ఏపీకి ప్రత్యేక హోదా
అంశం ఆర్థిక, హోంశాఖ పరిధిలో ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.
శుక్రవారం వెంకయ్య నివాసం ముందు విద్యార్థి జేఏసీ నేలు ఆందోళనకు దిగారు.
దీనిపై వెంకయ్య స్పందిస్తూ ధర్నాల వల్ల ప్రచారం తప్ప ఏపీకి వచ్చేదేమీ
లేదన్నారు. ప్రత్యేక హోదాపై త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకునేలా కృషి
చేస్తానని స్పష్టం చేశారు. ప్రచారం కోసమే తనను టార్గెట్ చేస్తున్నారని
మండిపడ్డారు. తనను విమర్శించే హక్కు ఇతర పార్టీలకు లేదన్నారు.
ఏపీకి
ప్రత్యేక హోదా అర్హత లేదని 14వ ఆర్థిక సంఘం చెబుతోందన్నారు. తాను
కేంద్రంలో ఉంటే తెలుగు రాష్ర్టాలకు నెలకో ప్రాజెక్టు వస్తుందన్న వెంకయ్య
చట్టంలో పేర్కొనని ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయంటే అందుకు తానే కారణమని
తెలిపారు. అంతకు ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి జేఏసీ నేతలను
అడ్డుకోవడంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.
No comments:
Post a Comment