photo gallery

 

Wednesday, January 28, 2015

తీర ప్రాంత రక్షణలో వైఫల్యం

‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడితే దుబాయ్, జపాన్, సింగపూర్ దేశాలు తిరుగుతున్నారు. అవన్నీ సముద్ర తీరమున్న దేశాలే. సముద్ర తీరం కోతలకు గురైనప్పుడు ఆ దేశాలు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారో చంద్రబాబు చూడలేదా? ఆయనకు తెలియదా? రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అప్పటికప్పుడు రావడం.. తాత్కాలిక చర్యలతో సరిపుచ్చడమేతప్ప రాష్ట్రప్రభుత్వం శాస్త్రీయ విధానంలో శాశ్వత చర్యలు చేపట్టడం లేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు.

చంద్రబాబు అగ్రిమెంట్ రాసివ్వాలి- భూమా అఖిలప్రియ

నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో అగ్రిమెంట్ చేయాలని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మంగళవారం  ఆమె మాట్లాడుతూ...ప్రాజెక్టు పూర్తి చేయకుంటే తనదే బాధ్యత అని చంద్రబాబు అగ్రిమెంట్లో రాయాలన్నారు. దానితో పాటు అగ్రిమెంట్ కాపీని గవర్నర్ కు సమర్పించాలని తెలిపారు.

ప్రజాధనం దుర్వినియోగం వెనుక మంత్రుల వాటాలెంతో బయటపట్టాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అంజద్ బాషా, నారాయణ స్వామి లు ఈ సందర్భంగా  డిమాండ్ చేశారు.

బ్రాండింగ్ కోసమే దావోస్ పర్యటన:బాబు

రాష్ట్రాభివృద్ధి కోసమే తాను ప్రపంచమంతా తిరుగుతున్నానని, ఈ క్రమంలోనే దావోస్ వెళ్లివచ్చానని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు
స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బ్రాండింగ్ కోసమే తాను ఆ పర్యటన చేపట్టినట్లు బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ పర్యటనలో సాంకేతిక నిపుణులు, తయారీ దిగ్గజాలను కలిశానన్నారు.

వాల్ మార్ట్ ఐదు అంశాల్లో సహకరిస్తామని చెప్పినట్లు బాబు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కల్పిస్తామన్నారు. మార్చిలో శ్రీసిటీలో పెప్సికో యూనిట్ ను ఆరంభిస్తున్నట్లు బాబు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండింగ్: బాబు

ఇబ్బందిగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. అందుకే కొత్తగా కార్యక్రమాలు ఆపేశాం
* ఏపీకి ప్రత్యేక హోదా అవకాశాలు క్షీణించటం వాస్తవమే
* ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై ‘చూద్దాం.. అన్నీ చేస్తాం’ అని సీఎం వ్యాఖ్య

 వాణిజ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు (బ్రాండింగ్) కల్పించడానికి దావోస్‌లో తన పర్యటన దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పర్యటన విశేషాలను మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులకు వివరించారు. పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ వివరాలను ఉత్సాహంగా వెల్లడించిన బాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పీఆర్సీ అమలు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం, ప్రత్యేక హోదా దక్కే అవకాశాలు మందగించడం.. తదితర అంశాలపై నిరుత్సాహంగా స్పందించారు.

Tuesday, January 27, 2015

భ్రమల్లో పెడుతున్న బాబు

చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆదివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

అధికారం చేపట్టిన ఏడెనిమిది నెలల కాలంలో దావోస్, సింగపూర్, జపాన్ దేశాలను పర్యటించిన సీఎం ఆ పర్యటనల కారణంగా రాష్ట్రానికి రప్పించిన విదేశీ పెట్టుబడులేమిటో శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, రూ.254 ఉండాల్సిన యూరియా బస్తాను తెల్లవారుజామున నుంచి క్యూలో నిలబడి రూ.370- 420లకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని న్నారు.

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యేలు

 హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై అనంతపురం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు వై విశ్వేశ్వరరెడ్డి, చంద్ బాషాలు నిప్పులు చెరిగారు. మంగళవారం అనంతపురంలో వై విశ్వేశ్వరరెడ్డి, చంద్ బాషా మాట్లాడుతూ... హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హంద్రీనీవా పూర్తి చేస్తే రాయలసీమలో ఆత్మహత్యలు తగ్గుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తానంటున్న చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు పై ఎందుకు హడావుడి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని వారు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రాజెక్టు వెంటనే పూర్తిచేయాలన్న డిమాండ్ తో జనవరి 28, 29 తేదీల్లో నిరాహారదీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేక హోదా ఇప్పట్లో కష్టమే-బాబు

 ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇప్పట్లో వచ్చేలా లేదని...కేంద్రప్రభుత్వం సంక్షోభంలో ఉన్నందున సహాయం కోసం ఎదురుచూసినా ఫలితం ఉండకపోవచ్చని ఆ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  చెప్పినట్టు సమాచారం. విజయవాడలో సోమవారం అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. దావోస్ పర్యటన, ఏపీ ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చంద్రబాబు మంత్రులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రాజెక్టుల వారీగా ఎక్కువ నిధులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. అన్ని శాఖల మంత్రులు ప్రత్యేక ప్రతిపాదనలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి ప్రైవేటు పెట్టుబడులు ఎక్కువగా వచ్చేలా ప్రయత్నించాలన్నారు.

బ్రాండింగ్ కోసమే దావోస్ పర్యటన:బాబు

రాష్ట్రాభివృద్ధి కోసమే తాను ప్రపంచమంతా తిరుగుతున్నానని, ఈ క్రమంలోనే దావోస్ వెళ్లివచ్చానని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు
స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బ్రాండింగ్ కోసమే తాను ఆ పర్యటన చేపట్టినట్లు బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ పర్యటనలో సాంకేతిక నిపుణులు, తయారీ దిగ్గజాలను కలిశానన్నారు.
 
వాల్ మార్ట్ ఐదు అంశాల్లో సహకరిస్తామని చెప్పినట్లు బాబు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కల్పిస్తామన్నారు. మార్చిలో శ్రీసిటీలో పెప్సికో యూనిట్ ను ఆరంభిస్తున్నట్లు బాబు తెలిపారు.

Monday, January 26, 2015

హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రబాబు

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిసింది. విజయవాడలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌తో కలిసి పాల్గొన్న చంద్రబాబు వేడుకల అనంతరం గవర్నర్‌తో కలిసి హైదరాబాద్‌కు బయలు దేరినట్లు సమాచారం.

Sunday, January 25, 2015

పక్కదారి పట్టించేందుకే బాబుపై ఏడుపు: ఎర్రబెల్లి

 స్వైన్‌ఫ్లూ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాన్నుంచి ప్రజల దృష్టిని పక్కదారిపట్టించేందుకేసాగర్ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి  విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ సమస్యపై  ఏపీ తప్పుందని తేలితే కేంద్రం వద్దకు వెళ్దామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుపై నెపం పెడితే ప్రజలు సహించరన్నారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన తలసాని, తుమ్మలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని మంత్రిపదవులు ఇవ్వడంతో బంగారు తెలంగాణ సాధిస్తారా అని ప్రశ్నించారు.
 

సీఎం నేటి పర్యటన రద్దు

 విశాఖఉత్సవ్-2015 ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావడంలేదు. నగరంలో వేర్వేరు వేదికల్లో ఈనెల 23వ తేదీ నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరు కాగా, ఆదివారం జరుగనున్న ముగింపు ఉత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించారు. విదేశీ పర్యటనలో భాగంగా దావోస్ పర్యటిస్తున్న ఉన్న సీఎం శని వారం ఉదయం హైదరాబాద్ చేరుకో నున్నారు. మధ్యాహ్నంనేరుగా నగరానికి చేరుకుని విశాఖ ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంది. చివరి నిముషంలో సీఎం పర్యటన రద్దయినట్టుగా జిల్లా కలెక్టరేట్‌కు సమాచారం అందింది. ఈ విషయాన్ని కలెక్టరేట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆదివారం జరుగనున్న ముగింపు ఉత్సవాలు సాదాసీదాగానే జరిగే అవకాశాలు కన్పిస్తు న్నాయి.

Saturday, January 24, 2015

బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే బాబు విదేశీ యాత్రలు

బాధ్యతల నుంచి తప్పించుకుని తిరిగేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరుచూ విదేశీ యాత్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. చంద్రబాబు  ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు దీనిని సహించరని స్పష్టం చేశారు. గురువారం వైఎస్సార్ సీపీ రాజవొమ్మంగి మండల కన్వినర్ సింగిరెడ్డి రామకృష్ణ ఇంట జడ్డంగిలో జరిగిన వివాహ వేడుకకు వచ్చిన నెహ్రూ తిరిగి వెళుతూ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. ప్రతిపక్షంపై దాడులకు పూనుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయించడం సరికాదన్నారు.

బాబు వ్యాఖ్యలపై ఆగ్రహం

  ప్రభుత్వాధినేత స్థానంలో ఉండి మూఢ విశ్వాసాలను పెంపొందిం చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీతిమాలిన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వివిధ రాజకీయ, సామాజిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం జిల్లాలో పాదయాత్ర చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోని చాగల్లులో ఎన్టీఆర్ విగ్రహాన్ని మొక్కి ప్రజలు తాము అనుకున్న కార్యాలు సాధించుకోవచ్చని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

చంద్రబాబు దళిత ద్రోహి'

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎస్సీ,ఎస్టీలకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. రాజ్యాంగబద్దంగా దళితులకు రావలసిన వాటా ఎందుకు ఖర్చు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుని ఖచ్చితంగా బోనులో నిలబెట్టాలని అన్నారు.

ఎస్సీ,ఎస్టీల సంక్షేమానికి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గుర్తులేదా? అని అడిగారు. ఇది దళితులను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. దళితుల హక్కులు ఎందుకు కాలరాస్తురని నాగార్జున అడిగారు.

బాబు జమానాలో దళితులకు దగా

రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దళితులను దగా చేస్తోందని, ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ‘ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు’ అనే అంశంపై శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో చర్చా వేదికను నిర్వహించారు. ఈ వేదికకు అధ్యక్షత వహించిన నాగార్జున..మాట్లాడుతూ సీఎంగా బాబు 7 నెలల పాలనాకాలంలో దళితులను నిర్లక్ష్యం చేశారన్నారు.

Friday, January 23, 2015

‘చంద్రబాబును తెలంగాణలో తిరగనీయం’

తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను గాలికి వదిలేసి, తెలంగాణ పర్యటనకు వస్తాననడం ఏమిటని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఇక్కడ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మా సీఎంకు తెలుసు. ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి’ అని ఆయన హితవుపలికారు. తెలంగాణ భవ న్‌లో మంత్రి మంగళవారం ఎమ్మెల్యేలు సంజీవరావు, కాలే యాదయ్యలతో కలసి విలేకరులతో మాట్లాడారు.

బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే బాబు విదేశీ యాత్రలు

 బాధ్యతల నుంచి తప్పించుకుని తిరిగేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరుచూ విదేశీ యాత్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. చంద్రబాబు  ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు దీనిని సహించరని స్పష్టం చేశారు. గురువారం వైఎస్సార్ సీపీ రాజవొమ్మంగి మండల కన్వినర్ సింగిరెడ్డి రామకృష్ణ ఇంట జడ్డంగిలో జరిగిన వివాహ వేడుకకు వచ్చిన నెహ్రూ తిరిగి వెళుతూ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. ప్రతిపక్షంపై దాడులకు పూనుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయించడం సరికాదన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జీతాలివ్వలేని పరిస్థితి: చంద్రబాబు

 రాష్ట్రంలో రానురాను జనాభా తగ్గుతోందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఏటా 9 లక్షల జనన మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు. పుట్టేవారి సంఖ్య తగ్గుతోందని, వృద్ధుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇంటికి ఒకరిద్దరు పిల్లలున్నా తప్పులేదన్నారు. 15 ఏళ్ల క్రితం తాను ఒక బిడ్డనే కనమని చెప్పానని..ఇప్పుడు అలా చెప్పే పరిస్థితి లేదన్నారు. 
 తాము అధికారంలోకి రాకముందు 80 యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే ఒక్కో యూనిట్ కు రూ. 6 చొప్పున కొనుగోలు చేసి రెండు నెలల్లోనే ఆ సమస్యను అధిగమించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జీతాలిచ్చే పరిస్థితి లేదని అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరామన్నారు. గత యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన హేతుబద్ధంగా చేయకపోవడం వల్లే ఎన్నికల్లో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగిలిందని ఎద్దేవా చేశారు.

ఎమ్మెస్‌ మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం

 అనారోగ్యంతో కన్నుమూసిన ఎమ్మెస్‌ నారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.

Wednesday, January 21, 2015

బాబు ఎన్టీఆర్‌ను పొగిడితే అసహ్యించుకుంటారు

దివంగత ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించివేసి ఆయన మరణానికి కారకుడైన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగిడితే ప్రజలు అసహ్యించుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరి గౌతంరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు.

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన్ని అనేక ఇబ్బందులకు గురిచేసిన చంద్రబాబు ఇప్పుడు ఊసరవెల్లిగా మారి ఆయన్ని కీర్తించటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

40 లక్షల టన్నుల ధాన్యం కొందాం

ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్‌ రైతుల సమస్యలపై మంత్రులతో సమీక్షించారు. రైతుల నుంచి 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు పలువురు ఎమ్మెల్యేలతో నారా లోకేశ్‌ టీడీపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యారు.

Sunday, January 11, 2015

నాలుగు జిల్లాల కోసమే బాబు తపన

చిత్తూరు జిల్లాలోని చెన్నారాయునిపల్లెలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధానిపై ఉత్తరాంధ్ర, సీమ ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మిగతా జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తామన్న ఆయన.. దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ఎమ్మెల్యేలకూ ‘చంద్రన్న కానుక’ తలా 3 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార టీడీపీ ఎమ్మెల్యేలకు సంక్రాంతి మూడు రోజుల ముందే వచ్చింది! సంబరాలను మోసుకొచ్చింది! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు కూడా ‘చంద్రన్న కానుక’ను ప్రకటించారు! నియోజకవర్గాల అభివృద్ధి నిమిత్తం ఒక్కొక్కరికి రూ.3 కోట్ల వరకూ నిధులు కేటాయించాలని నిర్ణయించారు.

Saturday, January 10, 2015

ఇది అవకాశాల కేంద్రం: చంద్రబాబు

 సూర్యోదయ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గం, అవకాశాలకు కేంద్రమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రవాస భారతీయులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో శుక్రవారం ప్రవాస భారతీయ సమ్మేళనంలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్‌సింగ్‌సహా పలువురు కేంద్ర మంత్రులతోపాటు తొమ్మిది రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమక్షంలో ఏపీలో గల వనరులు, పెట్టుబడి అవకాశాలపై సీఎం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు

అభివృద్ధికి అడ్డుపడుతున్న బాబు

 తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా కుట్రలు పన్నిన బాబు అవి ఫలించకపోవడంతో ఇపుడు అభివృద్ధికి మోకాలొడ్డుతున్నారని దుయ్యబట్టారు. అరవై ఏళ్లలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలను, కేవలం ఏడు నెలల వయస్సున్న ప్రభుత్వం పరిష్కరించే దిశలో పయనిస్తోందని వారు పేర్కొన్నారు.

'రుణమాఫీ హామీ వల్లే బాబుకు అధికారం'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ అనే అబద్ధంతోనే  బాబు అధికారాన్నిచేజిక్కించుకున్నారని జగన్ విమర్శించారు.  శుక్రవారం ఆళ్లగడ్డ,  నంద్యాల వైఎస్సార్ సీపీ శ్రేణులను ఉద్దేశించిన మాట్లాడిన ఆయన..  గతంలో చేసిన పొరపాట్లను వైఎస్సార్ సీపీ శ్రేణులు సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని జగన్ సూచించారు. ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత  వైఎస్సార్ సీపీ పై ఉందని జగన్ తెలిపారు.

ఆరు నెలల్లోనే బాబు పాలనపై వ్యతిరేకత

 చంద్రబాబు పాలన మాకొద్దు బాబోయ్.. అంటూ ప్రజలు విసుగెత్తిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఒక ప్రభుత్వానికి కేవలం ఆరు నెలల కాలంలోనే ఇంతటి వ్యతిరేకత బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ ప్రజాసమస్యలపై కలసి పోరాడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కర్నూలులోని మెగాసిరి ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు.

చంద్రబాబు ఎన్నికల ముందు ఏం చెప్పారు?

ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపు వాగ్దానాలకు, అబద్దాలకు విసుగెత్తి ప్రజలందరూ తమ తరపున పోరాటం చేయాలని కోరుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  ఆయన శనివారం కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నేతలతో  రెండోరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...ఎన్నికల ముందు ఏం చెప్పారు?... ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారన్నది చంద్రబాబు తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని సూచించారు. అందుకే బాబు రోజుకో అబద్దం చెబుతున్నారని, ఆయన నిజం చెప్పిననాడు.. జనం ఆయన్ని రాళ్లతో కొడతారని వైఎస్ జగన్ అన్నారు.

చంద్రన్నా.. ఇదేందన్నా

 సంక్రాంతికి చంద్రన్న కానుకగా చెత్త సరుకులు ప్యాకింగ్ చేస్తున్నారు. శెనగల్లో రాళ్లు, చెత్తతో నిండి ఉన్నాయి. వాటిని ఏమాత్రం శుభ్రం చేయకుండా అలాగే ప్యాకెట్లలో నింపుతున్నారు. పుంగనూరు గోడౌన్‌లో ఆ దృశ్యాలు కనిపించాయి. సంక్రాంతి కానుకగా బెల్లం, నూనే, శెనగలు, గోధుమపిండి, నెయ్యి ప్యాకెట్‌లను చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం గిఫ్ట్‌ప్యాక్ రూపంలో అందించేందుకు  రంగం సిద్ధం చేసింది.

ఈనెల 13న రాష్ట్రంలో చంద్రబాబు సుడిగాలి పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 13న ఏపీలోని మూడు ప్రధాన నగరాల్లో పర్యటించారు. 13న ఉదయం విశాఖపట్నం, మధ్యాహ్నం విజయవాడ, సాయంత్రం తిరుపతిలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విజయవాడలో సింగపూర్‌మంత్రి, పారిశ్రామికవేత్తలతో బాబు భేటీ కానున్నారు.

చంద్రబాబుతో కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్‌ శనివారం ఉదయం సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన రాయతీలపై వీరు మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Friday, January 9, 2015

మంత్రిగారిపై పార్టీ ఎమ్మెల్యే ఫైర్

శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య ఏర్పడిన వైరం తారస్థాయికి చేరింది.  దాంతో ఆ పంచాయతీ కాస్తా పార్టీ అధ్యక్షుడి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. జిల్లాకు చెందిన మంత్రి కె.అచ్చెన్నాయుడు వైఖరీపై అదే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు పార్టీ అధ్యక్షడుకి ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తనను ఆహ్వానించకుండా మంత్రి పర్యటిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాను మాట్లాడతానని కళా వెంకటరావుకు బాబు హమీ ఇచ్చారని సమాచారం.

గుజరాత్‌ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం గుజరాత్‌ చేరుకున్నారు. గాంధీనగర్‌లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్‌ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా 10 మంది ముఖ్యమంత్రులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఏపీలో వనరులు, పెట్టుబడుల అవకాశాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ఇవ్వనున్నారు.

చంద్రబాబుకు కొత్త కాన్వాయ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారులు కొత్త కాన్వాయ్‌ ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి కోసం ఇంటెలిజెన్స్‌ పోలీసులు నాలుగు ఫార్చూనర్‌ కార్లను కొనుగోలు చేశారు. అయితే రాష్ట్ర విభజనతో రెండు తెలంగాణకు, మరో రెండు ఏపీకి కేటాయించారు. వీటికి మరో నాలుగు అదనంగా కొనుగోలు చేసిన ఏపీ పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కొత్తకాన్వాయ్‌ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకూ వాడిన పాత కాన్వాయ్‌ను విజయవాడకు తరలించే ఆలోచన చేస్తున్నారు.

చంద్రన్న సంక్రాంతి కానుక అరకొరే!

చంద్రన్న సంక్రాంతి కానుకకు గ్రహణం పట్టింది. సంక్రాంతి పండుగకు పేదలకు అందిస్తామని చెప్పిన ఆరు రకాల సరుకుల్లో ఇప్పటివరకు జిల్లాకు అందింది సగం మాత్రమే. ఇందులో గోధుమపిండి అందే ప్రశ్నే లేదు. చంద్రన్న కానుక అంటూ ఫోటోలు ముద్రించి అటు ప్రచారానికి వాడుకోవాలని తలపెట్టిన క్యారీ బ్యాగులు ఇంతవరకు జిల్లాకు చేరలేదు.

చంద్రబాబు ప్రభుత్వం బోర్డు తిప్పేసింది

 చంద్రబాబు  ప్రభుత్వం నెల రోజులకే సమస్యలు పరిష్కరించకుండా బోర్డు తిప్పేసిందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి  హేళన చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహిస్తున్న మండల పర్యటనకు గురువారం జిల్లాలోని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునీల్, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చౌడేపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ రాష్ర్టంలో ప్రజ లను మోసగించి, ప్రజాభిమానం కోల్పోయిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నీతి నిజాయితీ ఉంటే తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి రైతులు, ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Thursday, January 8, 2015

బాబుపై ఉక్రోషంతోనే పురందేశ్వరి

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ సమష్టిగా అభివృద్ధి పథంవైపు పయనిస్తుంటే.. ఈ పార్టీల సత్సం బంధాలను దెబ్బతీసేలా దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. సీఎం చంద్రబాబుపై ఉన్న ఉక్రోషంతో ఆమె దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు

Wednesday, January 7, 2015

ప్రజల కష్టాలు తీరాలి - ముఖ్యమంత్రి చంద్రబాబు

నూతన రాష్ర్టానికి తొలి బడ్జెట్‌ రూపొందింస్తున్నాం. హామీలు నిలుపుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. మనం చేసే పనుల వల్ల ప్రజల కష్టాలు తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

అనంతపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి

అనంతపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాదంపై మంత్రులు శిద్ధా రాఘవరావు, పరిటాల సునీత, పల్లెరఘునాథ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు

3 కేఆర్ రుణాలు మాఫీ అయ్యేనా?

 చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే త్రీ కేఆర్ రుణాలన్నీ మాఫీ చేస్తారని ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రతిపక్ష హోదాలో ఆయన కుప్పంలో పర్యటించిన సందర్భంగా అధికారంలోకి రాగానే త్రీ కేఆర్ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పు డు రుణమాఫీ జాబితాలో రైతుల పేర్లు లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. 13 ఏళ్లుగా త్రీ కేఆర్‌లో తీసుకు న్న రుణాలు చెల్లించలేక, బ్యాంకర్ల వేధింపులు భరించలేక నానా అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు వుుఖ్యవుంత్రిగా ఉన్నప్పుడు 1998లో కుప్పంలో ఇజ్రారుుల్ సేద్యాన్ని ప్రారంభించారు. 

చినబాబు దయ ఉంటేనే..

పైరవీకారులకే పెద్దపీట!
సీనియారిటీ, పార్టీ సేవకు మొండిచేయి
నామినేటెడ్ పోస్టుల భర్తీ తతంగం ఇదీ
ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు


 నామినేటెడ్ పదవుల పందేరం పెత్తనం చినబాబు చేతిలో పడింది. పదవులపై ఆశలు పెట్టుకున్న టీడీపీ తమ్ముళ్ల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. సీఎం చంద్రబాబు నామినేటెడ్ పదవుల భర్తీకి తెరతీడయంతో జిల్లాలో టీడీపీ నేతలు భారీ ఆశలు  పెట్టుకున్నారు. కానీ పదవులకు నేతలను ఎంపిక చేసే బాధ్యతను సీఎం చంద్రబాబు తన తనయుడు లోకేష్‌కు అప్పగించారు. పార్టీలో సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలు, ఎన్నికల్లో టిక్కెట్ల రేసులో వెనక్కితగ్గడం తదితర అంశాల ప్రాతిపదికగా పదవుల భర్తీ జరుగుతుందని ఆశించిన నేతలు తాజా పరిణామంతో హతాశులయ్యారు.

Tuesday, January 6, 2015

బాబు అధికారం రెండేళ్లే

జోస్యులూ అదే చెబుతున్నారు
తర్వాత రాష్ట్రానికి నేనే సీఎం
రాజధాని రైతుల బాధ వింటుంటే
గుండె తరుక్కుపోతోంది: జగన్‌
 జ్యోతిష్కులు కూడా అదే చెబుతున్నారు
 తర్వాత రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి
 రాజధాని రైతుల బాధలు వింటుంటే
నా గుండె తరుక్కుపోతోంది
 మంగళగిరి, తాడేపల్లి రైతులతో జగన్‌

 ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ కాలం, తాను ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించే అవకాశాలపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారం ఉందని చెప్పి తన ఇష్టం వచ్చినట్లు చెయ్యొచ్చు. కానీ ఈ అధికారం ఉండేది రెండు సంవత్సరాలే. జ్యోతిష్కులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఒకవేళ దేవుడు అనుకూలిస్తే నాలుగేళ్లు ఉండొచ్చు. ఏం చేసినా ఆ అధికారం పోయేలోపే. నేను హామీ ఇస్తున్నా.. ప్రతీ రైతుక్కూడా చెబుతున్నా.. మీకందరికీ అంగీకారమైతేనే భూములు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే చంద్రబాబు కాదుగదా.. వాళ్ల నాయనా వచ్చినా కూడా తీసుకోలేడు’’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబుతోఆర్కే ధవన్‌ భేటి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో నేవీ చీఫ్‌ ఆర్కే ధవన్‌ భేటి అయ్యారు.

ముఖ్యమంత్రిని ఓడించిన ధీశాలి గల్లా

 సభ్యత్వ నమోదు చేయడంలో టీడీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఓడించిన ధీశాలి గల్లా అరుణకుమారి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనియాడారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో చంద్రగిరి సభ్యత్వ నమోదు సంబరాలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే గర్వించే నాయకురాలు గల్లా అరుణకుమారి అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు సంబరాలు చూస్తుంటే సంక్రాంతి ముందుగానే వచ్చినట్లుందన్నారు. ఓడిన చోటే మళ్లీ విజయాన్ని వెతికేందుకు కృషి చేస్తున్న కెరటమని గల్లా అరుణకుమారిని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అభినందించారు.

Monday, January 5, 2015

బాబు నిర్వాకం.. రైతుకు శాపం

ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ చేస్తామంటూ రైతుల్లో ఆశలు కల్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల నిబంధనలు, మెలికలతో అన్నదాతను ముప్పు తిప్ప లు పెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికీ అరకొరగానే రుణాలు మాఫీ చేసింది. చంద్రబాబు నిర్వాకం ఫలితంగా ఇప్పుడు రైతులకు కొత్త రుణాలు కూడా రాకుండా పోతున్నాయి.

సర్కారు ఇప్పటికీ రుణాల మాఫీ సవ్యంగా చేయకపోవడంతో బ్యాంకులు రైతులకు కొత్తగా అప్పులు ఇవ్వడంలేదు. ఖరీఫ్ ముగిసిపోయి రబీ సీజన్ వచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. 

ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు

 చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు దగాకు గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌లను గుర్తించి స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) పేరుతో క్యూబిక్ మీటరు రూ.620 ప్రకారం అమ్మకాలు  చేస్తుండంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలపై పెనుభారం పడుతోందన్నారు.

పోలవరం ఎత్తు పెంచడానికి బాబు కుట్ర

 పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచడానికి ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ కేంద్ర జలసంఘం, గోదావరి నదీ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే పోలవరం ఎత్తును పెంచడానికి ఏపీ ప్రభుత్వం జీఓను విడుదల చేసిందన్నారు. పోలవరం ఎత్తు పెంచడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, ఎత్తు పెంచకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

Sunday, January 4, 2015

ఐఐఎం శంకుస్థాపన వాయిదా సీఎం, కేంద్రమంత్రి

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 5న ఆనందపురం మండలం గంభీరంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరు కావలసి వుంది. అదేరోజున ఏయూలో ఐఐఎం తరగతుల కోసం ఎంపిక చేసిన ఆంధ్రాబ్యాంక్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ భవనాన్ని కేంద్రమంత్రి స్మృతీఇరానీ పరిశీలించాల్సి వుంది. పలు కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడంతో సీఎం తన పర్యటనను వాయుదా వేసుకున్నారు.

ఆ ‘బాబు’.. నిండా ముంచాడు

‘‘నేను 80 వేల రూపాయల తీసుకుంటే వడ్డీ రూ. 13,721 అయింది. నాకున్న వేల రూపాయలు మాఫీ అవుతాయని చంద్రబాబుకు ఓటు వేసాను.. ఇప్పుడు మాఫీ అయ్యింది కేవలం రూ. 3,505 మాత్రమే. బాబు మమ్మల్ని నట్టేట ముంచేసాడు.. ఈ కాగితాలు పట్టుకొని ఎన్ని సార్లు బ్యాంకులు చుట్టూ, అధికారులు చుట్టూ తిరుగుతున్నానో దేవుడికే తెలుసు.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు సరికదా అడిగితే గసిరేసి పొమ్మంటున్నారు... ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం నారాయణప్పవలసకు చెందిన రైతు గేదెల సూర్యనారాయణ ఆవేదన ఇది. ‘‘కౌలు రైతు అర్హత కార్డుతో రూ. 20 వేలు పంట రుణం, రూ. 1.35 లక్షలు బంగారు రుణం తీసుకున్నాను. రుణ మాఫీకి అవసరమయ్మే ఆధార్, గుర్తింపుకార్డులు ఇచ్చాను.
 

Saturday, January 3, 2015

తత్కాల్‌ రాజధాని!

నవ్యాంధ్రలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి! జూన్‌ నాటికి నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచే పాలన సాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఒక్కరోజులోనే ఆ దిశగా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే జూన్‌ నాటికి ప్రభుత్వ కార్యాలయాలను కొత్త రాజధానికి తరలించడానికి సన్నాహాలు ప్రారంభించింది

అబద్దాలు బాబుకు వెన్నతో పెట్టిన విద్య

 అసత్య ప్రచారాలు చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని శాసనమండలి విపక్షనేత సీ.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం కడప ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం అపద్దాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడన్నారు. ఆ రోజుల్లో టీడీపీ రాష్ట్ర విభజనకు మద్దతుగా లేఖ ఇవ్వడం వల్లనే విభజన అయిందని, దీన్ని ప్రజలలో అపోహ సృష్టించి ఏడు నెలలు గడచినా ఇంకా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం తగదన్నారు.

Friday, January 2, 2015

బరి తప్పిన బాబు

జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కచ్చితంగా పందెం కోడిని ఎత్తించాలన్న టీడీపీ నేతల వ్యూహాలు బెడిసికొట్టాయి. జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం ఎదుట కోడి పందాల పంచాయితీ పెట్టి, సంక్రాంతి నాలుగు రోజుల వరకైనా అనధికారిక అనుమతులు సాధించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు

బాబు చేతిలోనే ఉప ముఖ్యమంత్రి పదవి

పేరుకు బీసీలకు డెప్యూటీ సీఎం పదవి ఇచ్చారని,  ఆ హోదా గౌరవాన్ని మంత్రి కేఈ కృష్ణమూర్తికి సీఎం నారా చంద్రబాబునాయుడు ఇవ్వలేదని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ ఆరోపించారు. బుధవారం ఆయన సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో బీసీలకు డెప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామన్నారు.   డెప్యూటీ సీఎం పదవిని కేఈ కృష్ణమూర్తికి ఇచ్చారే కానీ అధికారాలను బాబు తన చేతుల్లో ఉంచుకున్నారన్నారు.

చంద్రబాబునాయుడు ఆరు నెలల పాలనలో అనేకసార్లు విదేశీ పర్యటన చేసి కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారన్నారు. విదేశీ పర్యటన ఖర్చులు, కొత్త వాహనాలు, గృహ వాస్తు పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఆయన ఖర్చులతో డ్వాక్రా మహిళల రుణాలు కొంతలోకొంత మాఫీ అయ్యేవన్నారు.  ఎలాంటి షరతులు విధించకుండా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చిచ్చు పెడితే.. ఖబడ్దార్‌!

ప్రశాంతమైన వాతావరణానకిఇ తుళ్లూరు మారుపేరని, ఇక్కడ చిచ్చు పెట్టాలని చూస్తే ‘ఖబడ్దార్‌ జాగ్రత్త’ అం టూ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని ప్రాం తంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉం చుకుని.. ‘‘మీ ఆటలు సాగవు.. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను’’ అని హెచ్చరించారు. రాజధానిని ఇక్కడ కట్టుకోవటం ఒక అవకాశమ ని, ప్రజలలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పారు.

6 నెలల్లో తరలింపు

జూన్‌, జూలై నాటికి అక్కడి నుంచే పాలన
ప్రధాన కార్యాలయాలను తరలిస్తాం: బాబు

 భూమి ఇచ్చిన జోన్‌లోనే అభివృద్ధి చేసిన భూమి
 రాజధాని నగరాన్ని మరో సింగపూర్‌ చేస్తా
 నవ్యాంధ్ర రాజధానిలో బాబు స్పష్టీకరణ

‘‘రాజధాని నిర్మాణం ఇక్కడ, ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉంటే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అందుకే జూన్‌, జూలై నెలల్లో ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఈ ప్రాంతానికి తరలిస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు

పోలవరం ఎత్తు పెంచుదాం!

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచే అవకాశం ఉందేమో పరిశీలించాలని అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రాజెక్టును ఇప్పటికే నిర్దేశించిన 150 అడుగుల నుంచి మరో 15 అడుగుల ఎత్తు పెంచితే నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని, ఆ దిశగా కూడా ఆలోచన చేయాలని సూచించారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు వద్ద మరో జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించుకునేలా ఆలోచన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. 

Thursday, January 1, 2015

చంద్రబాబు ఒప్పుకుంటే టీడీపీలో చేరతా..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి  అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ తెలుగుదేశం తన సొంత పార్టీ అని, అవసరం అయితే రాయలసీమ అభివృద్ధి కోసం టీడీపీ చేరతానని తెలిపారు. రాయలసీమను అభివృద్ధి చేయలని చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీని కోరతానని బైరెడ్డి చెప్పారు. చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని ఆయన తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

 నగరంలోని ఇరిగేషన్‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేట్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు.

ఆంధ్రకు 2014 భయంకర సంవత్సరం

విజయవంతంగా ఆరు నెలల పాలనను పూర్తి చేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఉదయం నగరంలోని ఇరిగేషన్‌ కార్యాయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కొత్త సంవత్సరం సందర్భంగా పోలవరంలోనూ, పగో జిల్లాల్లోనూ పర్యటించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

బాబుకు వెండి కిరీటం బహూకరించిన రైతులు

ఏపీ రాజధాని ప్రాంతం తుళ్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం పర్యటించారు. రాజధాని ప్రకటన తర్వాత తొలి పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబుకు తుళ్లూరు రైతులు వెండికిరీటాన్ని బహూకరించారు. అనంతరం గ్రామస్థుల మధ్య సీఎం చంద్రబాబు న్యూఇయర్‌ వేడుకలను జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.