photo gallery

 

Monday, February 2, 2015

మొదటి సంతకం విలువను పాడుచేసిన బాబు

ఎన్నికల వాగ్దానాల అమలులో మొదటి సంతకానికి ఉన్న విలువను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుంగలో తొక్కి తన మోసకారి తనాన్ని బయటపెట్టారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సాయంత్రం తణుకు మండల పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సమావేశానికి నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంక రవీంద్రనాథ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి రాష్ట్రంలోని రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను నిలువునా ముంచారన్నారు.

No comments:

Post a Comment