జిల్లాలోని టీడీపీ కీలక నేత బాధితులంతా అధినేత చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పదవులిప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ నేరుగా అధినేత దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కీలక నేత బాధితులందర్నీ ఓ మాజీ ఎమ్మెల్యే ఒకే గొడుగు కిందకి తీసుకొస్తున్నారు. తమకు నామినేటెడ్ పదవులిచ్చినా, ఇవ్వకపోయినా ఆ కీలక నేతకు మాత్రం ఎటువంటి పదవి ఇవ్వొద్దని చంద్రబాబును కోరేందుకు కంకణం కట్టుకుంటున్నారు.
No comments:
Post a Comment