photo gallery

 

Wednesday, February 25, 2015

బాబు సర్కారుకు వ్యతిరేకంగా జాతీయస్థాయి ఉద్యమం

ఏపీలో అన్యాయంగా భూములు లాక్కుంటున్న చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. రాజ ధాని పేరిట పంటలు సాగవుతున్న భూముల్ని లాక్కునే కార్యక్రమానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను కలవనున్నామన్నారు. భూ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద అన్నాహజారే చేపట్టిన ధర్నాకు వైఎస్సార్‌సీపీ, ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతుకూలీల పరిరక్షణ వేదిక మద్దతు తెలి పింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

No comments:

Post a Comment