photo gallery

 

Monday, February 2, 2015

మోసం బాబు నైజం!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమా ఫీ పేరిట రైతులు, డ్వాక్రా మహిళలను నమ్మించి, మో సం చేశారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మోసం చేయడం చంద్రబాబు నైజమని ధ్వజ మెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతుదీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివా రం ఆమె ఇక్కడి విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల్లో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనంతరం విస్మరిం చిన చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నార న్నారు. కురుపాం నియోజకవర్గంలో ఒక రైతుకు రూ. 150 మాత్రమే రుణమాఫీ అయ్యిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఇదే నెలకొందన్నారు. ఎన్నికల మే నిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నీటిలో మూ టలగానే మిగిలాయన్నారు. బాబు ఏడు నెలల పాలన పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు తమ పార్టీ ఎప్పుడూ అం డగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment