తెలుగుదేశం పార్టీని చూసి టీఆర్ఎస్ భయపడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ సమీపంలో గండిపేటలో జరుగుతున్న
మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన చంద్రబాబు
ప్రమాణం స్వీకారం చేశారు. 2019లో తెలంగాణలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని
చెప్పారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మీ గుండెల్లో నిద్రపోతానని
చంద్రబాబు సవాల్ విసిరారు. నీతి నిజాయితీగా రాజకీయాలు చేయాలని, కుట్రలు,
కుతంత్రాలతో కాదని అన్నారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటానని
హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ భూముల విక్రయం సరికాదని చంద్రబాబు
అన్నారు.
No comments:
Post a Comment