photo gallery

 

Tuesday, January 27, 2015

భ్రమల్లో పెడుతున్న బాబు

చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆదివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

అధికారం చేపట్టిన ఏడెనిమిది నెలల కాలంలో దావోస్, సింగపూర్, జపాన్ దేశాలను పర్యటించిన సీఎం ఆ పర్యటనల కారణంగా రాష్ట్రానికి రప్పించిన విదేశీ పెట్టుబడులేమిటో శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, రూ.254 ఉండాల్సిన యూరియా బస్తాను తెల్లవారుజామున నుంచి క్యూలో నిలబడి రూ.370- 420లకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని న్నారు.

No comments:

Post a Comment