చంద్రబాబు ప్రభుత్వం నెల రోజులకే సమస్యలు పరిష్కరించకుండా బోర్డు తిప్పేసిందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి హేళన చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహిస్తున్న మండల పర్యటనకు గురువారం జిల్లాలోని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునీల్, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చౌడేపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ రాష్ర్టంలో ప్రజ లను మోసగించి, ప్రజాభిమానం కోల్పోయిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నీతి నిజాయితీ ఉంటే తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి రైతులు, ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment