photo gallery

 

Wednesday, January 7, 2015

చినబాబు దయ ఉంటేనే..

పైరవీకారులకే పెద్దపీట!
సీనియారిటీ, పార్టీ సేవకు మొండిచేయి
నామినేటెడ్ పోస్టుల భర్తీ తతంగం ఇదీ
ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు


 నామినేటెడ్ పదవుల పందేరం పెత్తనం చినబాబు చేతిలో పడింది. పదవులపై ఆశలు పెట్టుకున్న టీడీపీ తమ్ముళ్ల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. సీఎం చంద్రబాబు నామినేటెడ్ పదవుల భర్తీకి తెరతీడయంతో జిల్లాలో టీడీపీ నేతలు భారీ ఆశలు  పెట్టుకున్నారు. కానీ పదవులకు నేతలను ఎంపిక చేసే బాధ్యతను సీఎం చంద్రబాబు తన తనయుడు లోకేష్‌కు అప్పగించారు. పార్టీలో సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలు, ఎన్నికల్లో టిక్కెట్ల రేసులో వెనక్కితగ్గడం తదితర అంశాల ప్రాతిపదికగా పదవుల భర్తీ జరుగుతుందని ఆశించిన నేతలు తాజా పరిణామంతో హతాశులయ్యారు.

No comments:

Post a Comment