‘‘నేను 80 వేల రూపాయల తీసుకుంటే వడ్డీ రూ. 13,721 అయింది. నాకున్న వేల రూపాయలు మాఫీ అవుతాయని చంద్రబాబుకు ఓటు వేసాను.. ఇప్పుడు మాఫీ అయ్యింది కేవలం రూ. 3,505 మాత్రమే. బాబు మమ్మల్ని నట్టేట ముంచేసాడు.. ఈ కాగితాలు పట్టుకొని ఎన్ని సార్లు బ్యాంకులు చుట్టూ, అధికారులు చుట్టూ తిరుగుతున్నానో దేవుడికే తెలుసు.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు సరికదా అడిగితే గసిరేసి పొమ్మంటున్నారు... ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం నారాయణప్పవలసకు చెందిన రైతు గేదెల సూర్యనారాయణ ఆవేదన ఇది. ‘‘కౌలు రైతు అర్హత కార్డుతో రూ. 20 వేలు పంట రుణం, రూ. 1.35 లక్షలు బంగారు రుణం తీసుకున్నాను. రుణ మాఫీకి అవసరమయ్మే ఆధార్, గుర్తింపుకార్డులు ఇచ్చాను.
No comments:
Post a Comment