, December 12, 2014

ధైర్యంగా ఫిర్యాదు చేయండి

‘అవినీతి నిరోధక శాఖ అంటే భయం వద్దు.. లంచం తీసుకునే వారిపై ధైర్యంగా మాకు ఫిర్యాదు చేయండి. మీ పెండింగ్ పనిని మేమే దగ్గరుండి పూర్తి చేయిస్తాం.’ అని అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీఎస్పీ పి.ప్రభాకర్ పేర్కొన్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే అందుకు సంబంధించిన పని పూర్తి కాదనే అపోహ ప్రజల్లో ఉందని, అలాంటి ఆందోళన నుంచి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

మూగ యువతిపై అత్యాచారం

 చెవిటి, మూగ యువతిపై కొందరు గుర్తుతెలియని దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన బుధవారం రాత్రి వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఓ యువతి, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను మధ్యలో ఆపేసింది. ప్రస్తుతం కుట్టు మిషన్‌ నేర్చుకుని కుటుంబానికి ఆసరా అందిస్తోంది. కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి బుధవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. అదే రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో ఆ యువతి బహిర్భూమికి బయటకు వచ్చింది. చాలా సేపైనా ఆమె రాకపోవడంతో తండ్రి బయటకు వచ్చి కూతురు కోసం వెతకగా ఇంటి ఆవరణలోనే ఓపక్క అపస్మారక స్థితిలో పడి కనిపించింది. 

ఏపీలో స్మార్ట్‌ గ్రామాలు

రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు స్మార్ట్‌ గ్రామాల పథకానికి శ్రీకారం చుట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చిత్తూరులోని పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం జరిగిన తొలి రైతు సాధికార సదస్సులో ఆయన పాల్గొన్నారు. రుణమాఫీ పథకం కింద తొలి విడత లబ్ధి పొందిన రైతులకు రుణవిముక్తి పత్రాలను అందజేశారు. అనంతరం సదస్సుకు హాజరైన వేలాదిమంది రైతులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. 

గొట్టిపాటి కుటుంబానికి అండగా ఉంటా: జగన్‌

ప్రజాసేవకు అంకితమైన గొట్టిపాటి కుంటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా యద్దనపూడిలో గురువారం దివంగత నేత గొట్టిపాటి నరసయ్య కాంస్య విగ్రహం ఆ విష్కరించిన తర్వాత మాట్లాడారు. వర్షం సైతం లెక్క చేయకుండా ఇక్కడకు వచ్చారంటే గొట్టిపాటి కుటుంబంపై ప్రజలకు ఎంత ఆప్యాయత ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. గొట్టిపాటి కుటుంబం, వైఎస్‌ కుటుంబం ఒకే కుటుంబ సభ్యులుగా మెలుగుతామని జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, నరసయ్య తనయుడు భరత్‌, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

విజయవాడకు సీఎం చంద్రబాబు రాక

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని కైకరంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగే రైతుసాధికార సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు. రెండు గంటలకు గన్నవరం నుంచి కైకరం చేరుకుంటారు.

పింఛను పోరు..హోరు

పింఛన్ల పంపిణీని అడ్డుకోవటంపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు బాహాబాహీకి దిగడంతో నల్లగొండలో ఉద్రిక్తత నెలకొంది. భువనగిరి ప్రాంత కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పోతంశెట్టి వెంకటేశ్వర్లు అనుచరులు.. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని గురువారమిక్కడ అడ్డుకున్నారు. కొంతమంది వృద్ధులను ముందు పెట్టి ‘‘వీరికి పింఛను ఎందుకు ఇవ్వరంటూ పోతంశెట్టి, అతని అనుచరులు.. శేఖర్‌రెడ్డిని గట్టిగా నిలదీశారు. ఈ సమయంలో ఇరుపక్షాలూ వాగ్వివాదానికి దిగగా, అది తోపులాటకు దారి తీసింది. పోలీసు జోక్యంతో ఇరువర్గాలు శాంతించాయి. రంగారెడ్డిలో ‘ఆసరా’ లబ్ధిదారులు అధికారులకు ముచ్చెమటలు పోయించారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలంటూ.. యాచారం మండల పరిషత్‌ కార్యాలయం భవనంపైకి చేరుకొని వృద్ధులు నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం నెర్రెపల్లిలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు.

గొరెల కాపరిని దారుణ హత్య

మహబూబ్‌నగర్‌, డిసెంబర్‌ 12 : జిల్లాలోని పెబ్బేరు మండలం తాటిపాములలో గొర్రెల కాపరిని దుండగులు దారుణ హత్య చేశారు. అనంతరం 100 గొర్రెలను దుండగులు ఎత్తుకెళ్లారు.

Thursday, December 11, 2014

విద్యుత్‌ భారం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 10(ఆంధ్రజ్యోతి): మధ్య తరగతిపై విద్యుత్‌ భారంఈ మేరకు విద్యుత్‌ బిల్లింగ్‌ కేటగిరీల్లో మార్పులు చేస్తూ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తద్వారా విద్యుత్‌ వినియోగంలో క్రమశిక్షణ పాటించకుంటే అధిక చార్జీలను చెల్లించక తప్పదనే హెచ్చరికను వినియోగదారులకు ఇవ్వాలని తెలంగాణ డిస్కంలు భావిస్తున్నాయి. బుధవారం ఇక్కడ విద్యుత్‌సౌధలో తెలంగాణ విద్యుత్‌ కొనుగోలు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. 

రైతు కష్టాలు నాకు తెలుసు

 నేను రైతు బిడ్డను...చిన్నప్పుడు తండ్రితో పాటు వ్యవసాయం చేశానని, రైతుల కష్టాలు ఏంటో తనకు తెలుసని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం జిల్లాలో రైతు విముక్తి పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు రైతులకు రుణమాఫీ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైతులు దిగాలు పడేందుకు వీల్లేదని ఆయన అన్నారు.

చంద్రబాబును సన్మానించిన బ్రాహ్మణ యువజన సంఘం

ఆంధ్రప్రదేశ్‌లోని పేద బ్రా హ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తోందని ఏపీ బ్రా హ్మణ సేవా సంఘ సమా ఖ్య యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ద్రోణంరాజు రవి కుమార్‌ అన్నారు. సచివాల యంలో చంద్రబాబు నాయుడును ఆయన బుధవారం కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ యువజన సంఘం నాయకులు సీతారామ్‌, సునీత, కె.తులసీ, వేదవర్మ తదితరులు పాల్గొన్నారు 

Wednesday, December 10, 2014

చంద్రబాబు

: ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఏసియన్‌ డెవలపర్స్‌ బ్యాంకర్ల బృందం బుధవారం ఉదయం సమావేశమైంది.

కరీంనగర్‌, లో సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల పర్యటన ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పొగమంచు కారణంగా హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతించలేదు. దీంతో సీఎం కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయంలో వేచివున్నారు.

ఊరంతటికీ కరెంటు షాక్

 ఊరంతటికీ విద్యుత్‌షాక్‌ రావడంతో ఓ యువకుడు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం కోనాయపల్లి (పీటీ)లోమంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం 6.30 గంటలకు సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టేందుకు ప్రయత్నించిన చెట్టి శ్రీకాంత్‌ (21) అనే యువకుడు షాక్‌కు గురైయ్యాడు. గమనించిన అతడి తల్లి తండ్రులు శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇదే ఘటనలో గ్రామానికి చెందిన తూం ఆనద్‌, తూం మంగమ్మ, మన్నె సురేఖ, బక్క అరుణ, బక్క శోభ, చెట్టి మహిపాల్‌, చెట్టి పృథ్వీరాజ్‌లు విద్యుత్‌ షాక్‌ గురై గాయపడ్డారు. అయితే.. కోనాయపల్లి(పీటీ) సింగిల్‌ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో పది రోజులుగా ఎర్తింగ్‌ లోపం తలెత్తిందని, దీంతో విద్యుత్‌ షాక్‌ సమస్య వస్తోందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రుణమాఫీ పై మంత్రి

రాష్ట్రం ఆర్థి క ఇబ్బందుల్లో వున్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిన ప్రభుత్వాన్ని అభినందించాల్సిందిపోయి అనవసర రాద్ధాంతం చేయడం విపక్షాలకు తగదని గృహనిర్మాణ శాఖ మంత్రి మృణాళిని అన్నారు. మంగళవారం ఆమె విజయనగరంలో మాట్లాడారు. తుఫాన్‌ బాధితుల కోసం ఉత్తరాంధ్రతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 

చంద్రబాబు

ముఖ్యమంత్రిచంద్రబాబు బ్రాహ్మణ బంధువు అని రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక కోకన్వీనర్‌, గుంటూ రు జి ల్లా టీడీపీ నాయకుడు సిరిపురపు శ్రీధర్‌ అన్నారు. ఏ పీ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ను ఏర్పా టుచేస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంగళవారం గుంటూరులో టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. 

.ఆకలి కి అధికారం

‘నేను చిన్నతనంలో హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. సమయానికి భోజనం ఉండేది కాదు.. రుచిలేదు, నాణ్యత లేదు.. ఆకలితో అలమటించేవాళ్లం. ఆ ఆకలి నుంచే ఆలోచన వచ్చింది.. ఆ ఆలోచన నుంచి చైతన్యం వచ్చింది. ఆ చైతన్యమే పోరాటానికి దారి తీసింది. ఆకలి తెలిసిన వాడికి అధికారం ఇస్తేనే అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది’’ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందని ప్రశ్నించిన వారికి మాదిగల అభివృద్ధే నిదర్శనమన్నారు.

రైతుకు అన్యాయం జరగనివ్వం

రాష్ట్రంలో అనేక కష్టాలున్నాయి. లోటు బడ్జెట్‌తో పథకాలు అమలు చేయడానికి ఇబ్బందులు వస్తున్నా యి. అయినా దేశానికి వెన్నెముక లాంటి రైతన్నను ఆదుకొని వారి కళ్లల్లో ఆనందం చూడాలనే రుణమాఫీని అమలు చేశామని రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్

కబ్జాదారులపై ఉక్కుపాదం! ఇది ప్రభుత్వ నిర్ణయం! సచివాలయంలో మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయం స్పష్టం చేశారు. నిరుపేదలకు 60 గజాలు క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.

కేసీఆర్‌కుట్ర మంద కృష్ణ

 దళిత ఉపకులాల ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ ఎమ్మార్పీఎస్‌ ను బలహీన పర్చడానికి, కేసీఆర్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంద కృష్ణమాదిగ విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా కాటారంలో మం గళవారం ఆయన మాట్లాడుతూ మాదిగలు సంఘటితమైతే తెలంగాణలో తన భవిష్యత్‌ ఇబ్బం దుల్లో పడుతుందని భావించిన కేసీఆర్‌ ఉద్యమాన్ని బలహీనపరచడానికి కుట్రలు చేసి తెలంగాణ మాదిగ దండోరాను ఏర్పాటు చేయించారన్నారు.

కేసీ ఆర్ తెలంగాణ

అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ బంగారు తెలంగాణను ఇచ్చారని, మరి రత్నాల తెలంగాణ చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హామీ ఏమైందని శాసనమండలి కాంగ్రెస్‌ పక్ష నేత డి.శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి  కాలు జారిపడ్డారు. ఆయనకు రక్తపు గాయాలయ్యాయి. హుiటాహుటిన ఆయనను నిమ్స్కు తరలించారు. సుగర్ వ్యాధి ఉన్న ఆయనకు గతంలోనే కాలిపై ఒక గాయం అయింది. ఈ రోజు కాలు జారిపడటంతో ఆ గాయంపైనే మళ్లీ గాయం అయింది. దాంతో రక్తం కారింది. ఆయన ఛాంబర్లో రక్తపు మరకలు కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఆయనకు నిమ్స్లో చికిత్స చేస్తున్నారు.

.

Tuesday, December 9, 2014

స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టాలి; ఛంద్రబాబు

హైదరాబాద్ ;సచివాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా ఉన్నత  స్థానంలో ఉన్నప్రతి ఒక్కరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి  చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

Monday, December 8, 2014

రాజధాని ప్యాకేజీ..


 రాజధాని కోసం సమీకరించే మెట్ట భూమికి ఎకరాకు వెయ్యి గజాల చొప్పున రెసిడెన్షియల్‌, 200 గజాల వంతున కమర్షియల్‌ ప్లాటు ఇస్తారు.
 జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల రెసిడెన్షియల్‌ ప్లాటు, 300 గజాల కమర్షియల్‌ ప్లాటు ఇస్తారు.
 అసైన్డ్‌ భూములకు ఎకరాకు 800 చొప్పున రెసిడెన్షియల్‌ ప్లాటు ఇస్తారు. (మెట్ట, జరీబు రెండింటికీ ఇంతే). కమర్షియల్‌ మాత్రం... అసైన్డ్‌ మెట్ట భూములకు వంద చదరపు గజాలు, జరీబు భూములకు మాత్రం 200 గజాల చొప్పున ఇస్తారు. 
 పదేళ్లపాటు ఏటా చెల్లించే పరిహారం మెట్ట భూములకు రూ.30వేల చొప్పున ఇస్తారు. ప్రతిఏటా 10 శాతం అంటే... 3 వేలు పెంచుతూ పోతారు. జరీబు భూములకు ఎకరాకు రూ.50వేల చొప్పున చెల్లిస్తారు. ఏటా రూ.5వేల చొప్పున పెంచుతారు. 
 రైతులు ప్రభుత్వానికి భూమి అప్పగించిన వెంటనే రసీదు ఇస్తారు. వారి వాటా భూమిపై 9 నెలల్లోనే యాజమాన్య హక్కులు కల్పించి, మూడేళ్లలో అభివృద్ధి చేసిన స్థలాలు అప్పగిస్తారు.
 భూ సమీకరణ ప్రాంతంలో రైతులు, కౌలుదారులు అందరికీ... ఒకేసారి 12వేల కుటుంబాలకు చెందిన రూ.200 కోట్లు రుణమాఫీ జరుగుతుంది.
 రైతుల నుంచి భూమి సేకరించిన జోన్‌లోనే వారి వాటా ప్లాట్లు కూడా అప్పగిస్తారు. ఒకే రైతుకు సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో భూములిచ్చే రైతులకు ఒకేచోట నిష్పత్తి ప్రకారం స్థలం ఇస్తారు.
 రాజధాని ఏర్పడ్డాక సంబంధిత రైతులకు రిజిసే్ట్రషన్‌, ఇతర ఫీజుల నుంచి మినహాయింపు.
 కౌలుదారుల కుటుంబాల కోసం క్యాపిటల్‌ రీజియన్‌ సోషల్‌ సెక్యూరిటీ ఫండ్‌ ఏర్పాటు చేసి... నెలకు రూ.2500 చొప్పున పదేళ్లపాటు సహాయం.
 రాజధాని ప్రాంత భూ సమీకరణలో భాగస్వాములైన రైతులకు నివాస, వాణిజ్యం స్థలాలను ఆయా కేటగిరీల వారీగా లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు.
 ఇళ్లు లేనివారికి, రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే వారికి ప్రభుత్వమే నివాస గృహాలు నిర్మించి ఇస్తుంది. 
 గ్రామకంఠంలో ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తారు.
 భూ సమీకరణ ప్రాంతంలో నేటి వరకు (డిసెంబర్‌ 8) నివాసం ఉన్న అందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యం.
 వృద్ధులకు ఆశ్రమాలు, పేదలకు అన్న క్యాంటీన్లు, కూలీలకు 365 రోజులపాటు ఉపాధి హామీ అమలు.
 పేద కుటుంబాల వారికి స్వయం ఉపాధి అవకాశాల కోసం రూ.25లక్షల వరకూ వడ్డీలేని రుణసాయం. నిర్మాణ పనులకు స్థానికుల ట్రాక్టర్లే ఉపయోగిస్తారు. 
 ప్రస్తుతం భూముల్లో ఉన్న పంటలు రైతులకే చెందుతాయి. నిమ్మ, సపోటా, జామ తోటల రైతులకు ఎకరాకు రూ.50వేలు అదనపు సాయం. 
 భూముల రిజిసే్ట్రషన్లు కొనసాగుతాయి. టేకుచెట్ల అమ్మకాలకూ అనుమతి ఇస్తారు.
 దేవాదాయ శాఖ భూములుంటే వాటికి కూడా రైతుల తరహాలోనే పరిహారం.
 శ్మశానాలు, ప్రార్థన స్థలాలకు ప్రాధాన్యం.
 స్థోమత, ఆసక్తి ఉన్న రైతులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు శిక్షణ.
 రాజధాని నిర్మాణం పూర్తి అయ్యాక ఒక ముఖ్య భవనానికి మాజీ మంత్రి, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ఎస్‌ కోటేశ్వరరావు పేరు.
 భూ యజమానుల పేర్లను బహిరంగంగా ప్రకటించి సవరణలు స్వీకరించాక తుది జాబితా విడుదల చేస్తారు.

Thursday, November 20, 2014

దేశం బాగు పడాలంటే ప్రత్యేక చట్టాలు తేవడం కాదు... ముందు సమాజం మారాలి.... అత్తులూరి విజయలక్ష్మి


  • ఆడ పిల్లలకు... మగ పిల్లలకు జన్మనిచ్చేది అమ్మే.... అత్తులూరి విజయలక్ష్మి
  • మహిళలపై అత్యాచారాలు, వరకట్న వేధింపులు అరికట్టాలి;  
  • ఆధ్య అనే స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు శరత్ బాబు...,
  • మహిళల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభం...
  • ఆధ్య అనే స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు శరత్ బాబు...



 
ఆధ్య అనే స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు శరత్ బాబు,  హ్యూమన్ రైట్స్ ఛైర్మెన్ మహ్మద్ అసిఫుద్దిన్, అత్తులూరి విజయలక్ష్మి స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు నిరసిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు....


 వెబ్ న్యూస్, హైదరాబాద్:
 స్త్రీ లేనిదే సృష్టి లేదు... ఆడ పిల్లలకు....మగ పిల్లలకు జన్మనిచ్చేది స్త్రీనే అన్న విషయాన్ని గుర్తించాలని శ్రీనగర్ కాలనీ కార్పొరేటర్ అత్తులూరి విజయలక్ష్మి అన్నారు. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అమీర్ పేటలోని ఆధ్య అనే స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు శరత్ బాబు ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను  హ్యూమన్ రైట్స్ ఛైర్మెన్ మహ్మద్ అసిఫుద్దిన్ ముఖ్య అతిథులుగా  హాజరై గురువారం నాడు   ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లైంగికదాడులు, అత్యాచారం,  యాసిడ్ దాడులను అరికట్టాలన్నారు. మన దేశంలో పావుగంటకోటి బాల్య వివహాలు, వరకట్న వేధింపులతో మహిళలు సతమతమవుతున్నారన్నారు. ఈ పరిస్థితి మారాలంటే రావాల్సింది మరింత కఠినమైన చట్టాలు కాదు ముందుగా సమాజంలో మార్పు రావాలన్నారు. ప్రతి స్త్రీని ఒక  అమ్మగా.... అక్కగా చూస్తే మనిషికి సంస్కారం ఉంటుందన్నారు. మహిళలను కాపాడాలి.... బాల్య వివాహాలు వద్దు... బాలికా విద్యను ప్రోత్సహించాలనే నినాధాలతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొని సందడి చేశారు.