photo gallery

 

Thursday, June 18, 2015

మంత్రులూ మాటలు కట్టిపెట్టండి'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఓటుకు కోట్ల వ్యవహారంలో మాటలు కట్టిపెట్టి.. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని అమర్ నాథ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

'చంద్రబాబును అన్నందుకే వైఎస్సార్ మరణించారని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. జగన్ పై కేసు పెట్టినందుకే ఎర్రన్నాయుడు చనిపోయారు. మరి దీనికి ఏమంటావ్' అని అమర్ నాథ్ మంత్రి అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Saturday, June 6, 2015

బాబూ.. జాబు ఎక్కడ?

జాబు రావాలంటే బాబు రా వాంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే లేకుండా ఉన్నారని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంజనీ శ్రీనివాస్ విమర్శిం చారు. శుక్రవారం కడప నగరంలోని హ రిత హోటల్‌లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత వి వేకానందుడు, సరస్వతీ చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముఖ్య అతిథిగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంగతే మర్చిపోయారన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీకి నియమ నిబంధనలను వర్తింపచేసి ప్రజలను మోసం చేశారన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని ప్రారంభించకుండా ఎవరికో మేలు చేసేందుకు పట్టిసీమ పథకాన్ని ప్రారంభించారన్నారు.

Thursday, June 4, 2015

రాయలసీమపై 'బాబు' మొసలి కన్నీరు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్సీ గేయానంద్ విమర్శించారు. గురువారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును గేయానంద్ ఎండగట్టారు. రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తన్న చంద్రబాబుకు హంద్రీనీవా ప్రాజెక్టు కనిపించలేదా అని ప్రశ్నించారు.

హంద్రీనీవా ప్రాజెక్లు పూర్తి కావాలంటే రూ.2500 కోట్లు అవసరమైతే.. ప్రభుత్వం కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆరోపించారు. ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు నూతన రాజధానిపై చూపిస్తున్న శ్రద్ధ.. కరువు రైతులపై ఎందుకు చూపలేదో సమాధానం చెప్పాలని గేయానంద్ డిమాండ్ చేశారు.

Tuesday, June 2, 2015

చంద్రబాబును ఏ1 ముద్దాయిగా పెట్టాలి'

రేవంత్ రెడ్డి వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రిలో జ్యోతుల నెహ్రు మాట్లాడారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ 1 ముద్దాయిగా పెట్టాలన్నారు. ఈ వ్వవహారాన్ని అవసరమైతే సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు. 

ఒక్క హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదు

ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. చంద్రబాబు తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 8న టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేయనున్నామని తెలిపారు

ఆంధ్రాకి న్యాయం చేసి తెలంగాణ ఇవ్వమన్నా

రాష్ట్రాన్ని విభజించదలచుకుంటే ఆంధ్రాకి న్యాయం చేసి తెలంగాణ ఇవ్వమని యూపీఏ సర్కార్ కు విజ్ఞప్తి చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు తెలిపారు. తన విజ్ఞప్తిని పక్కన పెట్టి యూపీఏ ప్రభుత్వం ఏక పక్షంగా రాష్ట్రాన్ని విడగొట్టారని ఆయన ఆరోపించారు. మంగళవారం బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు ప్రసంగించారు. ఓట్లు కావాలని.. సీట్లు గెలవాలని సోనియాగాంధీ భావించారు. అందుకోసమే హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. విభజనపై జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసి... ఆ నివేదికను పక్కన పెట్టి మరీ రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. సోనియా గాంధీకి డబ్బుపై మమకారం ఎక్కువని... అందుకే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడి చేయించారని చంద్రబాబు ఆరోపించారు.

Monday, June 1, 2015

రేవంత్ రెడ్డి బయట ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు'

ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి నిరపరాధి అని, ఆయనపై రాజకీయ కుట్ర జరిగిందని భావిస్తున్నామని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు అన్నారు. ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి న్యాయవాదులు సోమవారం సిటీ సివిల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఏసీబీ ఆరోపణలను న్యాయస్థానంలో ఎదుర్కొంటామని తెలిపారు. ఇందుకు సంబంధించి న్యాయమూర్తి... వీడియోలు, ఆడియోలను పరిశీలించాలని పిటిషన్ లో కోరినట్లు చెప్పారు.  ఈ కేసులో రేవంత్ రెడ్డి బయట ఉన్నప్పుడు అరెస్ట్ చేశారని,  ఈఘటనను రాజకీయ కుట్రగానే భావిస్తున్నామని న్యాయవాదులు తెలిపారు.

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డిని ఈరోజు ఉదయం పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఇదేమి మాఫీ బాబూ..?

రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని, ఎవరూ వడ్డీలు కట్టనక్కర్లేదని, ఇంటికి పెద్దకొడుకులా అన్నీ తాను చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. వీటిని నమ్మి టీడీపీకి ఓట్లేసిన గిరిజనం ఇప్పడు బ్యాంకు నుంచి వడ్డీలు కట్టాలంటూ వస్తున్న నోటీసులు చూసి అవాక్కవుతున్నారు. ఇదేమి రుణమాఫీ బాబూ.. అని ప్రశ్నిస్తున్నారు. తాము తీసుకున్న రుణ మొత్తాన్ని పాసుబుక్కులో ఒకలా చూపిన బ్యాంకు అధికారులు నోటీసుల్లో మరోలా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.

 -బొబ్బిలి మండలం కాశిందొరవలస పంచాయతీకి చెందిన నర్రా రామన్నదొర (ఏపీజీవీబీ ఖాతా నంబరు 73005203708) 25-06-2010న 19 వేల రూపాయలు రుణంగా తీసుకున్నారు. పాసుబుక్‌లో ఇదే ఎంటర్ అయింది. అయితే అతను 24 వేల రూపాయలు రుణం తీసుకున్నాడని, దానికి వడ్డీతో సహా (31-03-2014 నాటికి) 34,699 రూపాయలు చెల్లించాలని ఏపీజీవీబీ బొబ్బిలి శాఖ నుంచి నోటీసు వచ్చింది. తనకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 3,371 రూపాయలు మాఫీ అయినట్లు ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందని, ఇంతలోనే వారంలోగా ఈ మొత్తం చెల్లించాలని నోటీసు రావడమేమిటని రామన్నదొర ఆశ్చర్యపోతున్నారు.