చెవిటి, మూగ యువతిపై కొందరు గుర్తుతెలియని దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన బుధవారం రాత్రి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఓ యువతి, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను మధ్యలో ఆపేసింది. ప్రస్తుతం కుట్టు మిషన్ నేర్చుకుని కుటుంబానికి ఆసరా అందిస్తోంది. కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి బుధవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. అదే రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో ఆ యువతి బహిర్భూమికి బయటకు వచ్చింది. చాలా సేపైనా ఆమె రాకపోవడంతో తండ్రి బయటకు వచ్చి కూతురు కోసం వెతకగా ఇంటి ఆవరణలోనే ఓపక్క అపస్మారక స్థితిలో పడి కనిపించింది.
No comments:
Post a Comment