photo gallery

 

Tuesday, February 24, 2015

బాబు ప్రజలకు ఏమైనా చేశారా?

 సీం చంద్రబాబునాయు డు తన తొమ్మిది నెలల పాలనలో వై ఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పు డు కేసులు పెట్టించడం తప్ప ప్రజలకు ఏమైనా చేశారా? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే నారాయణస్వా మి ప్రశ్నించారు. చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సోమవారం పెనుమూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఎలాగైనా అధికారంలో కి రావాలని ఎన్నో హామీలు, వాగ్దానా లు ప్రజలకు ఇచ్చారని చెప్పారు. వాటి లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయక చేతులు ఎత్తేశారని విమర్శించారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మా ఫీ  పథకాల వల్ల ప్రజలు ఏ మేరకు లబ్ధిపొందారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి బాబూ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉద్యమాలు చేస్తుంటే వారిని భయపెట్టడానికి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని సీఎంగా చంద్రబాబు చ రిత్ర సృష్టిస్తారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నీరు- చె ట్టు కార్యక్రమం టీడీపీ కార్యకర్తలు ఆర్థికంగా సంపాదించుకోవడానికి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నా రు.

No comments:

Post a Comment