photo gallery

 

Thursday, March 5, 2015

కేంద్రంతో చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్

 విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు పోరాడకుండా.. కేవలం అధికారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్డీఏ ప్రభుత్వంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం అన్యాయం చేసిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చంద్రబాబు.. మరి కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. విభజన తర్వాత ఆరు మాసాలలోపు ఏపీకి అనేక ప్రాజెక్టులు తీసుకువస్తానని చంద్రబాబు తెలుగు ప్రజలకు హామీలు గుప్పించారని, వాటిలో ఏ ఒక్కదానిపై కూడా ఒక్క నిమిషం ఆలోచించడంలేదని దుయ్యబట్టారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికిగల అవకాశాలను పరిశీలిస్తామని ఇచ్చిన హామీ కూడా గాలికి వదిలేశారన్నారు.

No comments:

Post a Comment