ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ యంత్రాంగానికి, నగరపాలక సంస్థ అధికారులకు, పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉదయం ఆరున్నర గంటలకే ప్రభుత్వ అతిథి గృహం నుంచి తనిఖీలకు బయలుదేరారు. సిటీ మ్యాప్‌ను దగ్గర పెట్టుకుని ముందుకు సాగారు. ముందు చెపితే బందోబస్తు ఏర్పాటు చేస్తామన్న పోలీసులకు బాబు ఘాటుగా జవాబు ఇచ్చారు. నా వెంట రండి అంటూ ముందుకు కదిలారు.
No comments:
Post a Comment