ప్రజలను వంచించడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని కడప ఎంపీ వైఎస్
అవినాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక బాకరాపురంలోని వైఎస్ జగన్
క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలముందు అధికారంలోకి
రావడానికి అనేక హామీలను గుప్పించారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ
ఒక్క హామీని అమలుపరిచిన పాపానపోలేదన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి
సమస్యలపై పోరాటాలు చేస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని
మంత్రులచేత, ఎమ్మెల్యేలచేత బురదచల్లించే ప్రయత్నాలు బాబు
చేస్తున్నారన్నారు. జగన్‌ను విమర్శిస్తున్న టీడీపీ నాయకులు ముందుగా తమ
పార్టీ అధినేత ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీయాలన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీని పోలీసుల సాయంతో అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేయండని
మంత్రులే పార్టీ నాయకులకు పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు.
No comments:
Post a Comment