జిల్లాలోని నైరాలో ఉన్న
ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చర్ కాలేజీలో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు
మంగళవారం రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న జిల్లా కలెక్టరు
లక్ష్మీనరసింహం, కళాశాల ప్రిన్సిపాల్ జోగినాయుడు,వెంకట్రావు తదితరులు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ
శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలన్నారు. ఈ శిబిరంలో 40 మంది కళాశాల
విద్యార్థులు రక్తదానం చేశారు.
No comments:
Post a Comment