photo gallery

 

Saturday, December 13, 2014

రైతు ఆత్మహత్యలపై కేంద్రానికి టీ-సర్కారు నివేదిక

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలు ఎన్ని? 300లకుపైగానే అని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. 400లకుపైమాటే అని విపక్షాలు అంటున్నాయి. కానీ, రాష్ట్రంలో 69 మంది రైతులు బలవన్మరణం పాలైనట్లు టీ-సర్కారు కేంద్రానికి తెలిపింది.
 తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆరునెలల్లో 69 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు టీఆర్‌ఎస్‌ సర్కారు అంగీకరించింది. దీనిపై స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి మోహన్‌ భాయ్‌ కుందారియా శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్‌ సభ్యుడు వి.హనుమంతరావు అడిగిన ప్రశ్నకు శుక్రవారం కుందారియా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం...గత ఆరు నెలల్లో తమ రాష్ట్రంలో 69 మంది రైతులు చనిపోయారని తెలంగాణ సర్కారు వెల్లడించింది. కరువు, వరదలు, వర్షాభావం తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల తలెత్తిన పంట నష్టం, సామాజిక అవమానం, మానసిక క్షోభ... ఆత్మహత్యలకు కారణమని వివరించారు.

No comments:

Post a Comment