రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని, ఎవరూ వడ్డీలు కట్టనక్కర్లేదని,
ఇంటికి పెద్దకొడుకులా అన్నీ తాను చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు
ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. వీటిని నమ్మి టీడీపీకి ఓట్లేసిన గిరిజనం
ఇప్పడు బ్యాంకు నుంచి వడ్డీలు కట్టాలంటూ వస్తున్న నోటీసులు చూసి
అవాక్కవుతున్నారు. ఇదేమి రుణమాఫీ బాబూ.. అని ప్రశ్నిస్తున్నారు. తాము
తీసుకున్న రుణ మొత్తాన్ని పాసుబుక్కులో ఒకలా చూపిన బ్యాంకు అధికారులు
నోటీసుల్లో మరోలా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా
ఉన్నాయి.
-బొబ్బిలి మండలం కాశిందొరవలస పంచాయతీకి చెందిన నర్రా రామన్నదొర (ఏపీజీవీబీ ఖాతా నంబరు 73005203708) 25-06-2010న 19 వేల రూపాయలు రుణంగా తీసుకున్నారు. పాసుబుక్‌లో ఇదే ఎంటర్ అయింది. అయితే అతను 24 వేల రూపాయలు రుణం తీసుకున్నాడని, దానికి వడ్డీతో సహా (31-03-2014 నాటికి) 34,699 రూపాయలు చెల్లించాలని ఏపీజీవీబీ బొబ్బిలి శాఖ నుంచి నోటీసు వచ్చింది. తనకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 3,371 రూపాయలు మాఫీ అయినట్లు ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందని, ఇంతలోనే వారంలోగా ఈ మొత్తం చెల్లించాలని నోటీసు రావడమేమిటని రామన్నదొర ఆశ్చర్యపోతున్నారు.

No comments:
Post a Comment