ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై తీర్మానం చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగలను మోసగించారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. టీడీపీ మోసపూరిత విధానాలకు నిరసనగా మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాదిగలను మోసం చేసిన టీడీపీ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
No comments:
Post a Comment