photo gallery

 

Saturday, January 10, 2015

చంద్రబాబు ఎన్నికల ముందు ఏం చెప్పారు?

ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపు వాగ్దానాలకు, అబద్దాలకు విసుగెత్తి ప్రజలందరూ తమ తరపున పోరాటం చేయాలని కోరుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  ఆయన శనివారం కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నేతలతో  రెండోరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...ఎన్నికల ముందు ఏం చెప్పారు?... ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారన్నది చంద్రబాబు తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని సూచించారు. అందుకే బాబు రోజుకో అబద్దం చెబుతున్నారని, ఆయన నిజం చెప్పిననాడు.. జనం ఆయన్ని రాళ్లతో కొడతారని వైఎస్ జగన్ అన్నారు.

No comments:

Post a Comment