photo gallery

 

Saturday, February 28, 2015

మార్చి 3న చంద్రబాబుకు పోటీ సభ

ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెం బ్లీలో ఆమోదించి పెద్ద మాదిగను అవుతానని ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు అలా చేయకుండా మాది గ ద్రోహిగా మిగిలారని ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. హన్మకొండ నయూంనగర్‌లో మాదిగ లాయర్ల ఫెడరేషన్(ఎంఎల్‌ఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 3వ తేదీన కరీంనగర్‌లో నిర్వహించే సభకు రావడానికి ముందే చంద్రబాబునాయుడు వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో ఆయన సభకు పోటీగా తాము సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇక గతంలో మూడు సార్లు ప్రధాన మంత్రిని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్ సైతం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment