photo gallery

 

Saturday, February 28, 2015

చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుందాం: మంద కృష్ణ

 ఎస్సీ వర్గీకరణపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో తాడోపేడో తేల్చేకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో శుక్రవారం జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ముందు వర్గీకరణకు అనుకూలమన్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే వెనుకంజ వేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు మార్చి 3న కరీంనగర్ రానున్నారని, ఆయన ఇక్కడి నుంచి వెళ్లేంత వరకు వణుకు పుట్టించేందుకు మాదిగలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment