photo gallery

 

Thursday, June 18, 2015

మంత్రులూ మాటలు కట్టిపెట్టండి'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఓటుకు కోట్ల వ్యవహారంలో మాటలు కట్టిపెట్టి.. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని అమర్ నాథ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

'చంద్రబాబును అన్నందుకే వైఎస్సార్ మరణించారని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. జగన్ పై కేసు పెట్టినందుకే ఎర్రన్నాయుడు చనిపోయారు. మరి దీనికి ఏమంటావ్' అని అమర్ నాథ్ మంత్రి అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Saturday, June 6, 2015

బాబూ.. జాబు ఎక్కడ?

జాబు రావాలంటే బాబు రా వాంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే లేకుండా ఉన్నారని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంజనీ శ్రీనివాస్ విమర్శిం చారు. శుక్రవారం కడప నగరంలోని హ రిత హోటల్‌లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత వి వేకానందుడు, సరస్వతీ చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముఖ్య అతిథిగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంగతే మర్చిపోయారన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీకి నియమ నిబంధనలను వర్తింపచేసి ప్రజలను మోసం చేశారన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని ప్రారంభించకుండా ఎవరికో మేలు చేసేందుకు పట్టిసీమ పథకాన్ని ప్రారంభించారన్నారు.

Thursday, June 4, 2015

రాయలసీమపై 'బాబు' మొసలి కన్నీరు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్సీ గేయానంద్ విమర్శించారు. గురువారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును గేయానంద్ ఎండగట్టారు. రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తన్న చంద్రబాబుకు హంద్రీనీవా ప్రాజెక్టు కనిపించలేదా అని ప్రశ్నించారు.

హంద్రీనీవా ప్రాజెక్లు పూర్తి కావాలంటే రూ.2500 కోట్లు అవసరమైతే.. ప్రభుత్వం కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆరోపించారు. ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు నూతన రాజధానిపై చూపిస్తున్న శ్రద్ధ.. కరువు రైతులపై ఎందుకు చూపలేదో సమాధానం చెప్పాలని గేయానంద్ డిమాండ్ చేశారు.

Tuesday, June 2, 2015

చంద్రబాబును ఏ1 ముద్దాయిగా పెట్టాలి'

రేవంత్ రెడ్డి వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రిలో జ్యోతుల నెహ్రు మాట్లాడారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ 1 ముద్దాయిగా పెట్టాలన్నారు. ఈ వ్వవహారాన్ని అవసరమైతే సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు. 

ఒక్క హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదు

ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. చంద్రబాబు తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 8న టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేయనున్నామని తెలిపారు

ఆంధ్రాకి న్యాయం చేసి తెలంగాణ ఇవ్వమన్నా

రాష్ట్రాన్ని విభజించదలచుకుంటే ఆంధ్రాకి న్యాయం చేసి తెలంగాణ ఇవ్వమని యూపీఏ సర్కార్ కు విజ్ఞప్తి చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు తెలిపారు. తన విజ్ఞప్తిని పక్కన పెట్టి యూపీఏ ప్రభుత్వం ఏక పక్షంగా రాష్ట్రాన్ని విడగొట్టారని ఆయన ఆరోపించారు. మంగళవారం బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు ప్రసంగించారు. ఓట్లు కావాలని.. సీట్లు గెలవాలని సోనియాగాంధీ భావించారు. అందుకోసమే హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. విభజనపై జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసి... ఆ నివేదికను పక్కన పెట్టి మరీ రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. సోనియా గాంధీకి డబ్బుపై మమకారం ఎక్కువని... అందుకే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడి చేయించారని చంద్రబాబు ఆరోపించారు.

Monday, June 1, 2015

రేవంత్ రెడ్డి బయట ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు'

ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి నిరపరాధి అని, ఆయనపై రాజకీయ కుట్ర జరిగిందని భావిస్తున్నామని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు అన్నారు. ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి న్యాయవాదులు సోమవారం సిటీ సివిల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఏసీబీ ఆరోపణలను న్యాయస్థానంలో ఎదుర్కొంటామని తెలిపారు. ఇందుకు సంబంధించి న్యాయమూర్తి... వీడియోలు, ఆడియోలను పరిశీలించాలని పిటిషన్ లో కోరినట్లు చెప్పారు.  ఈ కేసులో రేవంత్ రెడ్డి బయట ఉన్నప్పుడు అరెస్ట్ చేశారని,  ఈఘటనను రాజకీయ కుట్రగానే భావిస్తున్నామని న్యాయవాదులు తెలిపారు.

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డిని ఈరోజు ఉదయం పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఇదేమి మాఫీ బాబూ..?

రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని, ఎవరూ వడ్డీలు కట్టనక్కర్లేదని, ఇంటికి పెద్దకొడుకులా అన్నీ తాను చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. వీటిని నమ్మి టీడీపీకి ఓట్లేసిన గిరిజనం ఇప్పడు బ్యాంకు నుంచి వడ్డీలు కట్టాలంటూ వస్తున్న నోటీసులు చూసి అవాక్కవుతున్నారు. ఇదేమి రుణమాఫీ బాబూ.. అని ప్రశ్నిస్తున్నారు. తాము తీసుకున్న రుణ మొత్తాన్ని పాసుబుక్కులో ఒకలా చూపిన బ్యాంకు అధికారులు నోటీసుల్లో మరోలా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.

 -బొబ్బిలి మండలం కాశిందొరవలస పంచాయతీకి చెందిన నర్రా రామన్నదొర (ఏపీజీవీబీ ఖాతా నంబరు 73005203708) 25-06-2010న 19 వేల రూపాయలు రుణంగా తీసుకున్నారు. పాసుబుక్‌లో ఇదే ఎంటర్ అయింది. అయితే అతను 24 వేల రూపాయలు రుణం తీసుకున్నాడని, దానికి వడ్డీతో సహా (31-03-2014 నాటికి) 34,699 రూపాయలు చెల్లించాలని ఏపీజీవీబీ బొబ్బిలి శాఖ నుంచి నోటీసు వచ్చింది. తనకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 3,371 రూపాయలు మాఫీ అయినట్లు ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందని, ఇంతలోనే వారంలోగా ఈ మొత్తం చెల్లించాలని నోటీసు రావడమేమిటని రామన్నదొర ఆశ్చర్యపోతున్నారు.

Saturday, May 30, 2015

'టీడీపీని చూసి టీఆర్ఎస్ భయపడుతోంది'

తెలుగుదేశం పార్టీని చూసి టీఆర్ఎస్ భయపడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ సమీపంలో గండిపేటలో జరుగుతున్న మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేశారు.  2019లో తెలంగాణలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మీ గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు సవాల్ విసిరారు. నీతి నిజాయితీగా రాజకీయాలు చేయాలని, కుట్రలు, కుతంత్రాలతో కాదని అన్నారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ భూముల విక్రయం సరికాదని చంద్రబాబు అన్నారు.

బాబు ఆయా.. జాబు గయా

బాబు వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, జాబు కావాలంటే బాబు రావాలని, ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు జీవన భృతి కింద రూ.2 వేలు చొప్పున అందజేస్తామని గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలతో మభ్యపెట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనూ ఊడబెరికారు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసే లేదు. నిరుద్యోగ భృతి వాగ్దానాన్ని మేనిఫెస్టోలో ఐదో ప్రాధాన్యత అంశంగా పొందుపరచడం గమనార్హం. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫొటో పక్కన పెట్టుకొని మరీ పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వడం కొసమెరుపు.

బాబూ.. నీ ముఖం ఓసారి అద్దంలో చూసుకో!

‘‘సంపదను సృష్టించాను. దాన్ని కేసీఆర్ బాగా చూసుకోవాలి’’ అని మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని ఘాటుగా స్పందించారు. హైటెక్‌సిటీని కట్టి హైదరాబాద్ అభివృద్ధి అంతా తన ఘనతే అని చెబుతున్న చంద్రబాబు తన ముఖాన్ని ఓసారి అద్దంలో చూసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. మహానగర చరిత్ర 400 ఏళ్ల పైమాటే అని, అది తెలుసుకుని మాట్లాడాలన్నారు. దిక్కూ మొక్కు లేని ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టించుకుంటే బాగుంటుందని తలసాని చంద్రబాబుకు సూచించారు. అయ్యా.. కొడుకు పట్టిసీమలో ఎంత కొట్టేశారో తనకు తెలుసని, ఒక్క రోజు యోగా కోసం రూ. కోటి 25 లక్షలు ప్రభుత్వ నిధులను విడుదల చేస్తే ఎవరూ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ‘‘ట్విట్టర్ పిట్టీ మహానాడులో మాట్లాడుతుంటే కరెంటు పోయిందంట... ఇదీ ఇక్కడి పరిస్థితి అని అంటున్నాడు... ఇంట్లో ఎలా పడుకుంటున్నాడో’’అంటూ   లోకేశ్‌ను ఉద్దేశించి అన్నారు. రెండు గదుల బెడ్‌రూంలు ఐడీహెచ్ కాలనీలో తయారవుతున్నాయని  వెల్లడించారు.

Thursday, May 28, 2015

మహిళలు తిరగబడతారనే ఇక్కడ పెట్టారు'

ఆంధ్రప్రదేశ్ లో మహానాడు పెడితే రైతులు, మహిళలు చంద్రబాబుపై తిరగబడతారని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆ కారణం చేతనే  హైదరాబాద్ నగరంలో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ లో కేటీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ ను చంద్రబాబే అభివృద్ది చేస్తే తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా ఎందుకు పోయిందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వారే అని కేటీఆర్ గుర్తు చేశారు. అలాంటి వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబుకే అంత పలుకుబడి ఉంటే గూగుల్ సంస్థను ఏపీలో ఎందుకు విస్తరించలేదని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు మమ్మల్ని కూడా బాధిస్తోందని... వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల వారు ఉండొచ్చని కేటీఆర్ తెలిపారు.

24 గంటల్లో ఆ ఎంపీలు రాజీనామా చేయాలి'

ఆంధ్రప్రదేశ్ రైల్వేకి ప్రత్యేక జోన్ ఇప్పట్లో వచ్చేట్లు కనిపించడం లేదు. బీజేపీ నేతలు విశాఖ వాసుల ఆశలపై నీళ్లు చల్లారు. మే 27 న విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి ప్రకటన విడుదల చేస్తామంటూ హడావుడి చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. దీంతో ఆగ్రహించిన ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ ఫోరం నేతలు బీజేపీ కార్యాలయం వద్ద గురువారం ఆందోళనకు దిగారు.

24 గంటల్లో విశాఖపట్నం, అనకాపల్లి ఎంపీలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆ ఇద్దరు ఎంపీల ఇళ్లు, కార్యాలయాలు ముట్టడిస్తామని ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ ఫోరం నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తారంటూ ఫోరం సభ్యుడు చలసాని గాంధీ ప్రశ్నించారు.

Tuesday, May 26, 2015

మోసం చేయడం బాబు నైజం

ప్రజలను వంచించడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక బాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలముందు అధికారంలోకి రావడానికి అనేక హామీలను గుప్పించారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్క హామీని అమలుపరిచిన పాపానపోలేదన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలపై పోరాటాలు చేస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రులచేత, ఎమ్మెల్యేలచేత బురదచల్లించే ప్రయత్నాలు బాబు చేస్తున్నారన్నారు.   జగన్‌ను విమర్శిస్తున్న టీడీపీ నాయకులు ముందుగా తమ పార్టీ అధినేత  ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీయాలన్నారు. వైఎస్‌ఆర్‌సీపీని పోలీసుల సాయంతో అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేయండని మంత్రులే పార్టీ నాయకులకు పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు.

గొంతులు లేస్తున్నాయి..

ఎన్నిలకప్పుడు పొత్తులు పెట్టుకున్న టీడీపీ, బీజేపీల మధ్య చిత్రమైన వాతావరణం నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ స్వరం మారుతోంది. మొన్న సోము వీర్రాజు, నిన్న మురళీధరరావు, ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ ...టీడీపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానాలు చేశారు. రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాలకు బీజేపీని దోషిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వారు మండిపడుతున్నారు. ఏపీ రాజధానికి భూ సేకరణతో పాటు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేతలు ఖండిస్తున్నారు. 

Monday, May 25, 2015

ఏం చేశారో!

ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హమీలను అమలు చేస్తున్నామని పలువురు రాష్ట్ర మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు వారేం చేశారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలని శాసనమండలి సభ్యుడు, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల.వీరభద్రస్వామి సవాల్ చేశారు. ఈ మేరకు ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోలగట్ల మాట్లాడారు. ఎన్నికలకు  ముందు అమలుకు వీలుకాని హామీలు గుప్పించి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం ఆ హమీలను నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాలన  ప్రారంభించిన ఏడాది కాలంలో  ఇప్పటికీ మోసపూరితంగానే నడుచుకుంటోందని మండిపడ్డారు.

26, 27 తేదీల్లో ‘జన్‌కల్యాణ్ సర్వ్: బీజేపీ

ప్రధాని మోడీ ఏడాది పాలనను పురస్కరించుకొని ఈ నెల 26, 27వ తేదీల్లో  ‘జన్ కల్యాణ్ సర్వ్’ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని బీజేపీ జిల్లా కమిటీ నిర్ణయించింది. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ 26న జిల్లావ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో విజయోత్సవాలను జరుపుకుంటామని తెలిపారు.

 అదే విధంగా ఈ నెల 27న జిల్లా కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమానికి మాజీ మంత్రి కావూరి సాంబశివరావు హాజరవుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రధానీ చేయని అభివృద్ధిని ఒక ఏడాదిలో మోడీ చేసి చూపించారని, ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు పాకలపాటి సన్యాసిరాజు, డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, ఇందుకూరి రఘురాజు, నిమ్మక జయరాజ్, పీవీవీ గోపాలరాజు, పి.అశోక్, ఎం.మధు, కెఎన్‌ఎం కృష్ణారావు, కుసుమంచి సుబ్బారావు, లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.
 

రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ఎవరో

రాష్ట్రాన్ని ముక్కలు చేసి  దుస్థితికి కారణమైందీ కాకుండా మళ్లీ కొత్త నాటకానికి తెరతీస్తే జనం నమ్మే పరిస్థితిలో లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఎండగట్టారు. పట్టణ సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చేసిందంతా చేసి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితికి విభజనే శాపమంటూ ప్రజలకు తెలియజేస్తామని చంద్రబాబు చెబుతుంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. అసలు కేంద్రానికి విభజనలేఖ ఇచ్చింది మొ దలు శాశనసభలో జరిగిన అన్ని విషయాలు సీ మాంధ్రులకు తెలియదా అని ప్రశ్నించారు.

Sunday, May 24, 2015

అధైర్యపడొద్దు..అండగా ఉంటా

మీకు అన్నివిధాలా అండగా ఉంటానని.. అధైర్యపడొద్దని.. ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మృతుని కుటుంబానికి భరోసా ఇచ్చారు. మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన ధనికెల రఘురాం ఈనెల 18వ తేదీన తోట వద్ద విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్, కడప ఎంపీవైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డిలతో కలిసి శనివారం తుమ్మలపల్లె గ్రామానికి చేరుకున్నారు. మృతుడు ధనికెల రఘురాం భార్య భారతి, తండ్రి చిన్ననారాయణలను ఓదార్చారు.

ఆ మాటే చంద్రబాబు నోట రావడం లేదు

సీఎం చంద్రబాబును మహిళలు, యువకులు తిట్టిపోస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఇంటికో ఉద్యోగం అన్నది బూటకంగా మారిందన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం బోనాలలో రైతు గంగాధర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.... గంగాధర్ చనిపోయి 3 నెలలు అవుతున్నా అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందించలేదని విమర్శించారు. తాను పరామర్శించేందుకు వెళుతున్నానంటే హడావుడిగా నామమాత్రం సాయం చేస్తారని ఎద్దేవా చేశారు.  డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్న మాట చంద్రబాబు నోట రావడం లేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

Saturday, May 23, 2015

మాటలతో బాబు కాలయాపన

ఏడాది కాలంగా మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగట్టి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఒత్తిడి చేయడానికే ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి సమర దీక్ష నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జూన్ 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు మంగళగిరిలో తలపెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి సమరదీక్షకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నేతలు శుక్రవారంనాడిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.

విభజనే కారణం

ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  విభజన గాయాలను గుర్తుచేయనున్నారు. ఏడాదిలో ఏం సాధించామంటే చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో... విభజనవల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందన్న అంశంపై ప్రజల్లో భావోద్వేగాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు.

Wednesday, May 20, 2015

కడియం చెప్పినా... బాబు కేబినెట్ స్పందించ లేదు

వరంగల్ నిట్ లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పినా...ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కేబినెట్ స్పందించకపోవడం వైఎస్ఆర్ సీపీ కొయ్య ప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో కొయ్యప్రసాదరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. నిట్ అంశంపై ఏపీకి జరుగుతున్న అన్యాయంపై టీడీపీ అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గమని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీ సీట్ల ఫీజులు పెంచి... ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కై విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.

రైతులకు ఏనాడైనా మేలు చేశావా?

రుణమాఫీపై రైతాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా వంచించారంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఇందిరాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఏనాడూ రైతులకు మేలు చేసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రధానికి లేఖ రాయడంపై రఘువీరారెడ్డి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

బాబు మోసాల్ని ఎండగట్టేందుకే జగన్ దీక్ష'

ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను ఎండగట్టేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ మొదటివారంలో విజయవాడ-గుంటూరు పరిసరాల్లో దీక్ష చేయబోతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విషయంలో ఏడాదిపాటు ప్రజలను మోసం చేసింది చాలక టీడీపీ విజయ యాత్ర, నవనిర్మాణ దీక్ష, నూతన రాజధానికి శంకుస్థాపన వంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Tuesday, May 19, 2015

ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్థం

ఉస్మానియా యూనివర్శిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. కేసీఆర్ హామీకి నిరసనగా విద్యార్థులు మంగళవారం ఉస్మానియా యూనివర్శిటీలో ఆందోళనకు దిగారు. ఓయూ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్శిటీ భూముల జోలికి వస్తే ఊరుకోమని వారు ఈ సందర్భంగా కేసీఆర్ ను హెచ్చరించారు.
అనంతరం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా పార్శీ గుట్టలోని బస్తీ వాసులకు ఓయూ భూముల్లో నివాసాలు కట్టిస్తానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనపై వివిధ రాజకీయపార్టీల నేతలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

వచ్చేనెలాఖరుకు ఇంజినీరింగ్ ప్రవేశాలు పూర్తి

:జూన్ నెలాఖరుకు  అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తి చేయాలని,  దీనికి కళాశాలల యాజమాన్యాలు సిద్ధం కావాలని జేఎన్‌టీయూకే వైస్ చాన్స్‌లర్ వీఎస్‌ఎస్ కుమార్  సూచించారు.  విజయనగరం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో చేపట్టనున్న ఇంజినీరింగ్ ప్రవేశాలకు అన్ని   కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.  ఇటీవల నిర్వహించిన ఎంసెట్-2015 ఫలితాలను  ఈ నెల 21న విడుదల చేయనున్నట్టు చెప్పారు. 

మొదట్నుంచి రైతులకు బాబు శత్రువే

ఏపీ సీఎం చంద్రబాబుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్ లో మండిపడ్డారు. మొదటి నుంచి రైతులకు చంద్రబాబు శత్రువే అంటూ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ద్రోహం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు 5 ఏళ్లు ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ పేర్కొంటే... కాదు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగింది. కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాడిన సంగతి తెలిసిందే. విభజన జరిగి ఏడాది కావస్తున్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు నాన్చుడు ధోరణి అవలంబించడంపై రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Monday, May 18, 2015

మోదీ, బాబు ప్రజలను దోచుకుంటున్నారు

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు చమురు కంపెనీలతో కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి యడ్ల రమణమూర్తి ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని కాం గ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమన్నారు. దీని వల్ల ప్రజలపై మరింత భారం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 4 శాతం ట్యాక్స్ విధించడం వల్ల వినియోగదారులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ధరల పెంపును నిరసిస్తూ... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఆయనతో పాటు ఆ పార్టీ నాయకులు యడ్ల ఆదిరాజు, రొంగలి పోతన్న, కందిసాయి జగ్గారావు, కనకల రఘురామ్, తదితరులు పాల్గొన్నారు.

Friday, May 8, 2015

ప్రత్యేక హోదా ఆర్థిక, హోంశాఖ పరిధిలో ఉంది ధర్నాల వల్ల ఏపీకి వచ్చేది ఏమీ లేదు :వెంకయ్య

ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఆర్థిక, హోంశాఖ పరిధిలో ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. శుక్రవారం వెంకయ్య నివాసం ముందు విద్యార్థి జేఏసీ నేలు ఆందోళనకు దిగారు. దీనిపై వెంకయ్య స్పందిస్తూ ధర్నాల వల్ల ప్రచారం తప్ప ఏపీకి వచ్చేదేమీ లేదన్నారు. ప్రత్యేక హోదాపై త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రచారం కోసమే తనను టార్గెట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. తనను విమర్శించే హక్కు ఇతర పార్టీలకు లేదన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా అర్హత లేదని 14వ ఆర్థిక సంఘం చెబుతోందన్నారు. తాను కేంద్రంలో ఉంటే తెలుగు రాష్ర్టాలకు నెలకో ప్రాజెక్టు వస్తుందన్న వెంకయ్య చట్టంలో పేర్కొనని ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయంటే అందుకు తానే కారణమని తెలిపారు. అంతకు ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి జేఏసీ నేతలను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.

మూడో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకూ 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా పలుచోట్ల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల మధ్య ఘర్షణకు కొనసాగాయి. పలు చోట్ల పోలీసుల పహారా నడుమ బస్సులను నడిపించారు. కొన్ని డిపోల్లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు దిష్టిబొమ్మను కార్మికులు దహనం చేశారు. 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చే వరకు సమ్మెను ఆపేది లేదని కార్మిక సంఘాలు నేతలు స్పష్టం చేశారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఏపీ ఎంసెట్‌ పరీక్ష ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 255142 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఎంసెట్‌ పరీక్ష కోసం ఏపీలో 455, హైదరాబాద్‌లో 35 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగనుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు మెడిసిన్‌ పరీక్ష జరుగనుంది. ఆర్టీసీ సమ్మెను సవాల్‌గా తీసుకున్న యంత్రాంగం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాలకు సజావుగా చేరుకున్నారు. అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు.

Tuesday, May 5, 2015

బస్సులు బంద్

ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగా తమకు 43 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. దీంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ను లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని కొంతకాలంగా అడుగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.

అగ్రికల్చర్‌ కళాశాల విద్యార్థుల రక్తదానం

జిల్లాలోని నైరాలో ఉన్న ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చర్‌ కాలేజీలో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు మంగళవారం రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న జిల్లా కలెక్టరు లక్ష్మీనరసింహం, కళాశాల ప్రిన్సిపాల్‌ జోగినాయుడు,వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలన్నారు. ఈ శిబిరంలో 40 మంది కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు.

ప్రపంచ బౌద్ధ క్షేత్రంగా సాగర్‌: కేసీఆర్‌

ప్రపంచంలోని బౌద్ధులంతా నాగార్జునసాగర్‌ వెళ్లిరావాలనుకునే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని, తెలంగాణలో గొప్ప పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ శ్రీపర్వతరామ- బుద్ధవనం అభివృద్ధికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తామని, స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. బుద్ధ జయంతిని పురస్కరించుకొని ఆయన సోమవారం నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. గౌతమ బుద్ధుడి స్మారకం వద్ద విగ్రహం వద్ద పుష్పాలు ఉంచారు. బౌద్ధ స్థూపం ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రాంగణంలో మొక్కలు నాటారు. బుద్ధవనం అభివృద్ధికి యాదాద్రి తరహాలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శ్రీలంక ప్రభుత్వం బహూకరించిన 27 అడుగుల బుద్ధ విగ్రహాన్ని కూడా మంచి స్థానంలో నిలపాలని కేసీఆర్‌ సూచించారు.

ముఖ్యమంత్రి రాక రేపు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 6న జిల్లాకు రానున్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటించనున్న సీఎం,   తోటపల్లి ప్రాజెక్టు పనులకు కూడా పరిశీలిస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హెలికాఫ్టర్‌లో విజయనగరం చేరుకుని, తోటపల్లి ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగునీటిని ఈ ఖరీఫ్ నాటికే ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు  ప్రకటించారు. దీనిపై పలు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా చేయాలని, త్వరలోనే ఈ ప్రాజెక్టుపనులను పరిశీలిస్తానని కూడా చంద్రబాబు ఇటీవలే అన్నారు. 

Wednesday, April 29, 2015

ఒప్పందాలతో ఏపీకి రూ. 35,745 కోట్లు

రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఇండస్ట్రీయల్ మిషన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ....దాదాపు 46 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి రూ.35,745 కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు.

Monday, April 27, 2015

హాస్టళ్ల స్థానే రెసిడెన్షియల్ స్కూళ్లు

 ఎస్టీ,ఎస్టీ విద్యార్థులకు కార్పోరేట్ స్ధాయి ఉన్నత చదువు కోసం ప్రస్తుతం ఉన్న హాస్టళ్లస్థానే రెసిడెన్సియల్ స్కూళ్లను ఏర్పాటుచేసేందుకు పరిశీలిస్తున్నామని రాష్ట్ర గిరిజన,సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఆదివారం రాత్రి చోడవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్టీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులకు ఖర్చుచేస్తామన్నారు. ఏ గ్రామంలోనైనా 40శాతానికి మించి ఎస్టీ,ఎస్టీలు ఉంటే సబ్‌ప్లాన్ నిధులతో అంతర్గతరోడ్లనిర్మాణం,ఇతర అభివృద్ధి పనులకు వందశాతం నిధులు మంజూరుచేస్తామన్నారు. 

విదేశాల్లో చదువుకోసం ఆసక్తి చూపే పేద విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి పథకం ఏర్పాటుచేస్తున్నామని, ఐఏఎస్, ఐపీఎస్ చదువుకోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో ఆర్థికసాయం అందజేస్తామన్నారు. నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 

నేటినుంచి ‘వేసవి బడులు’

 ఒకటి నుంచి ఐదో తగరతి వరకు విద్యనభ్యసిస్తున్న వారిలో వెనకబడిన విద్యార్థులను గుర్తించడం, బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించి విద్యను బోధించే వేసవి ప్రత్యేక తరగతులు సోమవారంతో ప్రారంభంకానున్నాయి.

గత సంవత్సరం నిర్వహించినట్లుగానేమండలంలోని నాలుగు క్లస్టర్లలో నాలుగు కేంద్రాల  ద్వారా ఈ యేడు కూడ వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండలంలోని సీఆర్పీలకు వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి శిక్షణను ఇచ్చారు. సోమవారం నుంచి మే 30 వరకు వేసవి బడులను నిర్వహించనున్నారు. గతేడాది నిర్వహించిన ప్రత్యేక తరగతులకు 50 శాతంలోపు విద్యార్థులు మాత్రమే హాజరుకావడంతో సత్ఫలితాలను పొందలేకపోయారు. 

Sunday, April 26, 2015

చంద్రబాబు దృష్టికి కీలక నేత నిర్వాకం !

జిల్లాలోని టీడీపీ కీలక నేత బాధితులంతా అధినేత చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పదవులిప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ నేరుగా అధినేత దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కీలక నేత బాధితులందర్నీ ఓ మాజీ ఎమ్మెల్యే  ఒకే గొడుగు కిందకి తీసుకొస్తున్నారు. తమకు నామినేటెడ్ పదవులిచ్చినా, ఇవ్వకపోయినా ఆ కీలక నేతకు మాత్రం ఎటువంటి పదవి ఇవ్వొద్దని చంద్రబాబును కోరేందుకు కంకణం కట్టుకుంటున్నారు.

బాబూ.. మాయమాటలు ఇంకెన్నాళ్లు

 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయమాటలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ప్రశ్నించారు. సింగ్‌పూర్ పర్యటనకు వెళ్లి రాష్ట్రాన్ని సింగపూర్‌గా మారుస్తానని, చైనా పర్యటనకు వెళ్లి చైనాలా అభివృద్ధి చేస్తానంటూ చెబుతూ ప్రజలను ముఖ్యమంత్రి మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం బాలరాజు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలన అంతా పర్యటనలకే సరిపోతుందని, కోట్ల రూపాయలు విదేశాల పర్యటనలకే ఖర్చు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అట్టడుగుస్థాయికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
  ఇంటికో ఉద్యోగం అంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతి అంటూ నిలువెల్లా మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కొత్త కొలువుల సంగతి అటుంచి ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నారని బాలరాజు ఆరోపించారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చమని అంగన్‌వాడీలు ధర్నాలు చేస్తుంటే వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. ఆహార భద్రత పథకం అంటూ ఇప్పుడు కొత్తగా బాబు ఆర్భాటం చేస్తున్నారని, కానీ ఇది గత కేంద్రం ప్రభుత్వం హయాంలోనే వచ్చిన పథకమని తెలిపారు.

Saturday, April 25, 2015

బాబు డ్రామాలు ఆడుతున్నారు

విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎంలు శనివారం విశాఖపట్టణంలో ధర్నాలు నిర్వహించాయి. కలెక్టరేట్ వద్ద సీపీఎం... జగదాంబ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలకు దిగాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించాయి. వైఎస్సార్‌సీపీ విశాఖ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ... చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ప్రకటించనందున కేంద్ర సర్కారు నుంచి చంద్రబాబు బయటకు రావాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీ పదేపదే చెప్పాయని వై.విశ్వేశ్వరరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రంలో భాగస్వామ్య పక్షం అయినా.. రాష్ట్రానికి న్యాయం చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే తప్ప... రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు పని చేయటం లేదని వ్యాఖ్యానించారు.

Thursday, April 9, 2015

sekhar bargela's invitation is awaiting your response

 
 
sekhar bargela would like to connect on LinkedIn. How would you like to respond?
sekhar bargela
sekhar bargela
Founder@CEO at Medha Shri IT Innovations
Confirm you know sekhar
You received an invitation to connect. LinkedIn will use your email address to make suggestions to our members in features like People You May Know. Unsubscribe
If you need assistance or have questions, please contact LinkedIn Customer Service.
© 2015, LinkedIn Corporation. 2029 Stierlin Ct. Mountain View, CA 94043, USA

Tuesday, April 7, 2015

ఎన్ కౌంటర్ పై మంత్రులతో చంద్రబాబు భేటీ

చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనపై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పల్లె అచ్చెన్నాయుడు, దేవీనేని ఉమ, నారాయణ హాజరయ్యారు.  అంతకుముందు చంద్రబాబుతో డీజీపీ రాముడు భేటీ అయ్యి ఎన్ కౌంటర్ వివరాలు తెలిపారు. జిల్లాలోని చంద్రగిరి మండలంలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకొని మొత్తం 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయిన విషయం తెలిసిందే. తెల్లవారు జామున ఐదుగంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మీ బాధ్యత నాది.. ప్రజల బాధ్యత మీది

విధి నిర్వహణలో ఒత్తిడి లేని వాతావరణాన్ని తీసుకొస్తానని చంద్రబాబు చెప్పారు. ‘‘మీకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత తీసుకుంటా. అయితే ప్రజలకు సేవలందించే బాధ్యత మీరు తీసుకోండి’’ అని ఉద్యగులను కోరారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అరియర్స్‌లో 15 రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంగీకార పత్రం అందజేశారు.

Sunday, April 5, 2015

I'd like to add you to my professional network on LinkedIn

 
sekhar bargela
sekhar bargela
Founder@CEO at Medha Shri IT Innovations
Hyderabad Area, India
I'd like to add you to my professional network on LinkedIn.
- sekhar
Confirm that you know sekhar
You received an invitation to connect. LinkedIn will use your email address to make suggestions to our members in features like People You May Know. Unsubscribe
Learn why we included this.
If you need assistance or have questions, please contact LinkedIn Customer Service.
© 2015, LinkedIn Corporation. 2029 Stierlin Ct. Mountain View, CA 94043, USA

Saturday, April 4, 2015

బాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని తలనీలాలు సమర్పించాం'

:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ బీసీ సంఘం మండిపడింది. ఆయన ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆ సంఘ అధ్యక్షుడు బి. ఉదయ్ కిరణ్, కార్యదర్శి పుల్లయ్యలు విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వారు.. గత ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని  దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా శ్రీకాళహస్తిలో ఒకరోజు దీక్ష చేశామన్నారు.

ఆయనకు మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుంటూ తిరుమలలో తలనీలాలు కూడా సమర్పించినట్లు స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బీసీలకు సంబంధించి తొమ్మిది ఫెడరేషన్ లకు నిధులు కేటాయించిన సంగతిని వారు గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలను పట్టించుకోవడం లేదన్నారు

Saturday, March 14, 2015

బాబు మారని మనిషి

కనీస వేతనాలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలన్న ప్రధాన డిమాండ్లతో అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. సుమారు ఐదు గంటలపాటు కార్యాలయం ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి ఓబులు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు మారిన మనిషనని చెప్పుకున్నా... ఆయన మారని మనిషే అని ఇప్పుడు నిరూపించుకుంటున్నారని విమర్శించారు.  

'రాజధాని' పేదలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి

రాజధాని ప్రాంతంలోని భూమి లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 5 ఎకరాల అటవీభూమి ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులో డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండినవారికి ఉపాధి చూపేంత వరకు నెలకు రూ. 5 వేల భృతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. అనంతవరంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని మరో తిరుపతిలా అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Friday, March 13, 2015

'చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు'

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పారని అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.  సభ  పదినిమిషాలు వాయిదా అనంతరం వై.విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలపై ఇప్పుడు తుంగలోకి తొక్కారన్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం నిస్సిగ్గుగా మాటమార్చుతోందన్నారు

Wednesday, March 11, 2015

ఎన్నికల హామీల అమలు కోసం దీక్ష

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్ రిలేనిరాహార దీక్ష చేపట్టారు. హామీలతో పాటు అంగన్ వాడీ కార్యకర్తల జీతాలను వెంటనే చెల్లించాలంటూ తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆయన మంగళవారం ఈ దీక్షను ప్రారంభించారు. వరసాల ప్రసాద్ చేపట్టిన రిలే నిరాహారదీక్షకు జిల్లాలోని వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మద్ధతు తెలిపాయి.

జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయి'

చంద్రబాబు నాయుడు పాలనలో  అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు.  బుధవారం అసెంబ్లీ వాయిదా అనంతరం  మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాబు నెరవేర్చలేదన్నారు. సభలో ప్రతిపక్షం నిరుద్యోగ సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు.

బాబు వస్తే జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు.  ఉద్యోగాలు రాకపోగా...దాదాపు 50 వేల మంది ఉన్న ఉద్యోగాలను కోల్పోయారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంతో చర్చకు రాలేకే తమ వాయిదా తీర్మానాలను తిరస్కరించారని విమర్శించారు. ప్రాధాన్యత గల అంశాలను సభలో చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు.

Tuesday, March 10, 2015

చంద్రబాబు మహిళా ద్రోహి: రోజా

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఏరు దాటక ముందు ఏటి మల్లన్న...ఏరుదాటాక ఓటి మల్లన్న' అన్నట్లు ఎన్నికల ముగిసిన తర్వాత డ్వాక్రా మహిళలను చంద్రబాబు రోడ్డున పడేశారని ఆమె అన్నారు.   డ్వాక్రా మహిళలను డబ్బులిచ్చి మరీ సమావేశాలకు తీసుకు వచ్చే చంద్రబాబు అధికారంలోకి వచ్చాకా వారిని విస్మరించారన్నారు.

Monday, March 9, 2015

చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు..

 విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా రాకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అన్యాయం చేస్తున్నారని  డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని కేఎస్‌ఆర్ గార్డెన్‌లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన పరకాల నియోజకవర్గ పట్టభద్రుల సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హా జరైన శ్రీహరి మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్ విషయమై ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలు చంద్రబాబును ఎందు కు అడగడం లేదని ప్రశ్నించారు. ఈ విషయం అడగలేని నేతలు అసెంబ్లీలో రాద్ధాంతం చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. అయితే, టీడీపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ పార్టీని కానీ, చంద్రబాబును కానీ తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు.

Thursday, March 5, 2015

అంతన్నారు.. ఇంతన్నారు

 ‘నా అక్క చెల్లెమ్మలను రుణ విముక్తులను చేస్తా.. అన్ని రంగాలలో వారిని దూసుకుపోయేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తా..’- ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానాల్లో ఒకటి. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాల పనితీరు తిరోగమన దిశలో పయనిస్తోంది. స్వయం సహాయక సంఘాలు అంటేనే రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు సైతం కరువు జిల్లా అనంతపురం వైపు చూశాయి. అంతన్నారు..  ఇంతన్నారు పటిష్టంగా పనిచేస్తున్న డ్వాక్రా సంఘాలను ప్రస్తుత ప్రభుత్వం బ్రష్టు పట్టించింది.

తెలంగాణపై బాబు మొసలి కన్నీరు’

 తెలంగాణ రాష్ట్రంపై, ఇక్కడి రైతులపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ విమర్శించారు. తెలంగాణకు ప్రపంచంలో ఎవరూ చేయని అభివృద్ధిని తానే చేసినట్లు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం  రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ప్రభుత్వ విప్ సునీతా మహేందర్‌రెడ్డి, మరో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లతో క లసి విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం దండగ అన్న పెద్దమనిషి, ఇపుడు రైతుల పట్ల కపట ప్రేమ ఒలకబోస్తున్నాడని కర్నె వ్యాఖ్యానించారు. తెలుగుదేశం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాల వల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందన్నారు. తెలంగాణలో గందరగోళం సృష్టించేందుకు చంద్రబాబు, మంద కృష్ణ మాదిగ చీకటి ఒప్పందాలు చేసుకున్నారా అని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు.

బాబు తెలంగాణ ద్రోహి’

 తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను ఇబ్బందుల పాలు చేయడానికే ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో ఆయన వైఖరి నోటితో మాట్లాడి, నొసటితో వెక్కిరించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రానికి సీఎంను అన్న విషయం మరిచి పోయి, తెలంగాణ విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.

కేంద్రంతో చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్

 విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు పోరాడకుండా.. కేవలం అధికారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్డీఏ ప్రభుత్వంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం అన్యాయం చేసిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చంద్రబాబు.. మరి కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. విభజన తర్వాత ఆరు మాసాలలోపు ఏపీకి అనేక ప్రాజెక్టులు తీసుకువస్తానని చంద్రబాబు తెలుగు ప్రజలకు హామీలు గుప్పించారని, వాటిలో ఏ ఒక్కదానిపై కూడా ఒక్క నిమిషం ఆలోచించడంలేదని దుయ్యబట్టారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికిగల అవకాశాలను పరిశీలిస్తామని ఇచ్చిన హామీ కూడా గాలికి వదిలేశారన్నారు.

Wednesday, March 4, 2015

చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

‘ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాల పుట్ట. ఉత్తుత్తి వాగ్దానాలు చేస్తున్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. అవగాహన రాహిత్యంతో ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. జూలై నాటికి 35 టీఎంసీలు నీరు జీఎన్‌ఎస్‌ఎస్ ద్వారా తెస్తానని ప్రకటించారు. ప్రాజెక్టుల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఆ విషయం తొమ్మిదేళ్ల ఆయన గత పాలన తేటతెల్లం చేస్తోంది. క్షేత్ర స్థాయిలో వాస్తవ విషయాలు తెలుసుకుని జీఎన్‌ఎస్‌ఎస్ పథకానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. సత్వరమే యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులు చేపట్టాల’ని కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో మూడు రోజులుగా నిరవధికనిరహార దీక్ష చేస్తున్న ఆయన మంగళవారం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

ఎందాకైనా పోరాడతా

రాజధాని ప్రాంత రైతులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా
 బలవంతంగా భూములు తీసుకోవడం ముమ్మాటికీ అన్యాయమే
 చంద్రబాబు మోసాలు ఇంకా తగ్గలేదు.. ఈ సర్కారు కూలిపోవడం ఖాయం
 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బాబుకు డిపాజిట్లు దక్కవు
 వినుకొండలో 18 వేల ఎకరాల డీనోటిఫైడ్ భూములున్నాయి.. అక్కడ కట్టుకోవచ్చు కదా!
 సన్న, చిన్నకారు రైతుల పొట్టలు కొట్టడం ఎందుకు?
 మా పార్టీ అధికారంలోకి రాగానే లాక్కున్న భూములను వెనక్కు ఇచ్చేస్తాం

చంద్రబాబు.. ఆ నేతలను ఎంతకు కొన్నారో?

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ కు చంద్రబాబు చేసింది ఏమీలేదని ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. హైదరాబాద్ ను గుడిసెల నగరంగా మార్చింది చంద్రబాబేనని... వ్యవసాయం దండగ అన్న బాబు... ఇప్పుడు వ్యవసాయంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇతర పార్టీ నేతలను టీఆర్ఎస్ కొంటుందని తమపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు ...ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎస్ పీవై రెడ్డి, జూపూడి ప్రభాకర్ లాంటి నేతలను ఎంతకు కొన్నారో చెప్పాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Tuesday, March 3, 2015

ఆత్మహత్యలపై ‘లెక్క’లేనితనం!

వ్యవ‘సాయం’ వెక్కిరించడంతో పురుగు మందు తాగి ప్రాణాలొదిలింది ఒకరు.. ఎండుతున్న పంటలను చూసి గుండెమండి మరణించిందొకరు.. దిగుబడి రాక, అప్పులు తీర్చలేక ఉరితాడుకు వేలాడిందొకరు.. కారణమేదైనా.. సమాజానికి అన్నం పెట్టే రైతన్నల నిండుప్రాణాలు నిలువునా నీరుగారుతున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి (2014 జూన్ 2 నుంచి) ఇప్పటిదాకా మరణించిన రైతులెందరో తెలుసా? టీఆర్‌ఎస్ సర్కారు చెబుతున్నట్లుగా 130 మంది మాత్రం కాదు.. ఆ సంఖ్య 760 వరకూ ఉండొచ్చని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఆత్మహత్యల్ని శాస్త్రీయంగా లెక్కించకపోవడం వల్లే బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలు కకావికలవుతున్నాయి.              

బాబు హయాం నుంచే రైతుల ఆత్మహత్యలు'

 చంద్రబాబు పాలన నుంచే రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యూయని విప్లవ రచయితల సంఘం  (విరసం) రాష్ట్రనేత వరవరరావు అన్నారు. వరంగల్ జిల్లా పరకాల మండలంలోని నాగారంలో ఆత్మహత్యకు చేసుకున్న రైతు వంగ రవి కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. రవి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

బాబూ.. డ్రామాలు ఇక చెల్లవు

‘రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఆడుతున్న డ్రామాలు ఇక చెల్లవు.. బీజేపీతో పొత్తు బాబు పతనానికి నాంది.  వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభంజనంలో ప్రతిపక్షపార్టీలు నామరూపాలు లేకుండాపోతాయి. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వచ్చిన పురందేశ్వరి చిరునామా ఎక్కడో ఎవరికైనా తెలుసా ? అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం పుంగనూరు పట్టణంలో వేలాదిమంది అభిమానులతో పెద్దిరెడ్డి రోడ్‌షో నిర్వహించారు.

చంద్రబాబుది దుర్బుద్ధి: పురందేశ్వరి

 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిది దుర్బుద్ధి అని  కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పి. మాణిక్యాలరావు అధ్యక్షతన ఏర్పాటైన కరువు పరిశీలన బృందం సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కూడలికి చేరుకుంది. ఇక్కడి జనసమూహాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడిన తరువాత పురందేశ్వరి ప్రసంగించారు.

Monday, March 2, 2015

చంద్రబాబు వల్లే రైతు ఆత్మహత్యలు: కడియం

రాష్ట్ర పునర్విభజన బిల్లు 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ ఇవ్వకుండా అడ్డుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు వల్లే రైతులు చనిపోతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా హన్మకొండలో ఆదివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ దిగువ సీలేరులో 54శాతం, కృష్ణపట్నం ప్రాజెక్టు ద్వారా రావాల్సిన విద్యుత్ ఇవ్వనందునే తెలంగాణలో విద్యుత్‌కోతలు ఎక్కువయ్యాయన్నారు.

బాబు మోసపూరిత పాలనపై ఉద్యమం

సీఎం చంద్రబాబు మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైందని కమలాపురం ఎమ్మెల్యేపోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ఆయన ఆదివారం వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరహారదీక్ష చేపట్టారు. ఈ శిబిరంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ,వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబులు మాట్లాడారు.

Saturday, February 28, 2015

చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుందాం: మంద కృష్ణ

 ఎస్సీ వర్గీకరణపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో తాడోపేడో తేల్చేకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో శుక్రవారం జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ముందు వర్గీకరణకు అనుకూలమన్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే వెనుకంజ వేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు మార్చి 3న కరీంనగర్ రానున్నారని, ఆయన ఇక్కడి నుంచి వెళ్లేంత వరకు వణుకు పుట్టించేందుకు మాదిగలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

బెజవాడ నుంచే బాబు కాన్వాయ్

 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలకు కాన్వాయ్‌ను ఇకపై విజయవాడ నుంచే పంపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చే కాన్వాయ్ వాహనాలతో పాటు భద్రత సిబ్బందికి వసతి ఏర్పాట్లు పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో సిద్ధం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి పాలన సాగించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు పర్యటనల నిమిత్తం వెళతారు. అయితే సీఎం కాన్వాయ్ కోసం ఇప్పటి వరకు ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు రవాణా శాఖ ప్రైవేటు వాహనాలను సమకూర్చుతోంది. అయితే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.

మార్చి 3న చంద్రబాబుకు పోటీ సభ

ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెం బ్లీలో ఆమోదించి పెద్ద మాదిగను అవుతానని ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు అలా చేయకుండా మాది గ ద్రోహిగా మిగిలారని ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. హన్మకొండ నయూంనగర్‌లో మాదిగ లాయర్ల ఫెడరేషన్(ఎంఎల్‌ఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 3వ తేదీన కరీంనగర్‌లో నిర్వహించే సభకు రావడానికి ముందే చంద్రబాబునాయుడు వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో ఆయన సభకు పోటీగా తాము సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇక గతంలో మూడు సార్లు ప్రధాన మంత్రిని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్ సైతం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు.

Wednesday, February 25, 2015

నేనున్నా.. ఆత్మహత్య చేసుకోవద్దు

ఎన్నికలకు ముందు ఒక మాట.. ఆతర్వాత మరోమాట చెప్పి రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. బాబులా పచ్చి అబద్ధాలు ఆడే సీఎం.. దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. బాబు చేసిన మోసాలతో కష్టాలు వచ్చిన మాట నిజమే. అయితే నాదో విన్నపం. ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు నేనున్నా.. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తెస్తాం. ధైర్యంగా ఉండండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.

బాబు సర్కారుకు వ్యతిరేకంగా జాతీయస్థాయి ఉద్యమం

ఏపీలో అన్యాయంగా భూములు లాక్కుంటున్న చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. రాజ ధాని పేరిట పంటలు సాగవుతున్న భూముల్ని లాక్కునే కార్యక్రమానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను కలవనున్నామన్నారు. భూ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద అన్నాహజారే చేపట్టిన ధర్నాకు వైఎస్సార్‌సీపీ, ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతుకూలీల పరిరక్షణ వేదిక మద్దతు తెలి పింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

Tuesday, February 24, 2015

హామీలు గాలికొదిలిన చంద్రబాబు

రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు..విదేశీ మోజుతో విమానాలను బాడుగలకు తీసుకుని తిరుగుతున్న దగాకోరుకు రైతుల కష్టాలేం కనబడతాయని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకర్‌నారాయణ విమర్శించారు. మండల కేంద్రంలో సోమవారం జరిగిన డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో శంకర్‌నారాయణ మాట్లాడారు. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ ఇంటర్నెట్‌లో కాగితాలకే పరిమితమైందన్నారు. ఇప్పటి వరకు కొత్తరుణాలు కానీ, రుణమాఫీ చేసిన దాఖలాలు లేవన్నారు.

మాటలేకానీ... చేతలేవి బాబూ

 చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 8 నెలలు గడిచిపోయింది. అధికారం చేపట్టిన తరువాత ఆయన జిల్లాకు రావడం ఇది ఆరోసారి. ఎన్నికల ప్రచారంలో, ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు చంద్రబాబు వందల కొద్దీ హామీలిచ్చారు. అందులో జిల్లాకు సంబంధించినవి 25కు పైగా ఉన్నాయి. కానీ జిల్లాకు సంబంధించి ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. జిల్లాలో అడుగుపెట్టిన ప్రతిసారీ పుట్టిన ఊరికి అన్నీ చేసేస్తానంటూ బాబు మాటలతో జనాన్ని మభ్యపెడుతున్నారు.

బాబు ప్రజలకు ఏమైనా చేశారా?

 సీం చంద్రబాబునాయు డు తన తొమ్మిది నెలల పాలనలో వై ఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పు డు కేసులు పెట్టించడం తప్ప ప్రజలకు ఏమైనా చేశారా? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే నారాయణస్వా మి ప్రశ్నించారు. చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సోమవారం పెనుమూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఎలాగైనా అధికారంలో కి రావాలని ఎన్నో హామీలు, వాగ్దానా లు ప్రజలకు ఇచ్చారని చెప్పారు. వాటి లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయక చేతులు ఎత్తేశారని విమర్శించారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మా ఫీ  పథకాల వల్ల ప్రజలు ఏ మేరకు లబ్ధిపొందారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి బాబూ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉద్యమాలు చేస్తుంటే వారిని భయపెట్టడానికి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని సీఎంగా చంద్రబాబు చ రిత్ర సృష్టిస్తారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నీరు- చె ట్టు కార్యక్రమం టీడీపీ కార్యకర్తలు ఆర్థికంగా సంపాదించుకోవడానికి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నా రు.

Friday, February 20, 2015

బాబూ.. విదేశీ మైండ్‌సెట్ వద్దు

‘ఏపీలో మరో జపాన్‌ను సృష్టిస్తానని, రాష్ట్రాన్ని సింగపూర్‌లా తయారు చేస్తానని చెబుతున్న సీఎం చంద్రబాబు.. విదేశీ మైండ్‌సెట్(ఆలోచన) నుంచి తెలుగు ప్రజల మైండ్‌సెట్‌లోకి రావాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. తెలుగు రాష్ట్రంలో మరో జపాన్‌ను సృష్టించేందుకు అక్కడి కంపెనీలన్నీ సిద్ధమయ్యాయని చంద్రబాబు భజన పత్రికల్లో వచ్చిన వార్తలను అంబటి ఉటంకించారు.

సీమ, ప్రకాశంకు నీరందిస్తా: బాబు

కరువుతో ఇబ్బందులు పడుతున్న రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీఇచ్చారు. పట్టిసీమ వద్ద ఈ నెల 23న ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని, తద్వారా మిగిలే శ్రీశైలం నీటిని రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ఇస్తామని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం గ్రామం పెద్దచెరువులో గురువారం సీఎం నీరు-చెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ నిర్మించిన నీరు-చెట్టు పైలాన్‌ను ప్రారంభించి, చెరువులో పూడికతీత మట్టిని జే సీబీతో ట్రాక్టర్‌లో పోశారు

రైతులను మరచిన బాబు: పెద్దిరెడ్డి

 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల సమస్యలను పక్కనపెట్టి రాజధాని పేరుతో దేశాలు పట్టుకు తిరుగుతున్నారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కావలి ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే డిమాండ్‌తో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్‌రెడ్డి కావలిలో మూడురోజుల నిరాహారదీక్ష చేపట్టారు.

Wednesday, February 18, 2015

చంద్రబాబు ద్రోహానికి పాల్పడుతున్నారు...

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటూ తీవ్ర ద్రోహానికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. భూపాలపల్లి పట్టణంలోని దేవి ఫంక్షన్ హాల్‌లో శనివారం జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ నమోదు తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఉండేందుకు చివరి క్షణం వరకు పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో ఉండి బాబు చక్రం తిప్పేందుకు యత్నించారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలంగా  నిర్ణయం తీసుకోడని భావించే తాను ఆ పార్టీని వీడి కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు వచ్చానన్నారు. స్థానిక టీడీపీ నాయకులు ప్యాకేజీల కోసమే చంద్రబాబు వెంట ఉంటున్నారని ఆరోపించారు.

Thursday, February 5, 2015

కలవరపడుతున్న చంద్రబాబు'

రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే బీజేపీకి ఆగ్రహం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు కలవరపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య బుధవారం హైదరాబాద్ లో ఆరోపించారు. అందుకోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీ సర్కార్ పై బాబు ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. అలాగే కేంద్రంలోని బీజేపీ వల్ల తమ ప్రభుత్వానికి ముప్పు ఉందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారన్నారు.
రాష్ట్రంలోని తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు  రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని చంద్రబాబును దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడాలనేది ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అజెండా అని సి.రామచంద్రయ్య ఈ సందర్బంగా గుర్తు చేశారు.