సభ్యత్వ నమోదు చేయడంలో టీడీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఓడించిన ధీశాలి గల్లా అరుణకుమారి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనియాడారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో చంద్రగిరి సభ్యత్వ నమోదు సంబరాలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే గర్వించే నాయకురాలు గల్లా అరుణకుమారి అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు సంబరాలు చూస్తుంటే సంక్రాంతి ముందుగానే వచ్చినట్లుందన్నారు. ఓడిన చోటే మళ్లీ విజయాన్ని వెతికేందుకు కృషి చేస్తున్న కెరటమని గల్లా అరుణకుమారిని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అభినందించారు.
No comments:
Post a Comment