కనీస వేతనాలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలన్న ప్రధాన డిమాండ్లతో అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. సుమారు ఐదు గంటలపాటు కార్యాలయం ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి ఓబులు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు మారిన మనిషనని చెప్పుకున్నా... ఆయన మారని మనిషే అని ఇప్పుడు నిరూపించుకుంటున్నారని విమర్శించారు.
Saturday, March 14, 2015
'రాజధాని' పేదలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి
రాజధాని ప్రాంతంలోని భూమి లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 5 ఎకరాల అటవీభూమి ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులో డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండినవారికి ఉపాధి చూపేంత వరకు నెలకు రూ. 5 వేల భృతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. అనంతవరంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని మరో తిరుపతిలా అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
Friday, March 13, 2015
'చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు'
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పారని అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. సభ పదినిమిషాలు వాయిదా అనంతరం వై.విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలపై ఇప్పుడు తుంగలోకి తొక్కారన్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం నిస్సిగ్గుగా మాటమార్చుతోందన్నారు
Wednesday, March 11, 2015
ఎన్నికల హామీల అమలు కోసం దీక్ష
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్ రిలేనిరాహార దీక్ష చేపట్టారు. హామీలతో పాటు అంగన్ వాడీ కార్యకర్తల జీతాలను వెంటనే చెల్లించాలంటూ తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆయన మంగళవారం ఈ దీక్షను ప్రారంభించారు. వరసాల ప్రసాద్ చేపట్టిన రిలే నిరాహారదీక్షకు జిల్లాలోని వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మద్ధతు తెలిపాయి.
జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయి'
చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాబు నెరవేర్చలేదన్నారు. సభలో ప్రతిపక్షం నిరుద్యోగ సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు.
బాబు వస్తే జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగాలు రాకపోగా...దాదాపు 50 వేల మంది ఉన్న ఉద్యోగాలను కోల్పోయారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంతో చర్చకు రాలేకే తమ వాయిదా తీర్మానాలను తిరస్కరించారని విమర్శించారు. ప్రాధాన్యత గల అంశాలను సభలో చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు.
బాబు వస్తే జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగాలు రాకపోగా...దాదాపు 50 వేల మంది ఉన్న ఉద్యోగాలను కోల్పోయారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంతో చర్చకు రాలేకే తమ వాయిదా తీర్మానాలను తిరస్కరించారని విమర్శించారు. ప్రాధాన్యత గల అంశాలను సభలో చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు.
Tuesday, March 10, 2015
చంద్రబాబు మహిళా ద్రోహి: రోజా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఏరు దాటక ముందు ఏటి మల్లన్న...ఏరుదాటాక ఓటి మల్లన్న' అన్నట్లు ఎన్నికల ముగిసిన తర్వాత డ్వాక్రా మహిళలను చంద్రబాబు రోడ్డున పడేశారని ఆమె అన్నారు. డ్వాక్రా మహిళలను డబ్బులిచ్చి మరీ సమావేశాలకు తీసుకు వచ్చే చంద్రబాబు అధికారంలోకి వచ్చాకా వారిని విస్మరించారన్నారు.
Monday, March 9, 2015
చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు..
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా రాకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అన్యాయం చేస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని కేఎస్‌ఆర్ గార్డెన్‌లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన పరకాల నియోజకవర్గ పట్టభద్రుల సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హా జరైన శ్రీహరి మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్ విషయమై ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలు చంద్రబాబును ఎందు కు అడగడం లేదని ప్రశ్నించారు. ఈ విషయం అడగలేని నేతలు అసెంబ్లీలో రాద్ధాంతం చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. అయితే, టీడీపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ పార్టీని కానీ, చంద్రబాబును కానీ తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు.
Thursday, March 5, 2015
అంతన్నారు.. ఇంతన్నారు
‘నా అక్క చెల్లెమ్మలను రుణ విముక్తులను చేస్తా.. అన్ని రంగాలలో వారిని దూసుకుపోయేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తా..’- ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానాల్లో ఒకటి. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాల పనితీరు తిరోగమన దిశలో పయనిస్తోంది. స్వయం సహాయక సంఘాలు అంటేనే రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు సైతం కరువు జిల్లా అనంతపురం వైపు చూశాయి. అంతన్నారు.. ఇంతన్నారు పటిష్టంగా పనిచేస్తున్న డ్వాక్రా సంఘాలను ప్రస్తుత ప్రభుత్వం బ్రష్టు పట్టించింది.
తెలంగాణపై బాబు మొసలి కన్నీరు’
తెలంగాణ రాష్ట్రంపై, ఇక్కడి రైతులపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ విమర్శించారు. తెలంగాణకు ప్రపంచంలో ఎవరూ చేయని అభివృద్ధిని తానే చేసినట్లు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ప్రభుత్వ విప్ సునీతా మహేందర్‌రెడ్డి, మరో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లతో క లసి విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం దండగ అన్న పెద్దమనిషి, ఇపుడు రైతుల పట్ల కపట ప్రేమ ఒలకబోస్తున్నాడని కర్నె వ్యాఖ్యానించారు. తెలుగుదేశం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాల వల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందన్నారు. తెలంగాణలో గందరగోళం సృష్టించేందుకు చంద్రబాబు, మంద కృష్ణ మాదిగ చీకటి ఒప్పందాలు చేసుకున్నారా అని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు.
బాబు తెలంగాణ ద్రోహి’
తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను ఇబ్బందుల పాలు చేయడానికే ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో ఆయన వైఖరి నోటితో మాట్లాడి, నొసటితో వెక్కిరించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రానికి సీఎంను అన్న విషయం మరిచి పోయి, తెలంగాణ విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్రంతో చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు పోరాడకుండా.. కేవలం అధికారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్డీఏ ప్రభుత్వంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం అన్యాయం చేసిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చంద్రబాబు.. మరి కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. విభజన తర్వాత ఆరు మాసాలలోపు ఏపీకి అనేక ప్రాజెక్టులు తీసుకువస్తానని చంద్రబాబు తెలుగు ప్రజలకు హామీలు గుప్పించారని, వాటిలో ఏ ఒక్కదానిపై కూడా ఒక్క నిమిషం ఆలోచించడంలేదని దుయ్యబట్టారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికిగల అవకాశాలను పరిశీలిస్తామని ఇచ్చిన హామీ కూడా గాలికి వదిలేశారన్నారు.
Wednesday, March 4, 2015
చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
‘ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాల పుట్ట. ఉత్తుత్తి వాగ్దానాలు చేస్తున్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. అవగాహన రాహిత్యంతో ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. జూలై నాటికి 35 టీఎంసీలు నీరు జీఎన్‌ఎస్‌ఎస్ ద్వారా తెస్తానని ప్రకటించారు. ప్రాజెక్టుల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఆ విషయం తొమ్మిదేళ్ల ఆయన గత పాలన తేటతెల్లం చేస్తోంది. క్షేత్ర స్థాయిలో వాస్తవ విషయాలు తెలుసుకుని జీఎన్‌ఎస్‌ఎస్ పథకానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. సత్వరమే యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులు చేపట్టాల’ని కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో మూడు రోజులుగా నిరవధికనిరహార దీక్ష చేస్తున్న ఆయన మంగళవారం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
ఎందాకైనా పోరాడతా
రాజధాని ప్రాంత రైతులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా
బలవంతంగా భూములు తీసుకోవడం ముమ్మాటికీ అన్యాయమే
చంద్రబాబు మోసాలు ఇంకా తగ్గలేదు.. ఈ సర్కారు కూలిపోవడం ఖాయం
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బాబుకు డిపాజిట్లు దక్కవు
వినుకొండలో 18 వేల ఎకరాల డీనోటిఫైడ్ భూములున్నాయి.. అక్కడ కట్టుకోవచ్చు కదా!
సన్న, చిన్నకారు రైతుల పొట్టలు కొట్టడం ఎందుకు?
మా పార్టీ అధికారంలోకి రాగానే లాక్కున్న భూములను వెనక్కు ఇచ్చేస్తాం
బలవంతంగా భూములు తీసుకోవడం ముమ్మాటికీ అన్యాయమే
చంద్రబాబు మోసాలు ఇంకా తగ్గలేదు.. ఈ సర్కారు కూలిపోవడం ఖాయం
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బాబుకు డిపాజిట్లు దక్కవు
వినుకొండలో 18 వేల ఎకరాల డీనోటిఫైడ్ భూములున్నాయి.. అక్కడ కట్టుకోవచ్చు కదా!
సన్న, చిన్నకారు రైతుల పొట్టలు కొట్టడం ఎందుకు?
మా పార్టీ అధికారంలోకి రాగానే లాక్కున్న భూములను వెనక్కు ఇచ్చేస్తాం
చంద్రబాబు.. ఆ నేతలను ఎంతకు కొన్నారో?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ కు చంద్రబాబు చేసింది ఏమీలేదని ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. హైదరాబాద్ ను గుడిసెల నగరంగా మార్చింది చంద్రబాబేనని... వ్యవసాయం దండగ అన్న బాబు... ఇప్పుడు వ్యవసాయంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇతర పార్టీ నేతలను టీఆర్ఎస్ కొంటుందని తమపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు ...ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎస్ పీవై రెడ్డి, జూపూడి ప్రభాకర్ లాంటి నేతలను ఎంతకు కొన్నారో చెప్పాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Tuesday, March 3, 2015
ఆత్మహత్యలపై ‘లెక్క’లేనితనం!
వ్యవ‘సాయం’ వెక్కిరించడంతో పురుగు మందు తాగి ప్రాణాలొదిలింది ఒకరు.. ఎండుతున్న పంటలను చూసి గుండెమండి మరణించిందొకరు.. దిగుబడి రాక, అప్పులు తీర్చలేక ఉరితాడుకు వేలాడిందొకరు.. కారణమేదైనా.. సమాజానికి అన్నం పెట్టే రైతన్నల నిండుప్రాణాలు నిలువునా నీరుగారుతున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి (2014 జూన్ 2 నుంచి) ఇప్పటిదాకా మరణించిన రైతులెందరో తెలుసా? టీఆర్‌ఎస్ సర్కారు చెబుతున్నట్లుగా 130 మంది మాత్రం కాదు.. ఆ సంఖ్య 760 వరకూ ఉండొచ్చని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఆత్మహత్యల్ని శాస్త్రీయంగా లెక్కించకపోవడం వల్లే బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలు కకావికలవుతున్నాయి.
బాబు హయాం నుంచే రైతుల ఆత్మహత్యలు'
చంద్రబాబు పాలన నుంచే రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యూయని విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్రనేత వరవరరావు అన్నారు. వరంగల్ జిల్లా పరకాల మండలంలోని నాగారంలో ఆత్మహత్యకు చేసుకున్న రైతు వంగ రవి కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. రవి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
బాబూ.. డ్రామాలు ఇక చెల్లవు
‘రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఆడుతున్న డ్రామాలు ఇక చెల్లవు.. బీజేపీతో పొత్తు బాబు పతనానికి నాంది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభంజనంలో ప్రతిపక్షపార్టీలు నామరూపాలు లేకుండాపోతాయి. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వచ్చిన పురందేశ్వరి చిరునామా ఎక్కడో ఎవరికైనా తెలుసా ? అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం పుంగనూరు పట్టణంలో వేలాదిమంది అభిమానులతో పెద్దిరెడ్డి రోడ్‌షో నిర్వహించారు.
చంద్రబాబుది దుర్బుద్ధి: పురందేశ్వరి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిది దుర్బుద్ధి అని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పి. మాణిక్యాలరావు అధ్యక్షతన ఏర్పాటైన కరువు పరిశీలన బృందం సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కూడలికి చేరుకుంది. ఇక్కడి జనసమూహాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడిన తరువాత పురందేశ్వరి ప్రసంగించారు.
Monday, March 2, 2015
చంద్రబాబు వల్లే రైతు ఆత్మహత్యలు: కడియం
రాష్ట్ర పునర్విభజన బిల్లు 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ ఇవ్వకుండా అడ్డుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు వల్లే రైతులు చనిపోతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా హన్మకొండలో ఆదివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ దిగువ సీలేరులో 54శాతం, కృష్ణపట్నం ప్రాజెక్టు ద్వారా రావాల్సిన విద్యుత్ ఇవ్వనందునే తెలంగాణలో విద్యుత్‌కోతలు ఎక్కువయ్యాయన్నారు.
బాబు మోసపూరిత పాలనపై ఉద్యమం
సీఎం చంద్రబాబు మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైందని కమలాపురం ఎమ్మెల్యేపోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ఆయన ఆదివారం వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరహారదీక్ష చేపట్టారు. ఈ శిబిరంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ,వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబులు మాట్లాడారు.
Subscribe to:
Comments (Atom)