రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు స్మార్ట్ గ్రామాల పథకానికి శ్రీకారం చుట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం జరిగిన తొలి రైతు సాధికార సదస్సులో ఆయన పాల్గొన్నారు. రుణమాఫీ పథకం కింద తొలి విడత లబ్ధి పొందిన రైతులకు రుణవిముక్తి పత్రాలను అందజేశారు. అనంతరం సదస్సుకు హాజరైన వేలాదిమంది రైతులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.
No comments:
Post a Comment