రాజధాని కోసం సమీకరించే మెట్ట భూమికి ఎకరాకు వెయ్యి గజాల చొప్పున రెసిడెన్షియల్, 200 గజాల వంతున కమర్షియల్ ప్లాటు ఇస్తారు.
జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల రెసిడెన్షియల్ ప్లాటు, 300 గజాల కమర్షియల్ ప్లాటు ఇస్తారు.
అసైన్డ్ భూములకు ఎకరాకు 800 చొప్పున రెసిడెన్షియల్ ప్లాటు ఇస్తారు. (మెట్ట, జరీబు రెండింటికీ ఇంతే). కమర్షియల్ మాత్రం... అసైన్డ్ మెట్ట భూములకు వంద చదరపు గజాలు, జరీబు భూములకు మాత్రం 200 గజాల చొప్పున ఇస్తారు.
పదేళ్లపాటు ఏటా చెల్లించే పరిహారం మెట్ట భూములకు రూ.30వేల చొప్పున ఇస్తారు. ప్రతిఏటా 10 శాతం అంటే... 3 వేలు పెంచుతూ పోతారు. జరీబు భూములకు ఎకరాకు రూ.50వేల చొప్పున చెల్లిస్తారు. ఏటా రూ.5వేల చొప్పున పెంచుతారు.
రైతులు ప్రభుత్వానికి భూమి అప్పగించిన వెంటనే రసీదు ఇస్తారు. వారి వాటా భూమిపై 9 నెలల్లోనే యాజమాన్య హక్కులు కల్పించి, మూడేళ్లలో అభివృద్ధి చేసిన స్థలాలు అప్పగిస్తారు.
భూ సమీకరణ ప్రాంతంలో రైతులు, కౌలుదారులు అందరికీ... ఒకేసారి 12వేల కుటుంబాలకు చెందిన రూ.200 కోట్లు రుణమాఫీ జరుగుతుంది.
రైతుల నుంచి భూమి సేకరించిన జోన్‌లోనే వారి వాటా ప్లాట్లు కూడా అప్పగిస్తారు. ఒకే రైతుకు సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో భూములిచ్చే రైతులకు ఒకేచోట నిష్పత్తి ప్రకారం స్థలం ఇస్తారు.
రాజధాని ఏర్పడ్డాక సంబంధిత రైతులకు రిజిసే్ట్రషన్, ఇతర ఫీజుల నుంచి మినహాయింపు.
కౌలుదారుల కుటుంబాల కోసం క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఏర్పాటు చేసి... నెలకు రూ.2500 చొప్పున పదేళ్లపాటు సహాయం.
రాజధాని ప్రాంత భూ సమీకరణలో భాగస్వాములైన రైతులకు నివాస, వాణిజ్యం స్థలాలను ఆయా కేటగిరీల వారీగా లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు.
ఇళ్లు లేనివారికి, రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే వారికి ప్రభుత్వమే నివాస గృహాలు నిర్మించి ఇస్తుంది.
గ్రామకంఠంలో ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తారు.
భూ సమీకరణ ప్రాంతంలో నేటి వరకు (డిసెంబర్ 8) నివాసం ఉన్న అందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యం.
వృద్ధులకు ఆశ్రమాలు, పేదలకు అన్న క్యాంటీన్లు, కూలీలకు 365 రోజులపాటు ఉపాధి హామీ అమలు.
పేద కుటుంబాల వారికి స్వయం ఉపాధి అవకాశాల కోసం రూ.25లక్షల వరకూ వడ్డీలేని రుణసాయం. నిర్మాణ పనులకు స్థానికుల ట్రాక్టర్లే ఉపయోగిస్తారు.
ప్రస్తుతం భూముల్లో ఉన్న పంటలు రైతులకే చెందుతాయి. నిమ్మ, సపోటా, జామ తోటల రైతులకు ఎకరాకు రూ.50వేలు అదనపు సాయం.
భూముల రిజిసే్ట్రషన్లు కొనసాగుతాయి. టేకుచెట్ల అమ్మకాలకూ అనుమతి ఇస్తారు.
దేవాదాయ శాఖ భూములుంటే వాటికి కూడా రైతుల తరహాలోనే పరిహారం.
శ్మశానాలు, ప్రార్థన స్థలాలకు ప్రాధాన్యం.
స్థోమత, ఆసక్తి ఉన్న రైతులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు శిక్షణ.
రాజధాని నిర్మాణం పూర్తి అయ్యాక ఒక ముఖ్య భవనానికి మాజీ మంత్రి, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ఎస్ కోటేశ్వరరావు పేరు.
భూ యజమానుల పేర్లను బహిరంగంగా ప్రకటించి సవరణలు స్వీకరించాక తుది జాబితా విడుదల చేస్తారు.
No comments:
Post a Comment