ఊరంతటికీ విద్యుత్‌షాక్ రావడంతో ఓ యువకుడు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కోనాయపల్లి (పీటీ)లోమంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం 6.30 గంటలకు సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించిన చెట్టి శ్రీకాంత్ (21) అనే యువకుడు షాక్‌కు గురైయ్యాడు. గమనించిన అతడి తల్లి తండ్రులు శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇదే ఘటనలో గ్రామానికి చెందిన తూం ఆనద్, తూం మంగమ్మ, మన్నె సురేఖ, బక్క అరుణ, బక్క శోభ, చెట్టి మహిపాల్, చెట్టి పృథ్వీరాజ్‌లు విద్యుత్ షాక్ గురై గాయపడ్డారు. అయితే.. కోనాయపల్లి(పీటీ) సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌లో పది రోజులుగా ఎర్తింగ్ లోపం తలెత్తిందని, దీంతో విద్యుత్ షాక్ సమస్య వస్తోందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment