photo gallery

 

Monday, March 9, 2015

చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు..

 విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా రాకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అన్యాయం చేస్తున్నారని  డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని కేఎస్‌ఆర్ గార్డెన్‌లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన పరకాల నియోజకవర్గ పట్టభద్రుల సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హా జరైన శ్రీహరి మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్ విషయమై ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలు చంద్రబాబును ఎందు కు అడగడం లేదని ప్రశ్నించారు. ఈ విషయం అడగలేని నేతలు అసెంబ్లీలో రాద్ధాంతం చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. అయితే, టీడీపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ పార్టీని కానీ, చంద్రబాబును కానీ తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment